Kacha Badam అనే పాటతో సెలెబ్రెటీ అయిపోయాడుగా…

181

పల్లీలు అమ్ముకునే వ్యక్తి జీవితాన్నే మార్చేసిన పాట

kacha badam : 20వ దశాబ్దకాలంలో సోషల్ మీడియాకు ఉన్నటువంటి పవర్ గురించి కొత్తగా జనాలకి తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పుడు సినిమాల్లో, వార్తల్లో కనిపిస్తే తమ గురించి జనాలకు తెలియడంతో పాటు పాపులర్ అవుతారని కొందరు అనుకునేవాళ్ళు. కానీ ప్రస్తుత జనరేషన్ లో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో కేవలం మనలో టాలెంట్ ఉంటే పాపులారిటీ ఆటోమేటిక్ గా అదే వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు నిరూపితం అయింది కూడా. అలాగే సోషల్ మీడియా మాధ్యమాలలో కేవలం కంటెంట్ ఉంటే చాలు ఇట్టే ప్రపంచానికి పరిచయం అయిపోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో “కచ్చా బాదాం” అనే పాట తెగ వైరల్ అవుతోంది. అసలు ఏంటి ఈ కచ్చా బాదాం పాట, ఈ పాట పాడిన సింగర్ వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భుభన్ బాధ్యేకర్ – kacha badam పాట సింగర్ పేరు వివరాలు : 

ఈ కచ్చా బాదాం పాట పాడిన అసలు వ్యక్తి పేరు భుభన్ బాధ్యేకర్. ఈ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని లక్ష్మీనారాయణపూర్ అనే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కాగా భుభన్ తల్లిదండ్రులు పేదరికంలో మగ్గడంతో పెద్దగా చదువుకోలేక పోయాడు. దీంతో తన కుటుంబ పోషణ నిమిత్తమై బాదం పల్లీలు అమ్ముకునేవాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పాత సామాన్లు తనకు ఇస్తే అందుకు బదులుగా బాదం పల్లీలు ఇస్తానని కొంత మేర డిఫరెంట్ గా సైకిల్ మీద తిరుగుతూ పల్లీల అమ్ముతుండేవాడు. అలా కచ్చా బాదాం పాట రూపు దిద్దుకుంది.

kacha badam
kacha badam

kacha badam పాట వైరల్ :

ఈ క్రమంలో ఓ సారి ఈ కచ్చా బాదాం పాట పాడుతూ పల్లీలు అమ్ముతుండగా ఓ యువతి కంట పడ్డాడు. అయితే ఆ యువతి అప్పటికే సోషల్ మీడియా మాధ్యమాలలో వీడియోలు, రీల్స్ చేస్తూ బాగానే పాపులర్ అయింది. దీంతో బాదం పల్లీలు కొనుక్కోవడానికి భుభన్ దగ్గరికి వెళ్ళి కచ్చా బాదాం పాటకి సరదాగా నాలుగు స్టెప్పులేసి ఆ వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఈ పాటకి సోషల్ మీడియాలో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.

kacha badam
kacha badam

ఇది గమనించిన కొందరు భుభన్ ని సంప్రదించి కొంతమేర డిఫరెంట్ గా కచ్చా బాదాం పాటకి ట్యూన్ కట్టి యూట్యూబ్లో విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ఈ పాట పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ మార్మోగిపోతోంది. దీంతో భుభన్ కి కూడా ఈ విషయం బాగానే కలిసొచ్చింది. ఈ క్రమంలో కొందరు సినీ సెలబ్రిటీలు ఈ కచ్చా బాదం పాటకి స్టెప్పులేయడమే కాకుండా ఈ పాట పాడిన భుభన్ కి ఆర్థికంగా సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే తాజా సమాచారం ప్రకారం ఓ ప్రముఖ సెలబ్రిటీ షో లో కూడా కచ్చ బాదం పాటని పాడే అవకాశం భుభన్ ని వరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అప్పటివరకు పల్లీల అమ్ముకునేటువంటి ఓ వ్యక్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలియడానికి ముఖ్య కారణం మాత్రం సోషల్ మీడియా మాధ్యమాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

జానే మేరీ జానే మన్ పాట వైరల్ :

కాగా ఆ మధ్య పాఠశాలలో రాజు అనే బుడ్డోడు పాడిన జానే మేరీ జానే మన్ పాట కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో కొందరు రాజకీయా నాయకులు కూడా రాజు ని అభినందించారు. అంతటితో ఆగకుండా 20 లక్షల విలువ చేసే ఎంజీ హెక్టర్ కారుని కూడా బహుమతి గా ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో రాజు చదువుకి కావాల్సిన ఆర్థిక సాయం కూడా అందించారు.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

If you like our article about kacha badam

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Our other Website telugumirrors.com

Keep Reading articles on our websites

Previous articleChiranjeevi కి హీరోగా మొదటి సినిమా అవకాశం….
Next articleAbbas అనే హీరో పెట్రోల్ బంకుల్లో పని చేస్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here