Anasuya : ఆంటీ అని పిలావచ్చా అని అనసూయ ని అడిగిన నెటిజన్…. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిందిగా….

322

Anasuya

Anasuya : తెలుగు బుల్లితెరపై పలు రకాల షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్. యాంకర్ అనసూయ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే శ్రమించింది. కానీ ఈ అమ్మడి సినిమా కెరీర్ మలుపు తిరిగింది మాత్రం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతోనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో యాంకర్ అనసూయ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు లైవ్, చిట్ చాట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తోంది. దీంతో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీలను తికమక ప్రశ్నలు అడగడం, వ్యక్తిగత విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఓ నెటిజన్ ప్రశ్న

కాగా తాజాగా ఓ నెటిజన్ యాంకర్ Anasuya ని ఏకంగా “మిమ్మల్ని ఇప్పుడు అక్క అని పిలవాలా లేక ఆంటీ అని పిలవాలా” అంటూ ప్రశ్నించాడు. దీంతో యాంకర్ అనసూయ ఈ విషయం గురించి స్పందిస్తూ తనని ఎలాగో పిలవవద్దని. ఎందుకంటే వరసలు కలుపుకుని పలకరించేంత బంధం, స్నేహం మనమధ్య లేదని కాబట్టి బంధాలు కలుపుకొని పలకరించేంత అవసరం కూడా లేదని తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగకుండా పిలుపు ఏదైనా సరే ఉద్దేశాలు మాత్రం వేరేలా ఉంటాయని ఈ క్రమంలో వయసు ను వ్యక్త పరుస్తూ కించపరిచినట్లు ఉంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

Anasuya
Anasuya

దీంతో ఈ ప్రశ్న అడిగిన నెటిజన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అంతటితో ఆగకుండా ఇతరులను అక్క అని పిలిచినంత మాత్రాన వారి వయసు ను ప్రస్తావిస్తూ కించపరిచినట్లు కాదని అలాంటప్పుడు ఒక్కోసారి ప్రశంసలు కూడా తీసుకోవద్దని ప్రశ్నించాడు. దీంతో ఈసారి యాంకర్ అనసూయ తనదైన శైలిలో స్పందిస్తూ ప్రశంసలు తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని బదులిచ్చింది. ఏదేమైనప్పటికీ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే యాంకర్ అనసూయ తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కనిపించినప్పటికీ తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో హైలెట్ కాలేకపోయింది. కానీ ప్రస్తుతం యాంకర్ అనసూయ కి టాలీవుడ్లో సినిమా ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం ఒకపక్క సినిమా షూటింగులు మరోపక్క పలు రకాల షోలు, ఈవెంట్లతో బిజీబిజీగా గడుపుతోంది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleMother and Daughter Theft కూతురితో కలసి డబ్బు కోసం పాడు పనులు చేస్తున్న తల్లి.. చి.. ఛీ…
Next articleYoungest Mother in the World 5 ఏళ్లకే తల్లిని చేసేశారు….ముసలి వయసులో చెప్పిన నిజం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here