ఊపిరితిత్తులలో చేరిన సిగెరెట్ వ్యర్థం ఒక్కసారిగా బైటకు రావాలంటే

144

ప్రతి మనిషి భోజనం చేయకుండా నీరు తాగకుండా అయినా కొన్ని గంటలు లేదా ఒకరోజు జీవించగలడు కానీ ఊపిరి పీల్చకుండా మాత్రం ఒక్క నిమిషం కూడా జీవించలేడు. ఒక రోజులో లక్షకుపైగా ఎక్కువ సార్లు మన గుండె కొట్టుకుంటుంది. సాధారణ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు ఒక్క రోజులు 20,000 నుంచి 30,000 వరకు ఊపిరి తీసుకుంటాయి. ఇలా పరిశీలించి చూస్తే మన శరీరంలో గుండె మరియు ఊపిరితిత్తులు నిరంతరం ఆపకుండా పని చేసే అతి ముఖ్యమైన అవయవాలు. స్మోకింగ్ అంటే పొగ తాగడం ఎలాంటి ప్రక్రియ అంటే ఇది మన గుండెపై ఊపిరితిత్తులపై మన చర్మం పై వెంట్రుకలపై మరియు మెదడు పై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఒక పరిశోధనలో పొగతాగే వారి సంఖ్య కంటే కూడా ఇంతకు ముందు తాగిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని చూపిస్తుంది.

ఈ రోజుల్లో ఎంతో మంది సిగరెట్ తాగుతున్నాడు వారి కంటే ఎక్కువమంది సిగరెట్ తాగడం మానేశారు. అయితే దీనివల్ల అర్థమైన విషయం ఏంటంటే పొగతాగడం ఎంతవరకు అలవాటైనా దానిని మానేయడం కూడా సాధ్యమే అని తేలింది. పొగాకు మరియు సిగరెట్లు నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం తీసుకోవడం వల్ల మన మెదడు దీని ప్రభావాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ పనిచేయడం మందగిస్తుంది. ఇలా పొగ తాగే వారికి ఈ నికోటిన్ పనిచేయడం వల్ల దానిని తీసుకుని శాతం రోజురోజుకి పెరిగిపోతుంది. బ్రెయిన్ ఎలా మారిపోతుంది అంటే ఒక సిగరెట్ తాగితే కలిగే సంతృప్తిని రెండు మూడు నుంచి ఐదు వరకు తాగాలి అని ఆలోచన పెంచే లాగా చేస్తుంది. దీనితో పాటు నికోటిన్ మన శరీరంలో ఉండే రక్తంలో మరియు మెదడు మూలలో పూర్తిగా కలిసిపోతుంది. దీనితో మన అవసరం అలవాటుగా మారిపోతుంది. దీనితో పాటు నికోటిన్ మన శరీరంలో ఉండే రక్తంలో మెదడు మూలలో పూర్తిగా కలిసిపోతుంది. దీనివలన మన అవసరం అలవాటుగా మారిపోతుంది. శరీరంలోని కోటింగ్ స్థాయి తగ్గిన వెంటనే మన మెదడు సిగరెట్ తాగని సందేశం ఇస్తుంది. దీనివలన ఇంతకుముందు ఎప్పుడూ ఆలోచించని విధంగా చాలా సిగరెట్లు తాగడం మొదలు పెడతాము. పరిశోధన ప్రకారం ఒక సిగరెట్ కాల్చడం వల్ల సుమారు నాలుగువేల రసాయనాలు బయటికి వస్తాయి. దీంట్లో నాలుగు వందలకు పైగా విషపూరితమైనవి మరియు 43 కి పైగా క్యాన్సర్ ను కలిగించే కారణాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరాన్ని పూర్తిగా కలుషితం చేస్తాయి. కొద్దికొద్దిగా చర్మం పాడైపోతుంది శరీరంపై మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఎక్కువకాలం పొగతాగడం వల్ల పురుషుల లైంగిక శక్తిపై ఆడవారి మాతృత్వం పై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. నెమ్మదిగా ఆకలి వేయడం తగ్గిపోతుంది దీని వల్ల శరీరంలో పోషక విలువలు శాతం కూడా తగ్గిపోతుంది. దీని వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా బలహీనపడి పోతోంది. ఆరోగ్యం బాగా ఉన్న వారి ఊపిరితిత్తులు గులాబి రంగులో ఉంటాయి పొగతాగేవారిలో ఊపిరితిత్తులు నలుపు రంగులో ఉంటాయి. తరువాత మన శరీరంలో ఉండే రక్తాన్ని కూడా కొద్దికొద్దిగా నల్లగా మార్చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెడు వ్యర్థాలను నిల్వ ఉంచినటువంటి ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. లంగ్స డిటాక్స్ చేసుకోవడానికి సహజసిద్ధమైన ఎటువంటి పద్ధతులు బాగా పనిచేస్తాయి. ఈ సహజ సిద్ధమైన పద్దతుల ద్వారా ఊపిరితిత్తులు శుభ్రం చేయడం మాత్రమే కాకుండా రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఊపిరితిత్తులను ఎలా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి చిట్కా తయారు చేసుకోవడానికి మనకి కావలసిన పదార్థాలు దాల్చినచెక్క పొడి అల్లం రసం నిమ్మకాయ రసం తేన మరియు ఎర్ర కారం పొడి. ఎర్ర కారం పొడి కోసం మన ఇంట్లో ఉండి కాదు అని వాడకూడదు దీనికోసం ఖాయన్ పెప్పర్ పౌడర్ మాత్రమే వాడాలి. దీనిని బాగా లావుగా పెద్దగా ఉండి మిరపకాయలతో తయారు చేస్తారు. ఇది కడుపు కిడ్నీ లివర్ లంగ్స కి మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. ఈ కారం పొడి తో పాటు తేనె కలిపి తీసుకోవడం వల్ల మన శరీరం చాలా తొందరగా డిటాక్స్ అవుతుంది. ఇది ఏదైనా సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ లో చాలా సులభంగా దొరుకుతుంది. వీటన్నిటి పదార్థాలతో మనం ఒక డ్రింక్ తయారు చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ కారం పొడి ఒక పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి అన్ని పదార్ధాలు బాగా కలిసే విధంగా దీనిని బాగా కలుపుకోవాలి. దీనిని ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు టీ తాగి నట్లుగా కొద్దికొద్దిగా తాగాలి. ఇందులో వాడిన దాల్చినచెక్క పొడి నిమ్మకాయ రసం మన ఊపిరితిత్తులలో పేరుకుపోయి నా పార్క్ మరియు నల్లధనాన్ని తొలగించి మన శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతాయి. పొగాకు తాగడం వల్ల మన శరీరంలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్స్ని తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల మన శరీర ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇంతకు ముందు కంటే ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తుంది. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో మంచి తేడాని చూడగలుగుతాము. అంతేకాకుండా పొగ తాగేవారు వారి ఆహార పదార్థాల్లో క్లోరోఫిల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. క్లోరోఫిల్ ఎక్కువగా వీట్ గ్రాస్ జ్యూస్ లో దొరుకుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల లో ఏర్పడిన చెడు పదార్థాలు తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవడంతో పాటు రక్త శాతం కూడా పెరుగుతుంది. ఎక్కువ కాలం నుంచి పొగ తాగుతున్న వారు ఒక వారం రోజులపాటు క్రమం తప్పకుండా గోధుమ గడ్డి రసం తాగినట్లయితే శరీరంలో అనేక రకాలైన ఇటువంటి అద్భుతమైన మార్పు చూస్తారు. ఊపిరితిత్తులు శుభ్రపరచడానికి మరో అద్భుతమైన చిట్కా chavanprash దీనిని తినడం వల్ల మన ఊపిరితిత్తులు శుభ్రం చేయడం మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. శరీరంలో ఉండే అన్ని అవయవాలను డిటాక్స్ చేసి వాటికి శక్తిని అందిస్తుంది. సిగరెట్లు తాగడం వలన చేసే పనిలో తొందరగా అలసట కలిగి వారు సిగరెట్ తాగకపోతే తల నొప్పిగా అనిపించి ప్రతి రోజు కూడా రెండు స్పూన్ల chavanprash తినాలి. శరీరం పైన పొగతాగటం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి దీర్ఘమైన శ్వాస వ్యాయామం అనేది చాలా అవసరం. ఎవరైతే ఎక్కువ కాలం నుంచి పొగ తాగుతూ ఉంటారు అలాంటి వారికి ఇతరులకంటే కూడా ఊపిరి తీసుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘశ్వాస వ్యాయామం చేయడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల లో ఏర్పడిన చెడు వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా బాగా పెరుగుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే నడక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేస్తాయి. ప్రతిరోజూ వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం మనం తీసుకునే అన్ని చిట్కాల కంటే కూడా పది రెట్లు చాలా మంచిది. నడవడం వలన ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి దీని వలన ఊపిరితిత్తులు పనిచేసే పనితీరు పెరుగుతుంది. దీనివల్ల బలహీనపడిన ఊపిరితిత్తులు క్రమంగా ఇంతకు ముందు కంటే ఆరోగ్యంగా పెరుగుతాయి. దీనితో పాటు ప్రతి రోజూ ఎక్కువ నీటిని తాగాలి పొగాకు తాగడం వంటివి వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ పొగ తాగడం మానేసి నట్లయితే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మన శరీర వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి ఊపిరితిత్తులు ఎంతో ముఖ్యం.

Previous articleసైన్టిస్ట్ లకు సైతం అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయ రహస్యాలు
Next articleసుప్రసిద్ధ జ్యోతిష్కులు సాయి శర్మ దత్తానంద గారిచే రాశి ఫలాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here