Pokiri సినిమా అందుకే హిట్ అయ్యింది …. ఆ పని చెయ్యకపోతే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది…
Pokiri : తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నాజర్, అజయ్, సుబ్బరాజు, మాస్టర్ భరత్, బ్రహ్మానందం, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద దాదాపుగా 65 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను సాధించి తెలుగు చలన చిత్రంలో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటికీ ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేసిన ప్రముఖ టాలీవుడ్ ఫిలిం ఎడిటర్ “మార్తాండ్ కే వెంకటేష్” ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పోకిరి చిత్ర ఎడిటింగ్ విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
Pokiri చిత్ర ఎడిటింగ్ విషయాలు:
ఇందులో భాగంగా పోకిరి చిత్రాన్ని ఎడిట్ చేసేటపుడు ఎక్కువ శాతం అనవసరమైన సన్నివేశాలను తొలగించామని తెలిపాడు. ఇందులో ముఖ్యంగా పోకిరి చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డమని అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ క్లైమాక్స్ సన్నివేశాలని దాదాపుగా 17 నిమిషాలపాటు చిత్రేకరించాడని దాంతో ఈ సన్నివేశాలను 7 నిమిషాలకి కుదించామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో సన్నివేశానికి తగ్గట్టుగా హీరో హావభావాలు లేకపోవడం, అనవసరమైన నిడివి ఎక్కువగా ఉండటం వంటి సన్నివేశాలను పూర్తిగా తొలగించామని చెప్పుకొచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే క్లైమాక్స్ ఎడిటింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంవల్లే పోకిరి సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు. అయితే పోకిరి చిత్ర ఎడిటింగ్ సమయంలో దర్శకనిర్మాతలు కూడా చాలా సహకరించారని అందువల్లే మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎడిటింగ్ పై ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా రివ్యూలు రాస్తున్నారని, అంతటితో ఆగకుండా ఎడిటర్ పనితనం సరిగ్గా లేదని కామెంట్లు చేస్తున్నారని దాంతో తాను సినిమా రివ్యూలు పెద్దగా పట్టించుకోనని స్ఫష్టం చేసాడు.
మార్తాండ్ కే వెంకటేష్ కెరియర్ వివరాలు:
ఇక తన కెరియర్ గురించి స్పందిస్తూ తాను 1994 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన అల్లరి ప్రేమికుడు అనే చిత్రం ద్వారా ఎడిటర్ గా కెరియర్ స్టార్ట్ చేసానని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ దాదాపుగా 100 కి పైగా సినిమాలకి ఎడిటర్ గా పని చేసానని దాంతో తాను ఏదైనా సినిమాని ఎడిట్ చేసేటప్పుడే ఆ సినిమా ఫలితాలని అంచనా వేస్తామని తెలిపాడు. ఈ క్రమంలో కొందరు దర్శకనిర్మాతలకి తాము చెప్పేటువంటి అభిప్రయాలు నచ్చకపోయినాసరే ఎప్పుడూ కూడా నిజాలే చెబుతామని పేర్కొన్నాడు. ఈ మధ్య కాలంలో సినిమా టేకింగ్ విధానంలో చాల మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చాడు.
గతంలో దర్శకనిర్మాతలు తాము అనుకున్న కథని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తీసేవాళ్ళని కానీ ఇప్పుడు హీరో, నిర్మాతలు, మరియు ఇతరులు కూడా స్క్రిప్ట్ పనుల్లో, అలాగే దర్శకత్వ విభాగంలో వేలు పెడుతుండటంతో చిత్రంలోని అనవసర సన్నివేశాల నిడివి పెరిగిపోతోందని దాంతో చివరికి ఈ సన్నివేశాలను డిలీట్ చెయ్యాల్సి వస్తోందని తెలిపాడు. ఈ విషయం కారణంగా తమకి పని పెరగడమనే మాట అటుంచితే నిర్మాతలకి కూడా బడ్జెట్ వ్యయం పెరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేసాడు.
Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )
https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/
https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/
If you like our article about Pokiri Movie
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites