వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు అని ప్రతితి. అందుకే విగ్నేశ్వరుడు అని అంటారు. ప్రమధ గణాలకు అధిపతి కనుక గణపతి అని అంటారు. పెద్ద వదనంతో అలరారుతూ ఉంటాడు అందుకే లంబోదరుడు అని అంటారు. మూషికము వాహనంగా చేసుకుని నందున మూషిక వాహనుడు అని అంటారు. ఏనుగు తల కలిగి ఉండడం వలన గజాననుడు అని ఒక దంతం విరిగి వుండడంవల్ల ఏకదంతుడు అని అంటారు. ఇప్పుడు అందరికీ ఇష్టదైవం దేశవిదేశాలలో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. అనేక మంది భక్తులు ఉన్నారు. సనాతన సాంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేకమైన మతం కూడా ఉంది. వినాయకుని ప్రత్యేక దైవంగా ఆరాధించే మతాన్ని గాన పద్యం అంటారు. వినాయకుడి కి ఎన్నోనామాలు ఉన్నట్లే ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి. వినాయకుడికి ఉన్న అరుదైన ఆలయాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గణపతి పులే మహారాష్ట్ర. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఆలయం ఇది. రత్నగిరి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోంకేణ పులే గ్రామంలో లంబోదరుడు పడమటి కనుమల దిగువన స్వయంభువుగా వెలిశాడు. మిగిలిన ఆలయాలలోని దేవతామూర్తులు తూర్పు దిక్కుగా ఉంటే ఇక్కడి వినాయకుడు మాత్రం పశ్చిమాభిముఖంగా కనిపిస్తాడు. పశ్చిమాభిముఖంగా అయిన స్వామి పడమటి కనుమలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ ఉంటాడని భక్తులు నమ్ముతారు గణపతి పులే గ్రామంలో స్వయంభు వినాయకుడు ఆవిర్భవించడం వెనుక ఒక స్థల పురాణం కూడా ఉంది. బలభీమ్ పిడే అని బ్రాహ్మణుడు గ్రామ కరణం గా ఉండేవాడు. ఒకసారి అతను ఒక పెద్ద సమస్యలో చిక్కుకుని సమస్య నుంచి బయట పడడానికి గ్రామం వెలుపల ఉన్న మొగలి వనం లో కూర్చుని తన ఇష్టదైవమైన వినాయకుని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు. వినాయకుడు కరుణించి కలలో కనిపించి ఇక్కడ అతను స్వయంభువుగా వెలిశాడని ఇక్కడ ఆలయం నిర్మించమని ఆలయం నిర్మిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్తాడు. ఇది జరిగిన తరువాత వారి పశువుల మంద లోని ఆవులు పాలు ఇవ్వడం మానేసాయి. పశువులకు కాపలాగా వెళ్లినట్టు వంటి ఒక మహిళ వాటిని నిశితంగా గమనిస్తే మొగలి వనం లోని ఒక గుట్ట వద్ద ఆవులు పాలు ధారగా కారణం గమనించింది. ఇదే విషయాన్ని పిడేకి చెప్పడంతో అక్కడికి మనుషులతో చేరుకొని చుట్టూ పేరుకుపోయిన పుట్టకి మట్టిని తొలగిస్తే అక్కడ వినాయకుడి విగ్రహం కనిపించింది. దానితో ఆయన ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించి గణపతి ని పూజించడం ప్రారంభించారు. ఇప్పుడున్న ఆలయాన్ని బీష్పా ప్రభువులు నిర్మించారు.
మధుర మహాగణపతి కేరళ. కేరళలోని మధిర మహాగణపతి ఆలయం ఒకప్పుడు శివాలయం. పరమశివుడు మధుర నాదేశ్వరుడు గా ఇక్కడ వెలిశాడు. అప్పటిలో ఇది తులునాడు రాజ్యంలో ఉండేది. స్వయంభూగా వెలిసిన శివలింగానికి తులు రాజులు ఆలయ నిర్మాణం చేశారు. మదరు అని వృద్ధురాలు ఇక్కడ శివలింగాన్ని కనుగొనడంతో ఆమె పేరుతో ఇక్కడ శివుడు మధుర నాదేశ్వరుడుగా పిలువబడతాడు. ఒకనాడు స్థానిక భక్తులు బాలుడు ఆలయంలో ఆడుకుంటుండగా గర్భగుడిలో దక్షిణ గోడ పై వినాయకుడి బొమ్మ గీశాడు. గోడపై ఆ బాలుడు గీసిన బొమ్మ పరిమాణం నానాటికీ పెరగసాగింది. చూస్తుండగానే కొద్ది రోజుల వ్యవధిలోనే భారీ స్థాయికి చేరింది. ఆలయంలోని ఆటలాడుకునే ఆ బాలుడు పెద్ద గణపతి అని పిలిచేవాడు. నాటి నుంచి ఇది మహాగణపతి ఆలయం గా ప్రసిద్ధి పొందింది. మూడు అంతస్తులలో నిర్మించబడిన ఈ ఆలయం వాస్తు శిల్ప కళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది. ఆలయ లోపలి భాగంలో కల పై చెక్కిన రామాయణ దృశ్యాలు మనకి కనిపిస్తాయి. మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పుసుల్తాన్ చాలా ఆలయాలపై దాడులు చేసినట్లు గానీ ఈ ఆలయంపై కూడా దాడి చేయడానికి వచ్చాడట. ఆలయం బావిలో నీళ్లు తాగి ఆలయం పై దాడి చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడట. తన వెంట ఉన్న సైన్యాన్ని తృప్తి పరచడం కోసం ఆలయ గోడలపై బయటనుంచి వేటు వేసి వెనుతిరిగి వెళ్ళిపోయాడట. టిప్పుసుల్తాన్ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికి కూడా చూడవచ్చు.
త్రినేత్ర గణేశ ఆలయం రాజస్థాన్ లో వినాయకుడు 3 కన్నులతో భక్తులకు కనువిందు చేస్తాడు. రాజస్థాన్ లోని కోట లో ఉన్న వినాయకుడిని ప్రధమ గణేశా అని పిలుస్తారు. దేశంలో ఇదే మొట్టమొదటి వినాయక ఆలయం గా భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన త్రినేత్ర గణేశ విగ్రహం దాదాపు ఆరున్నర వేల సంవత్సరాల క్రితం అని అంచనా. రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగినప్పుడు వారు వారి తొలి వివాహ పత్రిక ను ఇక్కడ ప్రథమ గణేశునికి పంపాడు అని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయం వెలిసిన కోట రత్నపూర్ జాతీయ పార్కు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 13 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హబీర్ నిర్మించినట్లు చెబుతారు. హబీర్ వినాయకుడికి పరమభక్తుడు. కబీర్ ఇక్కడ ఆలయం నిర్మించడం వెనుక కూడా ఒక గాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో రంతాపూర్ కోటపై అల్లాఉద్దీన్ ఖిల్జీ దాడి చేశారు. యుద్ధం ఏళ్ల తరబడి జరిగింది. యుద్ధాన్ని ముందుగా అంచనా వేసి గోదాముల్లో నిల్వ చేసిన తిండిగింజలు ధాన్యాలు నిండుకున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజు తన రాజ్యాన్ని తన ప్రజలను కాపాడాలని గణపతిని ప్రార్ధిస్తాడు. రాజు హబీర్ గణపతి కలలో కనిపిస్తాడు. రేపట్నుంచి నీ సమస్యలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అని పలుకుతాడు. తరువాతి రోజు కిల్జి సేన వెనక్కి వెళ్లిపోవడంతో యుద్ధం ముగిసి పోతుంది. గోదాములలో తిండి గింజలు వచ్చి చేరుతాయి కోట గోడ నుంచి త్రినేత్ర గణపతి విగ్రహం ఆశ్చర్యంగా బయటపడుతుంది. ఈ అద్భుతమైన సంఘటనతో గణపతిపై రాజు హబీర్ భక్తి విశ్వాసాలు కలుగుతాయి. గణపతి సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి కుమారులైన శుభ లాభాలతో గణపతి వాహనమైన మూసుకొని కూడా ఇక్కడ ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇళ్లలో శుభకార్యాలు జరిగే టప్పుడు తొలి ఆహ్వాన పత్రిక ఇక్కడ ఉన్న గణపతికి పంపిస్తారు. ప్రధమ గణపతి తొలి ఆహ్వానాన్ని పంపితే శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి అని నమ్ముతారు.