Ramesh Babu : ఇక నేను సినిమాలు చేయను అనే కఠిన నిర్ణయం వెనుక ఇంత ఉందా

147

Ramesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా కెరీర్ ను అన్నయ్య Ramesh Babuను చూసే మొదలు పెట్టారు. స్వయంగా రమేష్ బాబు కోసం క్రిష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తన కొడుకును స్టార్ గా చూడాలనుకున్నారాయన. అందుకోసం పీక్స్ లో తన కెరీర్ ఉన్న సమయంలోనే మూవీస్ కి బ్రేక్ ఇచ్చి రమేష్ భాబు హీరోగా కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ టైమ్ లోనే మహేష్ బాబును కూడా రమేష్ బాబుతో నటింపచేశారు. ఏతండ్రికైనా పెద్ద కొడుకు అంటే ప్రేమెక్కువే. క్రిష్ణకు కూడా అంతే. ఇటు మహేష్ బాబు కు Ramesh Babu ఇన్సిపిరేషన్. ఇద్దరి బాధ్యతలను మహేష్ మోయాల్సి వచ్చింది. తన కోసమే కాకుండా నాన్న పేరు, అన్న కోరికను నిలబెట్టాలనేది ఆయన తపన. అది నిజమైంది. కానీ నిజజీవితంలో రమేష్ బాబు సిల్వర్ స్పూన్ తో పుట్టినా ఆయన కు కష్టాలు మాత్రం ప్రతి సారి వెన్నంటే ఉన్నాయి. అదే క్రిష్ణను నేటికీ మనసును తొలిచే బాధ.

రమేష్ బాబు జననం 

Ramesh Babu అక్టోబర్ 13, 1965లో క్రిష్ణ, ఇందిర దంపతులకు పుట్టారు. ఆయన చెన్నైలో చదువుకుంటున్న సమయంలోనే క్రిష్ణ సూపర్ స్టార్. దక్షిణ భారతదేశంలో నాటికి ఆపేరును కలిగి ఉన్న ఏకైక హీరో క్రిష్ణ. ఆ తర్వాతే వేర్వేరు భాషల్లో వేర్వేరు స్టార్ లకు ఆ పేరు దక్కింది. తన తండ్రి క్రేజ్ ను చూసి రమేష్ బాబు సైతం తాను కూడా హీరో అవ్వాలనుకున్నారు. అతనిలోని ఉత్సాహాన్ని చూసి చిన్నప్పటి అల్లూరి సితారామరాజు పాత్రలో రమేష్ బాబు ను వెండితెరపైకి తీసుకొచ్చారు. ఆ మూవీతోనే మొదటి సారి వెండితెరపై కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 12 ఏళ్లకు మనుషులు చేసిన దొంగలు సినిమాలో నటించారు. 14 ఏళ్లప్పుడు దాసరి నారాయణరావు డైరెక్షన్ లో నీడలో పెద్ద పాత్ర చేశారాయన. అయితే చదువు పాడవుతుందని రమేష్ ని ఆ తర్వాత సినిమాలకు దూరంగా పంపించారు క్రిష్ణ. డిగ్రీ చదివిన తర్వాతే సినిమాల్లో నటించాలని కొడుకు కు చెప్పారు. అందుకే మళ్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయాగనే సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రమేష్ బాబు.

క్రిష్ణ కొడుకంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ మూవీని భాగానే ఆదరించారు. ఇక అంతకు ముందు ఏడాదే నాగార్జున విక్రమ్ తో తెరంగేట్రం చేశారు. రమేష్ బాబు కంటే మూడేళ్ల ముందే బాలక్రిష్ణ హీరోగా కెరీర్ ను మొదలు పెట్టారు. వీళ్లు వచ్చే నాటికే చిరంజీవి ఒక మెట్టు ఎక్కారు. ఖైదీ మూవీ తర్వాత చిరంజీవి స్టార్ అయిపోయారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ వారసుల్లో ఎవరు టాప్ హీరో అవుతారనే అంచనాలు ఆరోజుల్లో ఉండేవి. దాంతో రమేష్ బాబు మీద తీవ్ర ఒత్తిడి మొదలైంది.

మంచి నటుడిగా

Ramesh Babu సామ్రాట్ తో మంచి నటుడిగానే పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో రమేష్ అనే పేరుకు యమ క్రేజ్ ఉండేది. చాలా మంది క్రిష్ణ అభిమానులు తమ పిల్లలకు రమేష్ అనే పేరు పెట్టుకున్నారు. సామ్రాట్ తర్వాత చిన్ని క్రిష్ణుడు, బజార్ రౌడీ పర్వాలేదనిపించాయి. కానీ క్రిష్ణ కు మాత్రం రమేష్ బాబుకు బ్లాక్ బస్ట్ హిట్స్ రావాలనుకున్నారు. రమేష్ బాబుతో పాటు తాను, మహేష్ బాబును కూడా నటింప చేసి మూవీస్ కి కొత్త క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేశారు. అందుకోసం తాను పెద్ద సినిమాలను వదులుకున్నారాయన. విశ్రాంతి అనే పదానికి క్రిష్ణ దూరం. అందుకే రమేష్ బాబు కెరీర్ ను గాడిలో పెట్టాలనుకుని తానే స్వయంగా కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమా దర్శకుడిగా తీశారు. అవి పర్వాలేదనిపించాయి. కానీ అందులో మహేష్ బాబు చార్మింగ్, క్రిష్ట స్టార్ డమ్ రమేష్ బాబును డామినేట్ చేశాయన టాక్ వచ్చింది. బజార్ రౌడీ సూపర్ హిట్ అయినా బ్లాక్ టైగర్ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వరుసగా అన్ని సినిమాలు యావరేజ్ టాక్ తోనే పేరు తెచ్చుకున్నాయి. క్రిష్న గారబ్బాయి మూవీ మళ్లీ గాడిలో పెట్టింది. కానీ నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, పచ్చ తోరణం సినిమాలు రమేష్ బాబు కెరీర్ ను వెనక్కి తీసుకెళ్లాయి. అయినా ఆయన నటనను కంటిన్యూ చేసి ఉంటే ఖచ్చితంగా స్టార్ హీరో అయ్యేవారు. వరుస ప్లాపులతో నిరుత్సాహానికి గురయ్యారు రమేష్ బాబు. ఒక వైపు క్రిష్ణ సూపర్ హిట్ మూవీస్ తో ఏలుతున్నారు. కానీ తాను తీసే మూవీస్ ను తండ్రి తో పోల్చడంతో రమేష్ బాబు కాస్త నిరుత్సాహ పడ్డారనే వార్తలొచ్చాయి.

క్రిష్ణ ఏడాదిలో పది సినిమాలు తీస్తే కనీసం మూడు బ్లాక్ బస్టర్ లు

క్రిష్ణ ఏడాదిలో పది సినిమాలు తీస్తే కనీసం మూడు బ్లాక్ బస్టర్ లు, నాలుగు హిట్లు ఉండేవి. రమేష్ బాబు హీరోగా ఉన్న సమయంలోనే గూడచారి 117, సాహసమే నా ఊపిరి, కొడుకు దిద్దిన కాపురం లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి. అలా తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక సినిమా ల్లో హీరోగా మానేశారాయన. క్రిష్ణ ఒత్తిడి చేసినా సరే మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపించలేదు. సొంత వ్యాపారం చేసుకుంటూ తెరమరుగయ్యారు. కానీ క్రిష్ణకు మాత్రం రమేష్ బాబునే నట వారసుడిగా ప్రకటించాడు. తన కొడుకును దీవించాలని నాడు ప్రేక్షకులను కోరారు. అయితే రమేష్ బాబు మాత్రం తన బాధ్యతను కూడా మహేష్ బాబుకే అప్పజెప్పారు. నాన్న పేరును నిలబెట్టాలని, తాను ఫెయిలైన చోటు నువ్వు సూపర్ హిట్ కావాలని కోరాడు. అంతే కాదు మహేష్ బాబు కెరీర్ ను దగ్గరుండి ఆయన పర్యవేక్షించారు. అలానే మహేష్ బాబు సూపర్ స్టార్ గా నిలబడ్డారు. అందుకే మహేష్ బాబు కు తన అన్నయ్య రమేష్ బాబు అంటే ప్రాణం. చివరి చూపు చూడలేకపోయినందుకు తన బాధను ఒక పోస్ట్ ద్వారా పంచుకున్నారు. నువ్వు నాకు అడుగులు నేర్పించావు. నువ్వు నాకు ఇన్సిపిరేషన్ గా నిలిచావు. నీ కారణంగానే నేను జీవితంలో ముందుకు సాగాను. నా విజయంలో ప్రతి సంతోషం నీదే. ఎప్పటికీ నువ్వు నా అన్నయ్యవే. జీవితంలో అలసిపోయావు. ఇక విశ్రాంతి తీసుకో. నిన్ను ఎప్పటికీ మరవనంటూ కన్నటి బాధను అక్షర రూపంలో పంచుకున్నారు మహేష్ బాబు.

రమేష్ బాబు సినిమా ఫీల్డ్ లో దుర ద్రుష్టం వెంటాడింది. తొందర పాటు నిర్ణయాలు కూడా ఆయన్ను వెనక్కి నెట్టాయి. ఆ తర్వాత మ్రుదలను పెళ్లి చేసుకుని హాయిగా వ్యాపారం చేసుకుంటూ ఒత్తిడి లేకుండా లైఫ్ లో ముందుకు సాగారాయన. వారికి భారతి, జయక్రిష్ణ అనే పిల్లలున్నారు. అయితే బాలీవుడ్ లో హాటాత్తుగా అబితాబచ్చన్ తో సినిమా తీయాలనుకున్నారు రమేష్ బాబు. తెలుగులో సూపర్ హిట్ అయిన సూర్యవంశం సినిమాను ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆ మూవీని నిర్మాతగా తెరకెక్కించారు. అక్కడ సూపర్ హిట్ అయింది. ఈవీవీని, సౌందర్యను మొదటి సారి బాలీవుడ్ కు పరిచయం చేశారు రమేష్ బాబు. ఆ తర్వాత క్రిష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాతగా ఆయన ముందుకు సాగాలనుకున్నారు. అందుకోసం అర్జున్, అతిథి మూవీస్ ని తెరకెక్కించారు. దురద్రుష్టం కొద్ది ఆ రెండు సినిమాలు ఆయనకు నష్టాలే మిగిల్చాయి. దూకుడు, ఆగడు సినిమాలకు ప్రజెంటర్ గా ఉన్నారు రమేష్ బాబు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

కొడుకు జయ క్రిష్ణను హీరోగా చూడాలని Ramesh Babu 

Ramesh Babu కు ఉన్న ఏకైక కోరిక తన కొడుకు జయ క్రిష్ణను హీరోగా చూడాలని. అందుకోసం జయ క్రిష్ణ వైజాగ్ లో రచయిత సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణతీసుకుంటున్నారు. మహేష్ బాబు తో రమేష్ బాబు కోరిక తీరింది. ఇక తన కొడుకును వెండి తెరపై చూడాలనుకున్నారాయన. కానీ ఆ కోరిక తీరకుండానే కన్ను మూశారు. గత కొన్నాళ్లుగా రమేష్ బాబు కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపుగా నయమైందని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని డాక్టర్లు చెప్పారు. కానీ ఏమైందో ఏమో హఠాత్తుగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తుండగానే గుండెపోటుతో రమేష్ బాబు చనిపోయారు. జీవితంలో రమేష్ బాబు క్రిష్ణ కొడుకుగా పుట్టినా ఆయనకుఏదీ కలిసి రాలేదు. హీరోగా, నిర్మాతగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తన సొంత వ్యాపారంలోనే కొంత కలిసి వచ్చిందని చెప్పొచ్చు. నటనను కంటిన్యూ చేసి ఉంటే రమేష్ బాబు పెద్ద స్టార్ కాకపోయినా మంచి నటుడిగా టాలీవుడ్ లో ఉండేవారు. కానీ నటించనని ఆయన తీసుకున్న నిర్ణయం శాపమైందంటారు సన్నిహితులు.

Ramesh Babu చివరి చూపు చూడలేకపోయిన మహేష్ బాబు

ఇక చివరి చూపు చూడలేకపోయిన మహేష్ బాబు తల్లడిల్లిపోయారు. సినిమా అనే ప్రపంచాన్ని మహేష్ బాబుకు పరిచయం చేసింది Ramesh Babu. ఇద్దరూ సెట్ లో ఆడుతూ పాడుతూ నటించేవారు. ఫైట్ లు చేసి కలిసి పెరిగారు. కానీ కరోనా కారణంగా మహేష్ బాబు నాలుగు గోడల మధ్యలో ఉండాల్సి వచ్చింది. దీంతో ఆయన తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.తన అన్నయ్య ను డైరెక్ట్ గా చూడకుండానే కన్నీటి వీడ్కోలు పలికారాయన. అలా 35 ఏళ్ల క్రితం క్రిష్ణ కొడుకుగా తెలుగునాట ప్రభంజనం లా వచ్చిన రమేష్ బాబు జీవితం తన కొడుకును తెరపై చూసుకోవాలనే కోరిక తీరకుండానే చనిపోవడం బాధాకరం. ఇక క్రిష్ణ తన బిడ్డ రమేష్ బాబు మ్రతదేహాన్ని పదే పదే తాకుతూ తల్లడిల్లిపోయారు. ఎందుకంటే ఏ తండ్రి తన బిడ్డ ప్రాణం పోయిన తర్వాత చూడలేడు. చూసి తట్టుకోలేడు. ఆ బాధను అణుచుకుని కుమిలిపోయారు క్రిష్ణ. అప్పటికే ఆయనకు కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి…తీసుకొచ్చి వెంటనే తీసుకెళ్లారు. ఎంతైనా తన ప్రాణమైన బిడ్డ కదా.

Previous articleRamesh Babu Family : రమేష్ బాబు భార్య – కొడుకుని చూసారా
Next articleSriDevi : నటి శ్రీదేవి కి ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లి జరగాల్సిందట… కానీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here