Kajal Aggarwal : ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కాజల్… అలా చెప్పేసిందిగా…

242
Kajal Aggarwal :

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ నుంచి జూనియర్ హీరోల వరకు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగా అలరించిన టాలీవుడ్ బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలకి చెందిన చిత్రాలలో కూడా నటించి తనకంటూ దేశ వ్యాప్తంగా కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే సినీ కెరీర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంతో పెళ్లయినప్పటి నుంచి కాజల్ అగర్వాల్ సినిమాల పరంగా జోరు తగ్గించింది. అంతేకాకుండా కొత్త సినిమాలకి సైన్ చేసే విషయంలో కొంతమేర ఆలోచిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు కాజల్ అగర్వాల్ తొందర్లోనే తల్లి కాబోతోందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

తాజాగా కాజల్ అగర్వాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించింది. అయితే ఇందులో ఏకంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటువంటి పరికరాన్ని ప్రమోట్ చేస్తూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అంతేకాకుండా తొందరలోనే తాను తల్లి కాబోతున్నాని తెలిసినప్పటినుంచి తన ఆనందానికి అవధులు లేవని అలాగే ఈ ఏడాది నా చిన్నారి ని కలవడానికి చాలా ఆత్రుతగా ఉన్నానని పేర్కొంది.

అయితే ప్రెగా న్యూస్ పరికరాన్ని ప్రమోట్ చేసినందుకు కాజల్అగర్వాల్ దాదాపుగా లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు. దీంతో కొందరు నెటిజన్లు నటి కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్నందుకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నటి కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కుడా ఓ ప్రకటన ద్వారా తెలియజేయడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో కొందరు నటీనటులు ప్రతి విషయాన్ని కమర్షియల్ గా చూస్తున్నారని దాంతో తమ వ్యక్తిగత విషయాలను కూడా కమర్షియల్ గా ప్రమోట్ చేసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఏకంగా వయసు పైబడిన అటువంటి బామ్మ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో తొందర్లోనే ఇండియన్ 2 చిత్ర విడుదల సమాచారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Please Click the below below bell icon for latest updates from srimedianews.com

Previous articleLara Dutta : ఇద్దరితో ప్రేమాయణం నడిపి మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న హీరోయిన్… చివరికి…
Next articleJhanvi Kapoor : రోజులు చాలా కఠినంగా గడిచాయంటున్న హీరోయిన్ కూతుళ్ళు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here