ఉక్రెయిన్ లో మొన్నటి వరకు సామాన్యులు బతుకు పోరాటం చేసేవారు. కానీ నేడు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. రష్యా చేస్తున్న మెరుపు దాడులతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సిటీ లోకి వచ్చే రష్యన్ సైనికులను చంపేందుకు, వారి ట్యాంక్ లను నాశనం చేసేందుకు ప్రతి పౌరుడు ఒక ఆయుధమై రంగంలోకి దిగాడు. డోంట్ ప్యానిక్, గెట్ రెడీ అనేది మొదటినినాదమైతే..నా ఇల్లు, నా దేశం అంటూ యుద్దానికి సిద్దమయ్యారు. అది కూడా బీర్ బాటిళ్లతో. అవును మీరు విన్నది నిజమే. దేశంలోనే అదిపెద్దదైన బీరు కంపెనీ ప్రవదా బ్రయూరీ తన వంతుగా యుద్ద రంగంలోకి దిగింది. రండి…మేము మొన్నటి వరకు వ్యాపారం చేశాము. ఇప్పుడు దేశం కోసం మా వంతు పాటుపడతాం. మీరూ ఓ చేయి వేయమని కోరింది. ఖర్చు మాదే. పోరాటం మనందరిదీ అంటూ బీరు ప్రొడక్షన్ ఆపేశారు. ఆ స్తానంలో బీరు సీసా బాంబులను తయారీ మొదలు పెట్టారు. అంతే కాదు ఉక్రెయిన్ సైనికులను రంగంలోకి దించి బీరు సీసాలతో బాంబులను ఎలా తయారు చేయాలి? ఎలా విసరాలనేదానిపై పౌరులకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో జనం తాము సైతం అంటూ పిల్లా పెద్దా అనే తేడా లేకుండా బీరు బాంబులను సిద్దం చేసుకున్నారు.
బీరు కంపెనీ విపరీతంగా మొలొటోవ్ కాక్ టెయిల్ ను తయారు చేస్తోంది. మామూలుగా మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. బీరు సీసాలు పెట్రోల్, లేదా డీజిల్, కిరోసిన్ ను నింపి…దానికి సీల్ వేసి బయటకు చిన్న క్లాత్ ను వదులుతారు. దానికి మంట అంటించి విసిరేస్తే సీసా పగలగానే బాంబులా పేలుతుంది. దాని గాజు వక్కల నుంచి పెట్రోల్ వరకు టార్గెట్ ను మండిస్తుంది. అయితే సామాన్యులకు పెట్రోల్, డీజిల్ అయితే ప్రమాదమని ఇప్పుడు ఒక రకమైన మొలొటోవ్ కాక్ టెయిల్ ను తయారు చేస్తూ ఉచితంగా ఆయా ప్రాంతాలకు సీసాలతో పాటు పంపిస్తోంది. జిగురులాంటి లామ్టెక్స్ లేదా నాప్లమ్ లాంటి మండే స్వభావం ఉన్నవాటిని తయారుచేసి వారికి ఇస్తోంది బీరు కంపెనీ. గ్లౌస్ లు వేసుకుని చిన్నపిల్లలైనా సరే సీసాలోకి వాటిని నింపు సీలు వేయాలి. ఆ తర్వాత గుడ్డ పేలికను బయటకు వదిలితే చాలు. దానికి నిప్పంటించి విసిరితే బాంబులా పేలుతుంది. ఇలాంటి వాటినే జనం తయారు చేసుకుంటున్నారు. ఎక్కడ రష్యాన్ సైనికులు కానీ కాన్వాయ్ కనిపించినా సరే బిల్డింగ్ లపైకి ఎక్కి వారిపై బీరు బాంబులను విసరుతున్నారు సామాన్య పౌరులు. యుద్దంలోకంటే ఈ పోరులోనే రష్యా సైనికులు వందల సంఖ్యలో చనిపోయారట. దీంతో బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్ నుంచి కిందకు దిగకుండా వేగంగా వెళ్తున్నాయట రష్యా దళాలు. సామాన్య జనాలు ఉన్న ప్రాంతాల్లోకి రావాలంటేనే రష్యా సైనికులు వణికిపోతున్నారు. ఎందుకంటే బాంబుల కంటే ఏ భవనం పై నుంచి ఏ బీరు సీసాల వర్షం కురుస్తుందోననేది వారి భయం. కొన్ని సార్లు యుద్ద ట్యాంక్ లు కూడా తగలబడటం తో వాటిని వదిలేసి పారిపోయారు రష్యా సైనికులు. ఇప్పుడు ఏకే ఫార్టీ సెవన్ ఉన్నా సరే రష్యన్ సైనికులు జనావాస ప్రాంతాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే రష్యా యుద్ద విమానాల ద్వారా బాంబులు విసిరేసి సామాన్యులను చంపుతుందని ఆరోపిస్తోంది ఉక్రెయిన్.
అయినా సరే మీరు పై నుంచి ఎన్ని బాంబులైనా వేయండి. కానీ మా నేల మీదకు వస్తే మాత్రం మీకు ఇక్కడే సమాధి అంటున్నారు పౌరులు. మీరు చంపడానికి వచ్చినా సరే మీరు ప్రాణాలతో మాత్రం వెళ్లరు. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. నాలుగు కోట్ల మందిలో కోటి మంది మిగిలినా చాలు. కానీ ఉక్రెయిన్ జాతీయ పతాకం రెపరెపలాడాలి. మా నేలను ఇంచుకూడా వదులుకోమంటున్నారు. ఈ బీరు సీసా బాంబుల ఉద్యమం ఇప్పుడు దేశం మొత్తం పాకింది. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం ప్రవదా బ్ర్యూయరీ కంపెనీ చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. దేశంలోని ప్రతి బీరు కంపెనీ, వైన్ కంపెనీ బీరు లేదా ఇతర సీసాలతో బాంబులు తయారు చేయండి. రష్యా సైనికుడు కనిపిస్తే చాలు మన నేల మీదే చావాలంటూ పిలుపునిచ్చారు అధ్యక్షుడు. దీంతో సెంట్రల్ ఉక్రెయిన్ లోని నిప్రో సిటీ నుంచి లక్షల కొద్ది బీరు బాంబులను సిటీ మొత్తం పంచారు. ఆయా ప్రాంతాల్లో దీనిని ఉద్యమంగా చేపట్టారు. నా కుటుంబం, నాదేశం అంటూ పౌరులు రష్యా మీద రగిలిపోతున్నారు. అందుకే 4 రోజుల్లో ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుంటానన్న పుతిన్ కు ఇలా పౌరులు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి హైవే మీద గొయ్యిలు తవ్వుతున్నారు. చిన్న చిన్న బాంబులు పెడుతున్నారు. దీంతో ఇక ముందుకు వెళ్లలేక, ఇంతకు ముందు వెళ్లిన రష్యా సైనికులు వెనక్కి రాలేక చస్తున్నారు. దీంతో ఆకాశం నుంచి దాడి మొదలు పెట్టాడు పుతిన్. కానీ ఇప్పుడు ఈ బీరు బాంబుల పర్వం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకింది కొన్ని బీరు కంపెనీలు స్టిక్కర్లు అంటించి మరీ ఖాళీ సీసాలను పంచుతున్నారు. ఆ బాంబులకు పెట్టిన బ్రాండ్ పేరు తెలిస్తే మీరు షాక్ అవుతారు. తెలుగులో ట్రాన్స్ లేషన్ చేస్తే అది బూతవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే బొంగులో పుతిన్ బాంబ్ అనేది ఆ పూర్ మ్యాన్ బాంబ్ బ్రాండ్ పేరు. దీనిని మొదట రెండో ప్రపంచ యుద్దంలో ఫినిష్ సైనికుడు కనిపెట్టాడు. అది కూడా రష్యాకు వ్యతిరేకంగానే. మరోసారి రష్యా పాలిట పెను బాంబైందీ బీరు బాంబు.