నిధివన్ గురించి నమ్మలేని నిజాలు. శ్రీకృష్ణుని గురించి మనం చిన్నతనం నుంచి ఎన్నో విషయాలు వినే ఉంటాం. గోపికలను ఏడిపించ వెన్నను దొంగిలించ పట్టుబడిన అప్పుడు తన అమాయకమైన చూపులతో అందరినీ దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడు గా నటించాడు. గ్రామస్తులను గోపికలను తన వేణుగానం తో ఎంతగానో ఆకట్టుకునే వాడు కూడా మనమందరం వినే ఉంటాము. శ్రీ కృష్ణుడు రాసలీలలు గురించి కూడా ఆధ్యాత్మిక వేత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా మనోహరంగా అనిపిస్తున్నాయి ఎన్నో శతాబ్దాల కాలం నుంచి ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి.
వీటికి నిధివన్ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు బృందావనంలోని ఘట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ సమూహం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షిస్తోంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని అలాగే రాధ తో రాసలీలలు జరుపుతూడాని కూడా చెప్పారు. ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత నిధివన్ మూసి వేయడం జరుగుతుంది. అసలు దీని వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురం ఆధ్యాత్మిక ప్రేమ నగరం గా పిలుస్తారు. మధుర కేవలం చారిత్రాత్మక నగరం మాత్రమే కాదు. దీని చుట్టు భగవంతునికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్లోని మధురలో జిల్లాలో బృందావన్ నగర్ ఉంది. శ్రీకృష్ణుని భక్తుడు తాన్సేన్ కి సంగీతం నేర్పించిన సంగీత విద్వాంసుడు హరిదాస్ గురించి ఒక ఫలకం పైన రాసి ఉంది. దీనిలో కృష్ణుడి రాసలీల గురించి కూడ ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడు రాసలీల గురించి అనేక పుస్తకాలలో జానపదాల లో ప్రముఖంగా రచించబడింది. వీటి ప్రకారం కన్నా అని పిలువబడే శ్రీకృష్ణుడు రాధా గోపికలతో కలిసి నాట్యం చేసేవాడట. ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా బృందావనం అంతా పులకించి పోయి ఆ ప్రదేశమంతా ఆనంద తరంగాలు వ్యాపించేవి అని చెప్తారు. నిధివన్ఆలయంలోని శ్రీకృష్ణుని స్థానికులు ఠాగూర్ జీ అని కూడా పిలుస్తారు.రాత్రి సమయాల్లో ఆయన ఇక్కడ రాదా గోపికలతో కలసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే రాసలీలలు నిర్వహిస్తాడు అని ప్రతీతి. కాని మానవులు ఎవరూ కూడా దీనిని చూడలేరు. ఒక చెట్టు ని ఎలా చూస్తాం. కాండం ఆకులు కొమ్మలు వేళ్ళతో. అయితే వేళ్ళు భూమిలోపలికి ఉంటాయి. కానీ ఇక్కడ నిధివన్ లో కనిపించే చెట్ల మూలాలు వేళ్ళు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి. అంతేకాకుండా కొమ్మలు అయితే భూమి వైపు వంగి ఉంటాయి. అందమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుని రాధా దేవతలతో విగ్రహాలు కలిగిన ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి మూసివేయబడుతుంది. ఇది ప్రతి రోజూ క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ. ఎందుకంటే రాత్రి సమయంలో రాసలీలలు జరిపేందుకు కృష్ణుడు ఈ అడవికి వస్తాడు అని ఇక్కడి వారు విశ్వసిస్తుంటారు. నిధివన్ లో రాధా రాణి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుని వాయిస్తూ ఇక్కడ రాధా రాణి పై శ్రద్ద చెప్పేవారు కాదట అందుకే ఆమె కృష్ణుడు వేణువుని దొంగిలించినట్లు గా చెప్తారు. ఈ ఆలయంలో రాధామాధవ విగ్రహంతోపాటు గోపి లలిత విగ్రహం కూడా ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ఆలయ సముదాయాన్ని మూసివేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చీకటి పడిన తరువాత ఆలయం లోపల ఉండాలి అని ప్రయత్నిస్తే వారికి దృష్టిలోపం వినికిడి సమస్య వస్తాయి. మూగతనం వంటివి కూడా వస్తాయి అని చెప్తారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఓ భక్తుడు శ్రీకృష్ణుని రాసలీలలు చూద్దామని నిధివన్ లో ఉండిపోయాడట. మరుసటి రోజు తలుపులు తెరచి చూసే సరికి అతని మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికులు చెప్పారు. రాసలీలల సమయంలో గోపికల లో ఒకరైన విశాఖకు దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేళువుతో ఒక రంధ్రాన్ని తవ్వుతాడు. అది నీటితో నిండి కొన్ని విశాఖకు దాహం తీరుస్తుంది. అప్పటి నుంచి ఇక్కడి నీటి కొలను విశాఖ కుండంగా పిలుస్తారు. నిధి వనంలో రంగ్ మహల్ కూడా ఉంది ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు రాధామాధవులు సందర్శిస్తారు అని చెప్పారు. రంగ మహల్లో గంధపు చెక్కతో తయారు చేయబడిన పాన్పుని ప్రతి రోజు కూడా ఏడు గంటల లోపు ఈ పూలతో అలంకరిస్తారు. తమర నీటితో పాటు ఇతర పదార్థాలను కూడా పాన్పు కి దగ్గర లో ఉంచుతారు. నిధివన్ లో ప్రఖ్యాత సంగీతకారులు హరిదాసు ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవారు అని చెప్తారు. ఆయన సంగీతానికి ముగ్ధుడైన పంకేవిహర్ జీ అంటూ శ్రీకృష్ణుని ఈ పేరుతో పిలవడం జరుగుతుంది. ఆయన కళ్లలో కనిపించిన ఈ ప్రదేశంలోని నివాసం ఉంటారు అని చెప్పినట్టు కథనం. నిధివన్ ను ప్రతి తులసి మొక్క కూడా ఒక జత గా ఉంటుంది. శ్రీ కృష్ణుడు రాసలీలలు చేసే సమయంలో ఈ తులసి మొక్కలు అన్నీ కూడా గోపికలుగా మారిపోతాయి. ఆలయ పరిసరాల్లో నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం. ఇలా చేసేవారికి ఊహించంని సమస్యలు సంభవిస్తాయని నమ్ముతారు. అందుకే ఎవ్వరు కూడా ఇక్కడే తులసి మొక్కలను తాకే సాహసం కూడా చేయరు. శ్రీ కృష్ణుడు రాధ ప్రతి రాత్రి ఇక్కడ రాసలీలలు ప్రదర్శిస్తారని చర్చనీయాంశంగానే ఉన్నప్పటికీ. నమ్మకాలు భారతీయ సంస్కృతిని వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కృష్ణుని విష్ణుమూర్తి యొక్క ఎనిమిది అవతారంగా భక్తులు కొలుస్తారు. మర్మం ఏదైనా బృందావనం భక్తుల నుంచి ఒక ఆధ్యాత్మిక భావనను పొందింది