తిరుమల లో ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు

522

తిరుమల తిరుపతి దేవస్థానం ఇది దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీనమైన పురాతనమైన ప్రఖ్యాతి పొందిన దేవస్థానం. చాలామంది తెచ్చిన భారతదేశంలోని వెంకటేశ్వరస్వామి అత్యంత మహిమ గల దేవుడు అని నమ్ముతారు. కానీ ఈ తిరుపతి వెనక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక మనిషి జుట్టు లాంటి జుట్టు ఉంది ఆ విగ్రహం వెనుక ఒక జలపాతం ఉంటుందని అందులో వేసిన పూలు వేర్పేడు అనే ప్రాంతంలో తేలతాయి ఆయనకు సమర్పించిన పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరి నుంచి పంపుతారు అని మా ఊర్లో ఉన్న ఆడవారు బ్లౌజ్ వేసుకోరు అని అసలు తిరుపతి దేవాలయం లో ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదని ఒక అమ్మవారి విగ్రహం అని ఇలా చాలా విషయాలు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలామందికి వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలుసు అయినా కూడా మీకు తెలియని కొత్త విషయాలను ఇప్పుడు చెప్తాను. కలియుగం మొదలయ్యే సమయంలో సప్తర్షులు కూడా అగ్ర తాంబూలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరు లలో ఎవరిని ఉన్నత స్థానం ఇవ్వాలి అనే విషయం మీద అనేక రకాల చర్చలు జరిపారు అప్పుడు భృగుమహర్షి నేను ముల్లోకాల కి తిరిగి ఆ విషయం తెలుసుకొని వస్తాను అని బయలుదేరాడు భృగుమహర్షి చాలా ఆవేశపరుడు కోపంతో ఉండేవాడు. ఆయనకు వెంటనే కోపం వస్తుంది దానికి గల కారణం ఆయన పాదం కింద ఒక కన్ను ఉంటుంది ఆ అజ్ఞానం నేత్రం కారణంగానే ఆయనకి కోపం తొందరగా వస్తుంది. భృగుమహర్షి ముందుగా బ్రహ్మ లోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి దేవి వీణ నాదంలో మునిగిపోయి బృగు మహర్షి యొక్క రాకను పట్టించుకోడు. దానితో కోపం వచ్చిన భృగుమహర్షి నీకెవ్వరు దేవాలయాన్ని నిర్మించారు నీకు భూలోకంలో పూజలు జరగవు అని శపిస్తాడు. ఆ తరువాత భృగుమహర్షి కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ దేవితో కలిసి నాట్యం చేస్తూ ఉంటాడు. భృగుమహర్షి వచ్చిన విషయాన్ని గమనించిన ఇప్పటికీ కూడా ఆయన ని పట్టించుకోకుండా వచ్చే వరకు వేచి ఉండమని సైగ చేస్తాడు. దీనికి కోపం వచ్చిన భృగుమహర్షి నీకు లింగరూపం లోనే పూజలు జరుగుతాయి అని శపిస్తాడు. తరువాత విష్ణులోకాన్ని కి వెళ్తాడు విష్ణు లోకంలో లక్ష్మీదేవితో కలిసి కూర్చున్న విష్ణుమూర్తిని చూసి వీరందరూ కూడా 3 లోకాలకు త్రిమూర్తులు కూడా భార్య వ్యామోహంలో పడి పోయారు అని అనుకొని కోపంతో భృగు మహర్షి తన ఎడమ కాలితో శ్రీమహావిష్ణువు యొక్క హృదయం పైన తంతాడు. వెంటనే విష్ణుమూర్తి తాను చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని అడుగుతూ నా ఎడమ కాలిని పట్టుకొని కాలు కింద ఉన్న అజ్ఞానం నేత్రాన్ని చిదిమేస్తాడు. ఆ తరువాత జ్ఞానం తొలగిపోయి నటువంటి భ్రుగుమహర్షి తను చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని అడిగి వైకుంఠ విడిచి వెళ్ళిపోతాడు.
ఇదంతా చూసిన అటువంటి లక్ష్మీ దేవి కి కోపం వస్తుంది. వెంటనే లక్ష్మీదేవి ఒక మానవ మాత్రుడు నేను నివాసముండే నీ వక్షస్థలంపై తన కాలితో తన్నడం నాకు అవమానకరం నేనే కాదు ఏ స్త్రీ కూడా తన భర్తను అవమానిస్తే చూస్తూ ఊరుకోదు మీరు అతనిని ఏమాత్రం శిక్షించకుండా పంపించేశారు అని అవమానంతో కోపంతో విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. భార్యా వియోగంతో విష్ణుమూర్తి బాధపడుతూ ఉంటాడు సంపదను కోల్పోయిన విష్ణువు లక్ష్మీ దేవిని కోల్పోయిన నారాయణుడు ఒంటరి వాడై పోతాడు. లక్ష్మీదేవి కోసం అన్ని లోకాలను వెతుకుతున్న విష్ణు భూలోకంలో మాత్రం వెతకడు. కారణం లక్ష్మీదేవి భూలోకంలో ఉండదు అని నారాయణుడు నమ్ముతాడు. ఆమెకు భూలోకం ఇష్టం ఉండదు కనుక ఆమె ఎవరి గర్భ వాసన జన్మించలేదు.
ఆపైన లక్ష్మీదేవి భూలోకంలో ఉంది అని నారదుని ద్వారా తెలుసుకొని తన దివ్య అవతారాన్ని విడిచిపెట్టిన శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుని అవతారంలో భూమిపైకి ప్రవేశిస్తాడు. మానవ శరీరంలో ఉన్న విష్ణుమూర్తి ఆకలి దప్పిక నీరసం అన్నీ ఉంటాయి. ఆవు లోకమంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద నీరసంతో పడిపోతాడు. ప్రకృతి భగవంతుని గుర్తిస్తుంది కనుక చీమలన్నీ కలిసి ఆ నారాయణుని ఎండ తగలకుండా ఒక పుటని నిర్మిస్తాయి. ఆ తరువాత వెంకటేశ్వరుని అవతారం లో భూమి మీద ఉన్న విష్ణువు గురించి తెలుసుకొని బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరూ కూడా విష్ణు ని కాపాడే ప్రయత్నం చేస్తారు. వెంకటేశ్వరుని ఆకలి తీర్చడం కోసం బ్రహ్మదేవుడు ఆవు గాను పరమేశ్వరుడు లేగదూడ ప్రతిరోజూ ఆ పొట్ట దగ్గరికి వెళ్లి వెంకటేశ్వరునికి ఆకలి తీర్చడం కోసం పాలిస్తూ ఉంటాయి. ఆవుల ని కాపలా కాస్తున్న గొల్లవాడు అన్ని ఆవులు పాలు ఇస్తాయి కానీ ఆవు పాలు ఇవ్వడం లేదు అని ఆలోచించి ఒకరోజు దాని వెనకాలే అరణ్యంలో కి వెళ్తాడు. అదే సమయానికి ఆ ఆవు పుట్టలో ఉన్న వెంకటేశ్వరుని కోసం పాలు ఇస్తూ ఉంటుంది. అది చూసి కోపం తెచ్చుకున్న గొల్లవాడు ఆవుని కర్రతో కొడతాడు ఆ దెబ్బ ఉన్నటువంటి వెంకటేశ్వరునికి తగులుతుంది. అప్పుడు వెంకటేశ్వరుని నుదిటి పైన కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి. ఆ తరువాత లక్ష్మీదేవిని వెతుకుతూ అడవిలో అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకుని నటువంటి వెంకటేశ్వరుని దేవత అయినటువంటి నీలాదేవి చూస్తుంది. ఇంత అందమైన ఆకారము స్వరూపమున ఇతనికి ఆ నుదిటి పైన జుట్టు లేకపోవడం మచ్చలాగా అనిపించి తన కేశాలను కొన్నిటిని తీసి వెంకటేశ్వర్లునకు అంటిస్తుంది. తరువాత ఇదంతా తెలుసుకున్న వేంకటేశ్వరుడు భవిష్యత్తు కాలంలో నా భక్తులు నాకు అర్పించే వెంట్రుకలన్నీ కూడా నీకు కానుకగా సమర్పించిన పడతాయి అని నీలాదేవికి వరం ఇస్తారు. అందుకే తిరుపతిలో చాలామంది మొక్కుబడి అనే పేరుతో నీలాను అర్పించుకుంటారు. ఆ తరువాత ఒక ఊరిలో ఒక ఇంటిలో తన తల్లి లాంటి భావన కలిగే ఆ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని చూస్తాడు ఆవిడ పేరు వకుల. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని వివాహాలు జరిగినప్పటికీ కూడా అవేమీ చూడలేకపోయినా ఇటువంటి యశోదకు శ్రీకృష్ణుడు భవిష్యత్ కాలంలో నీ చేతుల మీదుగా నాకు వివాహం జరుగుతుంది అని వరమిస్తాడు. ఆ వరానికి ఫలితంగానే యశోద కలియుగంలో వకుళాదేవి గా జన్మిస్తుంది. తరువాత వెంకటేశ్వరుడు గా కూడా దేవి కే కుమారుడుగా అదే ఇంటిలో నివసిస్తూ ఉంటాడు. ఆ తరువాత అడవిలో ఒక రోజు ఏనుగు ల బారిన పడిన టువంటి రాకుమారిని రక్షిస్తాడు ఆ రాకుమారి పద్మావతి దేవి. ఆ తరువాతి కాలంలో పద్మావతి దేవితో వెంకటేశ్వరునికి వివాహం జరుగుతుంది. ఇది తిరుపతిలో ఉన్న వేంకటేశ్వరుని యొక్క చరిత్ర.

Previous articleపిచ్చి మొక్కలా కనిపించే ఇది ప్రాణాలను రక్షించే ఔషధం
Next articleభారత్ కు ఓమిక్రాన్ రూపంలో ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here