Mahesh Achanta : అందుకే అన్నిసార్లు పిలిచినా బిగ్ బాస్ షో కి వెళ్ళలేదు…

129

Mahesh Achanta : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు కామెడీ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ కమెడియన్ “మహేష్ ఆచంట” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటుడు మహేష్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల విషయంలో బాగానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో కొన్ని రోజుల పాటు తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో కూడా కమెడియన్ గా పనిచేశాడు. ఆ తర్వాత క్రమక్రమంగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.

అయితే నటుడు మహేష్ ఆచంట కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా ఆ మధ్య “ఆర్ఎక్స్ 100” మూవీ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన గుణ 369 చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు. కానీ గుణ 369 చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో మహేష్ ఆచంట కి పెద్దగా గుర్తింపు లభించలేదు. అయితే తాజాగా నటుడు మహేష్ ఆచంట ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో వచ్చిన కంటెస్టెంట్ ఆఫర్ పై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా తనకు ఇప్పటి వరకు బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నిర్వాహకుల నుంచి రెండుసార్లు కంటెస్టెంట్ గా పాల్గొనమని పిలుపు వచ్చిందని కానీ తాను ఇతర చిత్రాల షూటింగులతో బిజీగా ఉండటంతో బిగ్ బాస్ షోలో పాల్గొనలేక పోయానని తెలిపాడు. అలాగే 100 రోజుల పాటు తాను బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటే తాను కమిట్ మెంట్ ఇచ్చిన ఇతర చిత్రాల షూటింగులు ఆగిపోతాయని దానివల్ల తన సినీ కెరీర్ పై కూడా ఈ ప్రభావం పడుతుందని అందుకే షూటింగ్ లేని సమయంలో బిగ్ బాస్ గేమ్ షో నుంచి పిలుపు వస్తే కచ్చితంగా కంటెస్టెంట్ గా పాల్గొంటానని అంతే తప్ప బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనకపోవడానికి పెద్దగా కారణాలు లేవని స్పష్టం చేశాడు.

ఇక తనకి సినిమా ఇండస్ట్రీలో హైపర్ ఆది, కిరాక్ ఆర్పి తదితరులు మంచి స్నేహితులని దాంతో జబర్దస్త్ షోలో పని చేసేటప్పుడు ఎక్కువగా కలిసి తిరిగే వాళ్లమని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అయితే హైపర్ ఆది మాత్రం ఇప్పటికీ తనతో బాగా టచ్ లో ఉంటాడని దాంతో అప్పుడప్పుడు తను నటించిన చిత్రాలు చూసి మంచి కాంప్లిమెంట్స్ తో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఇక కిరాక్ ఆర్పి ప్రస్తుతం డైరెక్షన్ విభాగంలో బిజీ బిజీగా గడుపుతున్నాడని అందువల్లనే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడని తెలిపాడు.

ఇక తన స్వగ్రామం గురించి స్పందిస్తూ తన ఊరి ప్రజలు తనను ఎంతగానో సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన ఊరికి వెళ్లి ఎక్కువ రోజులు గడిపితే సినిమా షూటింగులు లేవా..? అంటూ చాలామంది కంగారుపడి ఫోన్లు చేయడం, ఇంటికి వద్దకు వచ్చి పలకరించడం వంటివి చేస్తారని ఒక రకంగా చెప్పాలంటే నటనారంగంలో బాగా రాణించి మంచి స్థాయిలో ఉండాలని తన ఊరి ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారని తెలిపాడు. అందువల్లనే తాను కూడా హైదరాబాదులో సొంత ఇల్లు లేకపోయినప్పటికీ తన స్వగ్రామంలోనే మొదటగా మంచి ఇల్లు కట్టుకున్నానని దాంతో సినిమా షూటింగ్ లేని సమయంలో కచ్చితంగా ఇంటికి వెళ్లి సరదాగా ఫ్రెండ్స్ తో గడుపుతానని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటుడు మహేష్ ఆచంట తెలుగులో ప్రముఖ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన అర్జున ఫల్గుణ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. కాగా ఈ చిత్రం గత సంవత్సరంలోని డిసెంబర్ 31 వ తారీఖున విడుదల కాగా మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

Previous articleవంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు
Next articleSamantha : అప్పట్లో ఆ హీరో ని పెళ్లి చేసుకుని ఉంటే సమంత జీవితం కూడా ఆ హీరోయిన్ లా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here