Rashi : బాలయ్య తో ఆ సీన్ లో నటించేందుకు ఈ హీరోయిన్ నో చెప్పిందట… దాంతో…

3388

Heroine Rashi : తెలుగులో ప్రముఖ హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహా రెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్లుగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, అంజలా జవేరి తదితరులు నటించగా జయప్రకాష్ రెడ్డి, వెటరన్ హీరో పృద్వి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి పలు రికార్డులను నెలకొల్పింది. అంతేకాకుండా బి, సి సెంటర్లలో 100 రోజులు ఆడింది. కాగా ఈ చిత్రం విడుదలై 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్ సిమ్రాన్ నటించిన పాత్ర కోసం ముందుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలుగు ప్రముఖ Heroine Rashi ని సంప్రదించారట. కానీ రాశి మత్రం ఈ చిత్రంలోని హీరోయిన్ నడుము పై సీతాకోక చిలుక వాలేటువంటి సన్నివేశంలో నటించడానికి ఒప్పుకోలేదట. అలాగే ఈ సన్నివేశాన్ని సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఈ సీతాకోక చిలుక సన్నివేశం తొలగిస్తే నటిస్తానని లేకపోతే లేదని దర్శక నిర్మాతలతో చెప్పిందట. కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఆ సన్నివేశాన్ని తొలగించలేమని చెప్పడంతో రాశి సమరసింహా రెడ్డి చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదట. దాంతో ఈ అవకాశం కాస్త హీరోయిన్ సిమ్రాన్ కి దక్కింది. అయితే 1999వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపుగా 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. దీంతో ఇప్పటికే అప్పట్లో సమరసింహా రెడ్డి చిత్రం నెలకొల్పిన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి.

Rashi says No Simran Says Yes
Rashi Says No – Simran-Bala Krishna Blockbuster

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నందమూరి బాలకృష్ణ తెలుగులో “అఖండ” అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కాగా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అంతేకాకుండా దాదాపుగా 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. కాగా ఈ చిత్ర ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. దీంతో ఈ నెల 23వ తారీకు నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleJhanvi Kapoor : రోజులు చాలా కఠినంగా గడిచాయంటున్న హీరోయిన్ కూతుళ్ళు
Next articleMother and Daughter Theft కూతురితో కలసి డబ్బు కోసం పాడు పనులు చేస్తున్న తల్లి.. చి.. ఛీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here