Nato అంటే ఏమిటి ? రష్యాకు ఎందుకు నాటో అంటే కోపం?

212
russia attack
russia attack

అసలు రష్యా దున్నపోతు మాదిరిగా ఉక్రెయిన్ పై ఎందుకు దాడి చేసింది?. సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ నాటోలో చేరుతానన్నందుకు. మరి నాటో అంటే ఏంటి? నాటో అంటేనే పుతిన్ ఎందుకు కస్సుమంటున్నాడు? ఆ వివరాలేందో చూద్దాం.

1939 లో మొదటి ప్రపంచ యుద్దం మొదలైంది. 1945 నాటికి అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్ కూటమి దేశాలు విజయం సాధించాయి. ఇటు హిట్లర్ ను తొక్క తీసేందుకు రంగంలోకి వచ్చిన రష్యా కూడా పోరాడింది. ఇక యుద్దం ముగిసింది. మనం గెలిచామని అంతా ప్రకటించుకుని సంబరాలు చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్దానికి కొబ్బరి కాయ కొట్టిన బెర్లిన్ లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా కొన్ని దేశాల సైన్యాధికారులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ తూర్పు జర్మనీలోకి వచ్చిన సోవియట్ యూనియన్ తాను వెళ్లనని భీష్మించింది. మొత్తం ప్రాంతాన్ని దిగ్బందించింది. పైగా విమానాల ద్వారా సైన్యాన్ని తూర్పు జర్మనీ ప్రాంతానికి తరలించింది. అంతే కాదు పోలాండ్ లాంటి దేశాల్లో కూడా తిష్ట వేసింది. నాటి సోవియెట్ అధ్యక్షుడు స్టాలిన్ తో ఎంత చర్చలు జరిపినా సరే వినలేదు. చివరకు సోవియెట్ యూనియన్ తో తాడోపేడో తేల్చుకుని తూర్పు జర్మనీ ప్రాంతాన్ని రక్షించాలనుకున్నారు. మొత్తం 12 దేశాలు నాటో కూటమిగా ఏర్పడి..సోవియెట్ యూనియన్ అంతు చూడాలనుకున్నాయి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఉత్తర అట్లాంటిక్ దేశాల సుస్థిరత, రక్షణ, స్వాతంత్ర్యంతో పాటు ఉమ్మడి వారసత్వం, ఉమ్మడి పోరాటంగా సరిహద్దులను కాపాడుకోవాలనేది దీని ఉద్దేశం. వాటికి అమెరికా నాయకత్వం వహిస్తోంది. ఈ కూటమిలో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ , ఇటలీ, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, నార్వే, ఐస్ లాండ్,లగ్జంబర్గ్, డెన్మార్క్, పోర్చుగల్ దేశాలుగా రంగంలోకి దిగాయి. యుద్దం మరోసారి పతాక స్తాయికి వెళ్లే పరిస్తితి కి వచ్చింది. దీంతో సోవియెట్ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నాటోకు వ్యతిరేకంగా 1955లో తూర్పు ఐరాపో కమ్యూనిస్టు దేశాలతో కొత్త కూటమిని ఏర్పాటు చేసింది సోవియెట్ యూనియన్. దీంతో హారోహారిగా రెండు కూటములు నిలబడ్డాయి. పైగా రష్యా దూకుడు చూసి నాటో సభ్య దేశాలపై ఎప్పుడు ఎలాంటి ముప్పు వాటిల్లినా సరే సొంత దేశంపై చేసిన యుద్దంగానే పరిగణించాలి. అంటే ఎవరికి ముప్పు ఉన్నా సొంత దేశంపై దాడిగా తీసుకుని ఈ 12 దేశాలు పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు. నాటో ట్రీటీలో ఐదవ క్లాస్ లోని ముఖ్యమైన పాయింట్ ఇదే. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. మధ్యలో యుగోస్లేవియా విచ్చిన్నం తర్వాత నాటో కొంత యాక్టివ్ అయింది కానీ…నాటి పరిస్థితులు వేరు.

మరి రష్యాకు ఎందుకు నాటో అంటే కోపం? దీనికి సింపుల్ ఆన్సర్ అమెరికా. నాటో కు మొత్తం డబ్బును, ఆయుధాలను 70శాతం ఇస్తోంది అమెరికానే. ఆదేశం చెప్పినట్లే ఈ నాటో దేశాలు నడుచుకుంటాయి. మరి ఉక్రెయిన్ మీద దాడి చేసేంతగా పుతిన్ ఎందుకు వెళ్లారంటే దానికీ కారణం ఉంది. 1991 డిసెంబర్ 2న సోవియెట్ యూనియన్ పతనమైంది. దాంతో 15 కొత్త దేశాలు ఏర్పడ్డాయి. నాటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సెంకి మద్యానికి బానిస. పైగా పశ్చిమ దేశాలతో రాసుకు పూసుకు తిరిగేవాడు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. ఆయన కారణంగానే సోవియట్ యూనియన్ దేశాలను అమెరికా దగ్గర చేసుకుందనేది పుతిన్ భావన. ఎందుకంటే రష్యానుంచి విడిపోయిన దేశాలకు నాటోలో సభ్యత్వం ఇచ్చింది అమెరికా. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా , అల్బేనియా, మాంటెనిగ్రో, నార్త మసిడోనియా లాంటి దేశాలకు నాటోలో సభ్యత్వం ఇచ్చింది అమెరికా. రష్యా భయానికి చెక్ రిపబ్లిక్, పోలండ్, హంగేరి లు కూడా నాటోలో చేరాయి. మిగతా దేశాలకు సాయం చేస్తామని, నోటో అనుబంధ దేశాలుగా గుర్తిస్తాం. మీరు భయపడొద్దని నోటి మాటగా నాడు క్లింటన్ ఇతర దేశాలకు చెప్పారు. నాటో బలోపేతం అవడంతో పాటు మాస్కోకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కూటమి దళాలు క్షిపణులను మోహరించాయి. 12 నుంచి 30 దేశాలకు నాటో కూటమి చేరింది. వీటిపై రష్యా దండెత్తితే నాటో ఊరుకోదు. మాస్కోను గంటలో నేలమట్టం చేస్తాయి. దీంతో పుతిన్ అధ్యక్షుడు కాగానే రగిలిపోయాడు. ఆర్దికంగా బలహీనంగా ఉండటంతో చేసేది లేక పుతిన్ కూడా నాటో కు దగ్గరయ్యాడు. నాటో మాస్కో కామన్ ఎజెండాతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. నాటో రష్యా కౌన్సిల్ అని ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక నాటోలోకి రష్యా రావడంతో యూరప్ తో దేశాలకు ఎలాంటి ముప్పు లేదనుకున్నారు. కానీ పుతిన్ నీచుడు కదా.

russia attack
Russia attack

2014 లో క్రిమియాను ఆక్రమించుకున్నాడు. ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాటో దేశాలు రష్యాను బయటకు తన్ని తరిమేశాయి. అంతే కాదు ఈ ఘటన జరగగానే ఉక్రెయిన్ తమకు వేగంగా నాటోలో సభ్యత్వం ఇవ్వాలని కోరింది. గతంలో ఇస్తామని నాటో చెబితే పుతిన్ కు అత్యంత సన్నిహితుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు కావడంతో తీరా సంతకాల సమయానికి తమకు వద్దన్నాడు. ఇప్పుడు రష్యా మాత్రం ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటే అంతు చూస్తామని చెప్పింది. ఎందుకంటే పశ్చిమ దేశాలు నాటో పేరుతో రష్యా సరిహద్దులు దాటి వస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని పుతిన్ అంటున్నాడు. ఉక్రెయిన్ ను చేర్చుకుంటే తడాఖా చూపిస్తామన్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం ప్రతి రోజు నాటో మీద ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టింది. పుతిన్ ఏ రోజైనా మమ్మల్ని మింగేస్తాడు. తొందరగా చేర్చుకుని కాపాడమని వేడుకున్నాడు. దీంతో ఇప్పుడు అలెర్ట్ కాకుంటే గతంలో రష్యా నుంచి విడిపోయిన మిగతా దేశాలు కూడా నాటోలో చేరుతాయని భయపడ్డాడు. అదే జరిగితే సోవియట్ యూనియన్ ను స్థాపించడం కష్టం. పైగా అమెరికా ప్రాభల్యం పెరుగుతుందనుకున్నాడు. దీంతో మొదటి హెచ్చరికగా ఉక్రెయిన్ మీద దాడి చేశాడు. అమెరికా కు ఇతర దేశాలకు బ్రేక్ వేశాడు పుతిన్. ఎందుకంటే నాటో రష్యా కంటే వంద రెట్లు బలమైన కూటమి. ఏటా 11వందల బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతోంది నాటో. రష్యా మొత్తం రక్షణ బడ్జెట్ 60 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇక 30 దేశాలకు 30 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఇక పుతిన్ ఓవరాక్షన్ చేసినా గంటలో మాస్కో మొత్తం నేల మట్టమైపోతుంది. నాటోను ముట్టుకుంటే మసై పోతామనుకున్నాడు. అందుకే మిగతా దేశాలను నాటోలో చేర్చుకుంటే తొక్క తీస్తానని హెచ్చరించాడు. ఎందుకంటే అమెరికా పెత్తనం రష్యాకు నచ్చదు. భవిష్యత్ లో నాటో లో కొత్త దేశాలను చేర్చుకోవద్దనేది పుతిన్ భావన. ఎందుకంటే మిగతా మాజీ సోవియెట్ యూనియన్ దేశాలను తన కింద పెట్టుకోవాలనేది ప్లాన్. అందుకే నాటో అంటేనే పుతిన్ కు చిరాకు, భయం.

Previous articleమంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో షాకింగ్ నిజాలు
Next articleషేన్ వార్న్ గ్రౌండ్ లోనే కాదు వివాదాలు, రతి క్రీడల్లో కూడా గొప్ప క్రీడాకారుడే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here