Bangarraju : బంగార్రాజు కి గుడ్ న్యూస్ చెప్పిన జగన్… ఆ రిక్వెస్ట్ వర్కౌట్ అయ్యిందా…?

161

Bangarraju : తెలుగులో ప్రస్తుతం అక్కినేని హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున బంగార్రాజు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తుండగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి, ప్రముఖ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు సమకూర్చారు. కాగా ఈ చిత్రం ఈ నెల 14వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. దీంతో తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయంలో కొంత మేర సందిగ్ధత నెలకొని ఉన్నప్పటికీ తన చిత్ర కలెక్షన్లు కి ఎలాంటి సమస్య ఉండదని హీరో నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పండుగ వాతావరణంలో ప్రజలు సినిమా చూడటానికి ఇష్టపడతారని అందువల్లనే తాము తమ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నామని స్పష్టం చేశాడు. అలాగే సంక్రాంతి పండుగ సమయంలో ఇతర భారీ బడ్జెట్ చిత్రాలు రేసులో ఉన్నప్పటికీ తమ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.

దీంతో హీరో నాగార్జున అనుకున్నట్లుగానే బంగార్రాజు చిత్రానికి కోవిడ్ నిబంధనల అడ్డంకులు తొలగిపోయాయి. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా ఫుల్ ఆక్యుపెన్సీ తో సినిమా థియేటర్లు నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ కూడా తొలగించి 18 వ తారీకు నుంచి నైట్ కర్ఫ్యూ మరియు ఇతరులకు నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం కొంతమేర బంగార్రాజు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఇతర సినీ నిర్మాతలకు కూడా కొంత మేర ఊరట కలిగించిందని చెప్పవచ్చు.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకపక్క కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే కట్టడి చర్యలు మొదలు పెట్టాల్సిందిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా హీరో నాగార్జున కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలున్నాయని అందువల్లనే ఇటీవల పలుమార్లు జగన్ మోహన్ రెడ్డి తో రహస్య చర్చలు జరిపి సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని కోవిడ్ నిబంధనలకు నీళ్ళోదిలాడని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

కానీ అసలు విషయం ఏమిటంటే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీనికితోడు పండగ దగ్గర పడుతుండడంతో చిరు వ్యాపారులు, ఉద్యోగాల నిమిత్తమై ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు. దాంతో ఈ నైట్ కర్ఫ్యూ మరియు ఇతర నిబంధనల ప్రభావం వీరిపై పడకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైతేనేం మొత్తానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బంగార్రాజు కి మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బంగార్రాజు సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleChiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వెడ్డింగ్ కార్డు, పెళ్లి ఫోటోలు చూసారా..?
Next articleRashi : ఆ సమస్యలే ఈ హీరోయిన్ కెరీర్ కి శాపం గా మారాయా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here