ఒకే ఒక చిన్న చిట్కా తో యూరిన్ ఇన్ఫెక్షన్ మాయం మల్లి రమ్మన్నా రాదు

222

ఈ రోజుల్లో చాలా మంది మూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్నారు ఇలా మూత్రంలో మంట రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మూత్రాశయ వ్యాధులు యూరిన్ లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కానీ మూత్రాశయంలో ఉండే సమస్యల వల్ల గానీ ఎక్కువగా వస్తుంది. ఇది ముఖ్యంగా మహిళలు గర్భవతులు అయినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులలో కూడా ఈ మధ్య ఎక్కువగా ఈ సమస్య రావడానికి కారణం మూత్రపిండాలలో వాల్ ఏర్పడడం, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిన తగినంత నీరు తాగకపోయినా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.

ఈ ఇన్ఫెక్షన్ సమయంలో మూత్రవిసర్జన సమయంలో మంట తో కూడిన బాధగా ఉంటుంది. పొత్తికడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. యూరిన్ కి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. యూరిన్ రంగు మారడం వేడిగా ఎరుపుగా రావటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని వలన కొంతవరకు నీరసం జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యను తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం మనకు కావలసినవి మన వంటగదిలో ఉండే మూడే మూడు పదార్థాలు. ఒకటి ధనియాలపొడి రెండు పటికి బెల్లం మూడోది మనం వంట గదిలో ఉపయోగించే ఉప్పు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వంట గదిలో ఉండి ధనియాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది . ధనియాలు అనారోగ్య సమస్య నుంచి మనల్ని కాపాడే మంచి ఔషధంలా గా పనిచేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ధనియాల కు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ధనియాలు మన శరీరంలో వేడిని తగ్గించి మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. పటిక బెల్లాన్ని కూడా తీసుకొని ఒక స్పూన్ మోతాదులో కలుపుకోవాలి. పటిక బెల్లం కూడా ఒంట్లో వేడిని తగ్గించి మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. చివరిగా కావాల్సింది ఉప్పు ఒక చిటికెడు మోతాదులో ఉప్పు కలుపుకోవాలి. సాధారణంగా తాగి నీరు పోసి ఇవన్నీ బాగా కలపాలి. దీనిని గ్యాస్ మీద ఉంచి పది నుంచి పదిహేను నిమిషాలపాటు నీళ్లు సగం అయ్యేవరకు బాగా మరిగించండి. బాగా మరిగిన తరువాత ఈ నీటిని తీసుకొని ప్రతి రోజూ మూడుసార్లు తీసుకోవాలి. ఉదయాన్నే తయారుచేసుకుని నీటిని మూడు భాగాలుగా చేసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ నీళ్లు తాగాలి. మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు రాత్రి నిద్ర పోవడానికి ఒక అరగంట ముందు ఈ కషాయాన్ని రోజుకు మూడుసార్లు తీసుకుంటే. మూత్రంలో మంట యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలన్నీ దూరం కావడం మాత్రమే కాకుండా మూత్ర సంబంధిత సమస్యలు కూడా రావు. ఈ చిట్కాను పాటిస్తే ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తూ ఈ కషాయాన్ని తీసుకుంటే మూత్రంలో మంట తగ్గడానికి ఒక వారం రోజుల్లోనే గమనిస్తారు. మూత్రం కూడా సాఫీగా వస్తుంది. యూటీఐ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అయితే ఈ చిట్కాను కనీసం వారం నుంచి 15 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Previous articleకొండా అంచులో పడిపోకుండా వేల ఏళ్ల నుంచి ఉన్న మహిమగల రాయి
Next articleఈ మొక్క వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here