తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం ఎంత సెన్సేషనలో మనందరికీ తెలిసిందే. కానీ దానికంటే ఆమె ఊమె ఊటీ కొడనాడ్ ఎస్టేట్ మర్డర్ లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఊపేస్తున్నాయి. కొడనాడ్ ఎస్టేట్ అంటే తమిళనాడులో ఎంతో ఫేమస్. ప్రతి ఎండాకాలం తన నెచ్చెలి శశికళతో ఏకాంతంగా అక్కడే హాయిగా గడిపేవారు జయలలిత. ఇది పోయెస్ గార్డెన్ కంటే అందమైన ఎస్టేట్ హౌజ్. 906 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన, అందమైన ఎస్టేట్. కొండపైన బంగ్లాలో వేసవి చల్లదనం కోసం అక్కడ జయ సేదతీరేవారు. ఇది కూడా జయలలిత, శశికల అక్రమ ఆస్తుల లిస్ట్ లో ఉంది. అది వేరే విషయం. కానీ జయలలిత ఎంత లగ్జరీగా బతకడానికి ఇష్టపడేవారో ఎస్టేట్ ను చూస్తే తెలుస్తుంది. కళ్లకు కనిపించని విస్త్తీర్ణం. రిజిస్ట్రేషన్ లో లెక్కకు మించి భూమి. కొండలు, కోణలతో అందమైన తోటలతో జయ ఎస్టేట్ మైసూర్ మహారాజా కోటను తలదన్నేలా ఉంటుంది. పాల గ్లాస్ లాంటి బిల్డింగ్ లో అమ్మవారు సేద తీరేవారు. ఇష్టసఖి శశికళతో ఎండాకాలం వేడిమి చెన్నైలో తాకగానే నీలిగిరి కొండల చల్లదనం కోసం అక్కడకు మార్చి చివరి వారంలో వెళ్లేవారు. అధికారంలో లేకుంటే అదే వారికి వేసవికాలం స్వర్గ సీమ.
అద్భుతమైన నిర్మాణం, ఏ కాలంలోనై చల్లగా ఉండే పాలరాయి. నేల మీద కాలు పెడితే మెత్తగా తాకే ఇటాలియన్ మార్బుల్, మరక అంటితే మైలు దూరం కనిపించేంత తెల్లదనంతో ప్యాలెస్ అదిరిపోయేది. మొత్తానికి అలాంటి జీవితం కావాలంటే పెట్టిపుట్టాల్సిందే. కానీ ఇది జయలలిత కు ఇది అనధికారికంగా రెండో ఆఫీస్. రహస్యాలను దాచే ఎస్టేట్ కోట. పార్టీ నుంచి ప్రభుత్వం వరకు పెద్ద విషయాలు మాట్లాడుకోవాలంటే పనులు వాయిదా వేసుకుని వచ్చి మరీ కొద్ది రోజులు ఉండి వెళ్లేవారు జయలలిత. ఇందులోని మొదటి అంతస్తులో జయలలితకు, శశికళకు ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. అదే ఫ్లోర్ లో ఆమె ఆఫీస్ ఉంది. విలువైన డాక్యుమెంట్ లు, కొంత డబ్బు, ఖరీదైన వస్తువులు అక్కడే ఉంచి వెళ్లేవారు జయలలిత. ఈ ప్యాలెస్ గదలు గోడలకు ఎన్నో జయలలిత రహస్యాలు తెలుసు.
మరి ఈ మిస్టీరియస్ స్టోరీ పూర్తిగా ఈ కింది వీడియో లో చూడండి