Himaja : పెళ్లి చేసుకుంటా…. మంచి సంబందం ఉంటే చెప్పండంటున్న బిగ్ బాస్ బ్యూటీ…..

469

Himaja : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరగడంతో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం కూడా బాగానే పెరిగిందని చెప్పవచ్చు. దీంతో ఎలాంటి విషయమైనా సరే సోషల్ మీడియాలో బయటకు వచ్చింది అంటే చాలు ఇట్టే వైరల్ ఐపోతుంది. దీంతో కొందరు ఈ విషయాన్ని అలుసుగా తీసుకుని సెలబ్రెటీల ను టార్గెట్ చేస్తూ వారి గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేయడం మరియు నెగిటివ్ గా ట్రోల్ చేయడం వంటివి చేస్తూ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నారు. కాగా ఇటీవలే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ సోషల్ మీడియా మాధ్యమాలలో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా కొందరు వ్యక్తులు నటి హిమజకి ఇంతకుముందే పెళ్లయిందని ఈ క్రమంలో 2012వ సంవత్సరంలో ఓ ప్రముఖ వ్యాపార వేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు ఎక్కువవడంతో విడాకులు తీసుకున్నారని, తీసుకోబోతున్నారని పలు కథనాలు ప్రచారం చేశారు. దీంతో అప్పటి నుంచి నటి హిమజ పెళ్లి విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది. చివరికి ఈ విషయం ఈ నోటా ఆ నోటా పాకుతూ నటి హిమజ చెవిన పడింది.

Himaja
Himaja

దీంతో తాజాగా నటి హిమజ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయం గురించి స్పందించింది. ఇందులో భాగంగా తనకు ఇంతకుముందే పెళ్లయినట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా కొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా యూట్యూబ్ లో పెళ్లిళ్లు చేస్తూ ఏకంగా విడాకులు కూడా ఇచ్చేస్తున్నారని కానీ తన పెళ్ళికి తనని కూడా పిలిచి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చింది. అంతేగాక తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని కానీ 4, 5 ఏళ్ల తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని మంచి సంబంధం ఉంటే చెప్పండంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.

అయితే తనకు ఇలాంటి ఫేక్ వార్తల గురించి స్పందించడం పెద్దగా ఇష్టం ఉండదని కానీ తన కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు నిజం తెలియాలని ఈ వీడియో చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. అలాగే తన పెళ్లి గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని స్పందించి నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే యూట్యూబ్ లో తన గురించి ఆసక్తికర వీడియోలు కనిపిస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ని రిపోర్టు చేయాలని కోరింది. అలాగే తాను కూడా ఈ విషయం గురించి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది.

Himaja
Himaja

అలాగే ఈ మధ్య కాలంలో తాను చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియా మరియు యూట్యూబ్లో వరుసగా ట్రెండింగ్ అవుతున్నాయని దాంతో కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఇలా తన గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికితోడు ఇటీవల తాను తన కొత్త ఇంటి నిర్మాణం పనుల గురించి కూడా వీడియో పెట్టడంతో ఓర్వ లేనటువంటి కొందరు ఇలా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు రోజులుగా నటి హిమజ పెళ్లి విషయంపై వినిపిస్తున్న పుకార్లకు దాదాపుగా పులిస్టాప్ పడింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి హిమజ పలురకాల షోలు ఈవెంట్లు మరియు చిత్రాలలో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. దీంతో ఇటీవలే ఈ అమ్మడు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసి దాదాపుగా నాలుగు అంతస్తుల ఇల్లు కూడా కడుతోంది. దీంతో ఇటీవలే ఈ విషయానికి సంబంధించి ఓ వీడియోని కూడా నటించిన సోషల్ మీడియా మాధ్యమాలలో విడుదల చేసింది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleYoungest Mother in the World 5 ఏళ్లకే తల్లిని చేసేశారు….ముసలి వయసులో చెప్పిన నిజం
Next articleHeroine : దర్శకనిర్మాతలకు ఆ హీరోయిన్ తల్లి తలనొప్పిగా మారిందట… అడిగిందల్లా ఇవ్వాలంటూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here