24 గంటలు సూర్యుడు ఉండే దేశాలు, అక్కడ అసలు రాత్రే ఉండదు

132
24 Hours SUN
24 Hours SUN

మ‌న‌కు ఉద‌యం – సాయంత్రం, ప‌ట్ట‌ప‌గ‌లు, అర్ధ‌రాత్రి అంటే ఏంటో తెలుసు. చీక‌టి ప‌డిందంటే చాలు…నిద్ర‌పోవాల‌నుకుంటాం. కానీ కొన్ని దేశాల్లో నిద్ర‌పోవాలంటే వాచ్ చూసుకోవాల్సిందే. ఉద‌యాన్నే లేవాల‌న్నా కూడా అలార‌మ్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే 24 గంట‌లూ సూర్యుడు భ‌గ‌భ‌గ‌లాడుతుంటాడు. అస్త‌మించ‌డం తెలియ‌ని సూర్యుడు ఉన్న‌ప్పుడు వాచ్ ని ఫాలో అవ్వాల్సిందే. అర్ద‌రాత్రి సూర్యుడు త‌ల మీద ఉంటే మ‌న‌కు టైం ఎలా తెలుస్తుంది. అలాంటి దేశాల్లో మిడ్ నైట్ సూర్యుడిని చూస్తుంటే వ‌చ్చే ఆఆనంద‌మే వేరు. వాచ్ ని ఫాలో అయితేనే అక్క‌డ డే అంతా టైమ్ ప్ర‌కారం న‌డుస్తుంది. అలాంటి విచిత్ర‌మైన దేశాలు ఏంటో మ‌న‌మూ చూద్దాం. అక్క‌డ సూర్యుడికి రెస్ట్ అనేదే ఉండ‌దు. ఇలా వెళ్లి అలా మెరుపులా మెరుస్తాడు. ఇదంతా ఎందుకు జ‌రుగుతుందంటే ఉత్త‌ర , ద‌క్షిణ దృవాళ్లో భూమి 23 డిగ్రీలు కొద్దిగా వంగి ఉంటుంది. భూమి త‌న చుట్టు తాను తిరిగి, సూర్యుడు చుట్టు తిరిగినా కూడా ఆ ఉత్త‌ర‌, ద‌క్షిణ దృవాళ్లో సూర్య కాంతి ప‌డుతూనే ఉంటుంది. దీంతో వాళ్ల‌కు చీక‌ట‌నేదే తెలియ‌దు. ఇలా ఏడాదిలో ఒక రోజు మాత్ర‌మే సూర్యుడు అస్త‌మిస్తాడు. అందుకే అవ‌న్ని 24గంట‌లూ వెలుగుతో మెరిసిపోతుంటాయి. రోజంతా సూర్యుడిని ఎంజాయ్ చేయాలంటే నార్వే వెళ్తే ప‌ర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు.

24 Hours SUN
24 Hours SUN

నార్వే ఆర్కిటిక్ స‌ర్కిల్ లో ఉంటుంది. అందుకే ఈదేశాన్ని మిడ్ నైట్ స‌న్ కంట్రీ అంటారు. ఇక్క‌డ మే నుండి జులై వ‌ర‌కు దాదాపు 76రోజులు సూర్యుడు అస్త‌మించ‌డు. అంటే చీక‌ట‌నేదే ఉండ‌దు. రోజంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్క‌డ వాచ్ చూసుకునే జ‌నాలు ప‌నులు చూసుకుంటారు. అర్దరాత్రి సూర్యుడు నిగ‌నిగ‌లాడుతుంటాడు. కానీ జ‌నాలు రోడ్ల మీద ఉండ‌రు. కేవ‌లం టూరిస్ట్ లు మాత్ర‌మే తిరుగుతుంటారు. ఆఫీసులు స‌హా అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. మిగ‌తా స‌మ‌యాల్లో ఏదో సూర్యుడు అలా వెళ్లి ఇలా వ‌చ్చేస్తుంటాడు. మిడ్ నైట్ త‌ర్వాత సూర్యుడు అలా వెళ్లి ఉద‌యం నాలుగున్న‌రే మ‌ళ్లీ వ‌చ్చేస్తాడు.
ఇలాంటి విచిత్రాన్నే చూడాలంటే ఐస్ లాండ్ వెళ్తే ఇంకా బాగా ట్వంటీ ఫోర్ అవ‌ర్స్ లైట్ ని చూడొచ్చు. ఇక్క‌డ కాంతి చంద్రుడి వెన్నెల మాదిరిగా హాయిగా ఉంటుంది.ఇక్క‌డ కూడా చీక‌టికి, వెలుతురుకు మ‌ధ్య స‌మ‌యం అతి కొద్దిసేపే ఉంటుంది. చీక‌టి ప‌డింది హ‌మ్మ‌య్య అనుకునేలోపే మ‌ళ్లీ వ‌చ్చేస్తాడు. అందుకే ఇక్క‌డ 24గంట‌లు….టూరిస్ట్ లు ఎంజాయ్ చేసేందుకు ఐస్ లాండ్ స‌ర్కారు ఎన్నో ర‌కాల ఏర్పాట్లు చేసింది. మ‌రీ ముఖ్యంగా మే 10నుండి జులై వ‌ర‌కు ఇక్క‌డ స‌న్ లైట్ ప‌ర్ఫెక్ట్ గా 24అవ‌ర్స్ ఉంటుంది.

ర‌వి అస్త‌మించ‌ని మ‌రో ప్రాంతం కెనడాలోని కొన్ని ప్ర‌దేశాలున్నాయి.నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఎప్పుడూ సూర్యుడు క‌నిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు డేటైమ్ మాదిరిగానే ఉంటుంది. మ‌రీ సూర్యుడిని ఎక్కువ‌గా చూడాలంటే స‌మ్మ‌ర్ లో వెళ్లాలి. దాదాపు 50రోజులు ఇక్క‌డ సూర్యుడు నిత్యం క‌నిపిస్తుంటాడు. అస‌లు అస్త‌మించ‌డం అనే స‌మ‌స్యే ఉండ‌దు. దేశంలోని స‌గ‌భాగంలో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక ఉద‌యం రెండు గంట‌ల‌కు మంచి అందాల‌ను చూడాలంటే అల‌స్కా వెళ్లాలి. ఇక్క‌డ వింట‌ర్ లో స‌న్ ప్ర‌కృతి అందాల‌ను మ‌రింత అందంగా క‌నిపించేలా చేస్తాడు. రోజుకు రెండు మూడు గంట‌లు అలా చీక‌టి ప‌డ్డ‌ట్లు ఉంటుంది. కానీ వింట‌ర్ లో మాత్రం 24 అవ‌ర్స్ అల‌స్కా అందాల‌కు మ‌రింత వెలుగును తెస్తాడు.

ఇక మ‌రికొంచెం వెరైటీగా సూర్యాస్త‌మయాన్ని చూడాలంటే….స్వీడ‌న్ వెళ్లాలి. అర్ద‌రాత్రి సూర్యుడు మెళ్లిగా వెన‌క్కి వెళ్లిపోతాడు. మ‌ళ్లీ నాలుగున్న‌ర‌కు వ‌చ్చేస్తాడు. అది కూడా సూర్యాస్త‌మ‌యంలా ఉండ‌నే ఉండ‌దు. మ‌ళ్లీ మే నుంచి ఆగ‌స్టులో ఇక స‌న్ సెట్ అనేదే ఉండ‌దు. డేటైమ్ ని ఎక్కువ‌గా చూడాల‌నుకుంటే ఇది మంచి స‌మ‌యం. ఇక ఫిన్ లాండ్ లో వ‌న్ డే టైమ్ ప‌ద్దెనిమిది గంట‌లు ఉంటుంది. స‌మ్మ‌ర్ లో ఇక్క‌డ కూడా అంతే. 24గంట‌లూ సూర్యుడు క‌నిపిస్తూనే ఉంటాడు. చ‌క్క‌టి వెలుగులో అడ్వెంచ‌ర్స్ చేయొచ్చు. నిద్ర‌కైనా, భోజ‌నానికైనా స‌రే టైమ్ చూసుకుని రెడీ అవ్వాల్సిందే. ఈ ప్రాంతాల్లో స‌రాస‌రిన 20గంట‌ల‌కు పైగా డేటైమ్ ఉంటుంది. స‌మ్మ‌ర్ వ‌స్తే మాత్రం ఆమాత్రం చీక‌టి కూడా క‌నిపించ‌దు.

ఈ దేశాల్లో సూర్యుడు మ‌నం చూసిన‌ట్లు అస్త‌మించ‌డు. అందుకే ఇక్క‌డ వాతావ‌ర‌ణం కానీ జీవ‌న ప‌ద్ద‌తులు కానీ వెరైటీగా ఉంటాయి.

Previous articleDog : వింత ఆచారం : అలాంటి యువతులకు ముందుగా కుక్కలతో పెళ్లి చేస్తారంట…
Next articleమీకు ద‌మ్ముంటే ఆమె పేరును మూడు సార్లు పిలిచి చూడండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here