Snake Suresh Biting Story : విషం తలకు ఎక్కేలా…..

327
Snake Suresh
Snake Suresh

విషం తలకు ఎక్కినా పామును వదలడు

Snake Suresh Biting Story : సురేష్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు. Vava Suresh అంటే పేపర్లు చదివేవాళ్లు, టీవీ చూసే వాళ్లు ఇట్లే గుర్తుపడతారు. ఒక వేళ ఈ సురేష్ గుర్తుకు రాకుంటే ఈ స్టోరీ జాగ్రత్తగా చూడాల్సిందే. సురేష్ఇ తన్ని స్నేక్ సురేష్ అని పిలుస్తారు. కేరళలో అయితే వావ సురేష్ అంటారు. ఈయనకు ఇంతగా పాపులారిటీ రావడానికి కారణం. ఎంత పెద్ద పామునైనా సరే ఎలాంటి సేఫ్టీ లేకుండా బంధిస్తాడు. కోడె నాగులను కూడా తోకను పట్టుకుని ఆడిస్తాడు. ఈయన పాపులారిటీ ఖండాంతరాలు దాటింది. బ్రిటీష్ యువరాజు కేరళ వచ్చినప్పుడు ప్రత్యేకంగా సురేష్ ను కలుసుకోవాలనుకున్నాడంటే మనోడి ప్రత్యేకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. బ్రిటిష్ యువరాజు విలియం ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయించుకుని మరీ కలిశాడంటే సురేష్ ప్రత్యేకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Snake Suresh

Snake Suresh కు 12వ ఏట నుంచే పాములను పట్టడం అలవాటైందట

తిరువనంతపురంలో 1974 లో సురేష్ పుట్టాడు. 12వ ఏట నుంచే పాములను పట్టడం అలవాటైందట. ఆ పాముల వేటలో చదువును కూడా వదిలేశాడు. పాములను రక్షించడమే జీవితాశయంగా పెట్టుకున్నాడు సురేష్. ఇప్పటికే 50వేల పాములను రక్షించి అడవిలోకి వదిలాడు. తిరువనంతపురంలో ఎక్కడ పాము కనిపించినా సురేష్ ఫోన్ మొగుతూనే ఉంటుంది. పాముల పట్టడంలో నేర్పరితనం Snake Suresh కు పాపులారిటీ తెచ్చిపెట్టింది. స్థానిక మీడియానే కాదు జాతీయ మీడియాలో కూడా సురేష్ టాలెంట్ పై ఎన్నో కథనాలు వచ్చాయి. ఇప్పటికే వేలాది పాములు పట్టిన సురేష్ కు ఇంత వరకు పామే కరవలేదా అంటే వేల సార్లు పాము కాటుకు గురయ్యాడు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పాములు పట్టడంతో దాదాపు మూడు వేల సార్లు కుడితే చిన్న పాటి ట్రీట్ మెంట్ తో బయటపడ్డాడు. కానీ మూడు వందల సార్లు కోడె త్రాచులు కరవడంతో ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకున్నాడు. నాలుగు సార్లు ఐసీయూలో పెట్టి మరీ ట్రీట్ మెంట్ చేయాల్సి వచ్చింది. అయినా సరే ప్రొటెక్షన్ వాడకుండానే స్నేక్ ను పడతాడు సురేష్.

తాచు పాము కాటుకు గురైనా కూడా ధైర్యంగా ఆయనే హాస్పిటల్ కు వెళ్తాడు. అయితే పాముల రక్షణకు ఎవరో ఒకరు పాటు పడాలి. ఆ దేవుడు నన్ను వాటిని కాపాడటం కోసమే పంపి ఉంటాడనే నమ్ముతాను అంటాడు. ఆయన ధైర్యం చూసి కేరళ సర్కారు పాముల సంరక్షణ కేంద్రంలో జాబ్ కూడా ఇచ్చింది. కానీ నేను ఉద్యోగంలో చేరితే బయట స్నేక్స్ ని ఎవరు కాపాడుతారు. నా లక్ష్యం దెబ్బ తింటుందనే భావనతో సర్కారు ఉద్యోగాన్ని తిరస్కరించాడు. మళ్లీ ఇప్పుడు యథావిథిగా పాములను కాపాడుతున్నాడు సురేష్.

Snake Suresh ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను చేతితోనే పట్టుకున్నాడు. దాని పొడవు పద్దెనిమిదిన్నర మీటర్లు. ఒక ఇంట్లోకి చొరబడ్డ ఆ పామును పట్టడానికి మూడు గంటలు పట్టింది. దానిని పట్టనైతే పట్టాడు కానీ అదే పాము కాటుకు ఆసుపత్రి పాలయ్యాడు. చావు నుంచి బయటపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో పాటు ఇమీడియెట్ గా ఏ ఇంజెక్షన్ వేసుకోవాలో అతనికి తెలుసు. అందుకే అన్ని సార్లు కరిచినా ప్రాణాలతో ఉన్నాడు. ఎన్నో అవార్డ్ లు , రివార్డ్ లు అందుకున్న సురేష్ మరింత హెల్దీగా ఉండి పాముల సంరక్షణ తోడ్పడాలని కోరుకుందాం.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

If you like our article Snake Suresh

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articlelizard man ఈ కుర్రాడికి బల్లులే జీవితం
Next articleWoman gave birth to lizard – బల్లికి జన్మనిచ్చిన మహిళ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here