సెల్ ఫోన్ ను కనిపెట్టడం వెనుక ఆసక్తికర కథ!

153
Mobile Evaluation

ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేకుండా బతకలేని టైమ్ కి చేరుకున్నాం. ఒక్క నిమిషం సెల్ లేకుండా ఉండలేం కూడా. ఫోన్ పోయింది అంటే రెండు రోజుల్లోపే సెల్ చేతిలో ఉండాలి. మనకు సెల్ అంటే నోకియా, సామ్సంగ్, ఆపిల్, మైక్రోమాక్స్ ఇలా కంపెనీల పేర్లు మాత్రమే తెలుసు. కానీ అసలు సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి పేరు దాని వెనుకున్న చరిత్ర చాలా మందికి తెలియదు. సెల్ ఫోన్ ను కనిపెట్టిన వ్యక్తి. ప్రపంచ వ్యాప్తంగా సర్వమానవాళికి సరికొత్త అనుభవాన్ని ఇవ్వడానికి కారణమైన మేథావి మార్టిన్ కూపర్. తర్వాత ఇతనే మార్టి కూపర్ అయ్యారు.

ఇక సెల్ ఫోన్ కనిపెట్టాలని ఆయనకు ఆలోచన రావడానికి కారణం అమెరికాకు చెందిన ఏటీ అండ్ టీ కంపెనీ. ఇప్పుడు యూఎస్ లో ఈ కంపెనీ అతిపెద్ద కమ్యూనికేషన్ కంపెనీ. ఇ క మార్టిన్ విషయానికి వస్తే ఆయన డిసెంబర్ 26,1928లో షికాగోలో జన్మించారు. ఆయన ఇలినాయిస్ ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక….యూఎస్ నేవీలో చేరారు. కొరియా యుద్దం తర్వాత తనకు రీసెర్చ్ పైన విపరీతమైన ఆసక్తి ఉండేది. దాంతో నేవీని విడిచి టెలిటైప్ కంపెనీలో చేరారు. ఆ తర్వాత వైర్ లెస్ కమ్యూనికేషన్ లో కింగ్ గా ఉన్న మోటరోలా కంపెనీలో చేరారు మార్టిన్. ఎన్నో ప్రాజెక్టుల్లో మార్టిన్ పాలుపంచుకున్నారు. అందులో రేడియో కంట్రోల్డ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం చాలా పాపులర్. న్యూయార్క్ లో ఫస్ట్ పోలీస్ రేడియోలను కూడా ఈయనే అందించారు. ఆ తర్వాత ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించారు. ఇప్పటికీ మోటరోలా రేడియోలనే తెలుగురాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత మోటరాలో

Mobile Evaluation
Mobile Evaluation

రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ కి వైస్ ప్రసిడెంట్ గా ఎన్నికయ్యారు మార్టిన్.

ఇంత వరకు బాగానే ఉంది కానీ ఏటీఅండ్ టీ కంపెనీ వైర్ లెస్ కమ్యూనికేషన్ లో సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. 1946లోనే మొబైల్ టెలిఫోన్స్ ని ఏటీఅండ్ టీ ప్రవేశపెట్టింది. అప్పట్లో ఇది సంచలనం. మారుతున్న టెక్నాలజీకి ఇది పునాదని చాలా మంది భావించారు. దీంతో పోటీ కంపెనీగా ఉన్న మోటరోలా వెనుకబడిపోయింది. ఇక ఏటీ అండ్ టీ ప్రవేశపెట్టిన మొబైల్ ఫోన్ లు కారులోనే ఉపయోగించాలి. అది కూడా ఒకే సారి పది పన్నెండు మాత్రమే పనిచేస్తాయి. మిగతావాళ్లు కనెక్ట్ కావాలంటే ఎవరో ఒకరు ఫోన్ పెట్టేసేవరకు వెయిట్ చేయాలి. అంతకంటే మరో తలనొప్పి విషయం బ్యాటరీ. కారు బ్యాటరీ పవర్ ఉంటే తప్ప పనిచేయదు. దాంతో అప్పటి నుండి మొబైల్ ఫోన్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇక 1968లో డైరెక్ట్ గా అమెరికన్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఏటీఎండ్ టీని ఫ్రీక్వెన్సీ పెంచి

సెపరేట్ టెలివిజన్ బ్యాండ్ కావాలని అడిగింది. అప్పుడే సెల్యులార్ ఆర్కిటెక్చర్ ను ప్రపోజ్ చేసింది. వీలైనన్ని ఎక్కువ కార్లకు మొబైల్ టెలిఫోన్ లు ఇస్తామని చెప్పింది.

ఇక ల్యాండ్ లైన్ ఫోన్స్ అంటే ఏటీఅండ్ టీనే. అంతలా అమెరికాలో పాతుకుపోయింది.

ఏటీఅండ్ టీ చేస్తున్న ప్రయోగాలతో మోటరోలా భయపడింది. ల్యాండ్ లైన్ లో మరొక కంపెనీకి ఛాన్స్ లేకుండా చేసింది ఏటీఅండ్ టీ. దీంతో సెల్ ఫోన్ లో కూడా ఈ కంపెనీ మొత్తం ఆక్రమించుకుంటుందని మోటరోలా యాజమాన్యం భయపడింది. ఆ కంపెనీకి చెక్ పెట్టాలని భావించింది. వెంటనే కార్ లో కాకుండా బయట ఉపయోగించుకునేలా ఎలాంటి బ్యాటరీ లింక్ కూడా లేకుండా ఉండే సెల్ ఫోన్ ను తయారు చేయాలని తమ టీమ్ ని ఆదేశించింది. ఇక రేడియో ఫోన్ టెక్నాలజీ కి ప్యారలల్ గా సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించారు. దీనికి హెడ్ గా ఉన్న మార్టిన్ డైనమిక్ ఎడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజ్ ఫోన్ ని తయారు చేశారు. ఇదే మొదటి సెల్ ఫోన్. ఆయన దానిని మొట్టమొదటి సెల్ ఫోన్ అని కాకుండా డైనాటాక్ అని పిలిచేవారు. ఫోన్ అంటే ఎలాంటి లింక్ లేకుండా చేతిలో అమరేలా ఉండాలనేది మోటరోలా ఉద్దేశం. అయితే మార్టిన్ తయారు చేసిన ఫోన్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువగానే బరువుంది. ఎందుకంటే ఇందులో బ్యాటరీ బరువే ఎక్కువగా ఉండేది. తొమ్మిది ఇంచుల పొడవుండేది. అయినా కూడా ఎలాంటి వైర్ లేకుండా చేతిలో పట్టుకుని పోయేలా ఉండటంతో అంతా ఉత్సాహంగా ఉన్నారు. మార్టిన్ చేసిన ఫోన్ అనుకున్నట్లుగానే పనిచేస్తోంది. దీంతో న్యూయార్క్ లో పెద్ద ప్రెస్ కాన్ఫిరెన్స్ ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇంత మీడియా కవరేజ్ లేకపోవడంతో…అపోజిషన్ కంపెనీ అయిన ఏటీఅండ్ టీకి కూడా మొదట తెలియలేదు.

ఇక జర్నలిస్టులను న్యూయార్క్ వీధుల్లోకి తీసుకెళ్లిన మార్టిన్ తన మొదటి కాల్ ని ప్రత్యర్ది గా భావించే ఏటీఅండ్ టీ హెడ్ అయిన జోయెల్ ఇంజనీర్ కు చేశారు మార్టిన్. తన అహం మీద దెబ్బకొట్టడానికి చాలా మాటలే వాడారు. ఆయన ఫోన్ ఎత్తగానే నేను మార్టిన్ ను మాట్లాడుతున్నాను. న్యూయార్క్ స్ట్రీట్ నుండి పోర్టబుల్ ఫోన్ ద్వారా ఫోన్ చేస్తున్నాను. నా సెల్ ఫోన్ చేతిలో ఇముడుతుంది. మొదటి కాల్ నీ ల్యాండ్ లైన్ కే చేస్తున్నాను అని చెప్పి ఏటీఅండ్ టీకి షాకిచ్చారాయన. అవతలి వ్యక్తికి కాసేపు నోట మాట రాలేదు. దీంతో ఇది పోర్టబుల్ ఫోన్ జోయల్ అని మరీ మరీ నొక్కి చెప్పారు. ఇంకేముంది అమెరికాలో మోటరోలా విప్లవం మొదలైంది. ఆఫోన్ లో బ్యాటరీ 35నిమిషాలు మాట్లాడుకునేంత సమయానికి సరిపోతుందని చెప్పడం అప్పట్లో సంచలనం. దాంతో మార్టిన్ పేరు అమెరికాలోనే కాదు అభివృద్ది చెందిన దేశాల్లో మారుమోగిపోయింది.

ఏటీఅండ్ టీ కంటే ముందే మోటరోలా మొదటి సెల్ ను ఆవిష్కరించింది. అది కూడా మార్టిన్ చేతుల మీదుగానే జరిగింది. జనాల దగ్గరకు వచ్చే సరికి సైజ్ ని బరువును సగానికి తగ్గించారు మార్టిన్. కాకపోతే ధర చాలా ఎక్కువగా ఉండేది. నార్మల్ ఫోన్ రెండు వేల డాలర్లు. హై అండ్ ఫోన్ ఆరోజుల్లోనే 3వేల9వందల 95 డాలర్లు. అంటే ఒక్క సెల్ ఫోన్ ధర దాదాపు మూడు లక్షల రూపాయలన్నమాట.

దాంతో ఆఫోన్ అతి తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండేది. ఫ్రీక్వెన్సీ పెంచినా కూడా జనాలకు చేరువ కాలేదు. దీంతో మార్టిన్ మోటరోలను వదిలి సెల్ ఫోన్ సాఫ్ట్ వేర్ పై దృష్టిపెట్టారు. ఇక ఫోన్ మార్కెట్లోకి వచ్చాక ఇతర కంపెనీలు కూడా ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఫోన్ సైజ్ ను మరింత తగ్గేలా చేయడమే కాదు ధరను కూడా నాలుగే వేల డాలర్ల నుండి వెయ్యి డాలర్లకు దించారు. అలా మార్టిన్ ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ఇక సెల్ లో ఎన్ని మార్పులు చేసినా కూడా మొట్టమొదట సెల్ ను కనిపెట్టిన ఘనత మాత్రం మార్టిన్ కే దక్కింది. అయితే ఫోన్ ను నేను కనిపెట్టినా కూడా దాంట్లో కెమరా వచ్చాకే సమాజంలో అసలైన రివల్యూషన్ వచ్చిందంటారు మార్టిన్. ఇప్పుడు మనమంతా ఫోన్ ను ఎంజాయ్ చేస్తున్నామంటే మార్టిన్ చేసిన కృషే కారణం.

Previous articleమీకు ద‌మ్ముంటే ఆమె పేరును మూడు సార్లు పిలిచి చూడండి!
Next articleRamaprabha కి ఆ స్టార్ డైరెక్టర్ ప్రతి నెల డబ్బులు పంపిస్తాడట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here