Director : అప్పులపాలయిన డైరెక్టర్… అప్పులు తీర్చేందుకు అలా చేస్తూ పోలీసులకి చిక్కి… చివరికి….

481

Director

Director : ప్రస్తుత కాలంలో కొందరు ఆర్ధికంగా తమ పరిధి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తమ పరిధిని మించి అప్పులు చేసి వ్యాపారాలు, వస్తువులు కొనుగోలు చేయడం వంటివి చేస్తూ చివరికి ఈ వ్యాపారాలు కాస్త బెడిసికొట్టడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ కటకటాల పాలు అవుతున్నారు. కాగా తాజాగా ఓ యువకుడు లక్షల రూపాయలు అప్పులు తీర్చలేక కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు చిక్కిన ఘటన తమిళనాడు రాష్ట్ర పరిసర ప్రాంతంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే చెన్నై పట్టణ పరిసర ప్రాంతంలో కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడికి చిన్నప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో సరైన అవగాహన లేకుండా అప్పుడప్పుడు పలు షార్ట్ ఫిలిమ్స్ తీయడం అలాగే ఫోటో షూట్ల పేరుతో లక్షల రూపాయలు వెచ్చించాడు. ఇందుకోసం అందిన చోటల్లా తన బంధువుల దగ్గర అలాగే స్నేహితుల దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేశాడు.

ఇది తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు గత కొద్ది కాలంగా కృష్ణ ప్రసాద్ ని దూరంగా ఉంచారు. ఈ క్రమంలో పాకెట్ మనీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. దీంతో చేతిలో డబ్బుల్లేక కృష్ణ ప్రసాద్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనికితోడు డబ్బులు అప్పుగా ఇచ్చినటువంటి వ్యక్తులు తమ డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి తేవడంతో తన అప్పులు తీర్చుకునేందుకు కన్నింగ్ ఐడియా వేసాడు.

Director
Director

ఈ క్రమంలో చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ హోటల్ లో రెండు రోజులు బస చేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే విడిచి పెడతారని డ్రామా ఆడాడు. దీంతో కృష్ణ ప్రసాద్ తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టువంటి పోలీసులు కృష్ణ ప్రసాద్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి జాడ ని కనుగొన్నారు.

ఇంకేముంది సీన్ రివర్స్ అవ్వడంతో కృష్ణ ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. దాంతో పోలీసులు కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కృష్ణ ప్రసాద్ ని అప్పగించారు. మరి ఇప్పటికైనా కృష్ణ ప్రసాద్ ( Director ) చేసిన అప్పులను తన తల్లిదండ్రులు తీర్చారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleHeroine : దర్శకనిర్మాతలకు ఆ హీరోయిన్ తల్లి తలనొప్పిగా మారిందట… అడిగిందల్లా ఇవ్వాలంటూ…
Next articleSamudra : ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందే చెప్పా.. కానీ బాలకృష్ణ వినలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here