Raveena Tandon : తమ్ముడితోనే అఫైర్ పెట్టుకుందంటూ హీరోయిన్ గురించి ప్రచారం.. కానీ నిజమేమిటంటే…

437

Raveena Tandon : ఒక్కోసారి కొంతమంది సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి ప్రచారం చేసేటువంటి తప్పుడు కథనాలు మరియు అసత్య ప్రచారాల కారణంగా కొందరు సినీ సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడ, మగ ఇద్దరు వ్యక్తులు కలిసి రోడ్డుపై వెళుతుంటే చాలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మధ్య అక్రమ సంబంధం అంటగట్టడం, అలాగే వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ అసభ్యకర కామెంట్లు చేయడం వంటివి ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. కాగా తాజాగా పలు బాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మరియు ప్రముఖ మోడల్ రవీనా టాండన్ ఆ మధ్య తన గురించి సోషల్ మీడియాలో చేసినటువంటి అసత్య ప్రచారాల గురించి ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో స్పందించింది.

ఇందులో భాగంగా ప్రస్తుత కాలంలో మహిళలకి బాహ్య ప్రపంచంలో రక్షణ కరువైందని అలాగే తమ కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళినా సరే కొందరు తమ మధ్య ఏదో ఉందంటూ నిజానిజాలు తెలుసుకోకుండా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా వక్ర దృష్టితో చూస్తున్నారని తన విషయంలో కూడా సరిగ్గా అదే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా గతంలో తాను ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు అనుకోకుండా షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు చేయడంతో రాత్రి సమయం వరకూ సినిమా సెట్లోనే ఉండిపోవాల్సివచ్చిందని దాంతో తనని ఇంటికి తీసుకెళ్లేందుకు తన సోదరుడు కారులో వచ్చాడని, ఇది గమనించిన కొందరు తాను అర్ధరాత్రి సమయంలో తన ప్రియుడితో కలిసి బయటికి వెళ్లానని, ఏదో చేశానని తప్పుడు కథనాలు ప్రచారం చేశారని ఎమోషనల్ అయింది.

ఇక తాను సినీ సెలబ్రిటీ కావడంతో కొందరు వ్యూస్ కోసం ఏవేవో ప్రచారం చేశారని దీంతో ఈ తప్పుడు కథనాలు వెలువడిన సమయంలో తాను చాలా మానసిక క్షోభకు గురయ్యానని తెలిపింది. అయితే సినీ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి తన పరిస్థితే ఇలా ఉంటే ఒక సామాన్య ఆడపిల్ల రోడ్డుపై తన సోదరుడు లేదా తండ్రితో కలిసి వెళుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తాను ఊహించగలనని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పాపులర్ కావాలని నిజానిజాలు తెలుసుకోకుండా సినీ సెలబ్రిటీల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కాబట్టి అలాంటి వాటి గురించి పట్టించుకోవద్దని రవీనా టాండన్ కి సూచిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవీనా టాండన్ కన్నడ, హిందీ తదితర భాషలలో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అయితే ఇందులో ప్రముఖ సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న “కే.జి.ఎఫ్ 2” చిత్రం లో కూడా రవీనా టాండన్ పవర్ఫుల్ పొలిటిషన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం విడుదలను కొంతకాలం పాటు వాయిదా వేశారు.

Previous articleSamantha : అప్పట్లో ఆ హీరో ని పెళ్లి చేసుకుని ఉంటే సమంత జీవితం కూడా ఆ హీరోయిన్ లా….
Next articleKalpalatha : చిన్నప్పుడే తల్లదండ్రులకి అనారోగ్యం, 14 ఏళ్లకే పెళ్లి… కల్పలత కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here