Abbas అనే హీరో పెట్రోల్ బంకుల్లో పని చేస్తూ…
Abbas : 1996వ సంవత్సరంలో తమిళ ప్రముఖ దర్శకుడు కదీర్ దర్శకత్వంలో విడుదలైన “ప్రేమ దేశం” చిత్రం అప్పట్లో సౌత్ ఇండియాలోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కాగా ఈ చిత్రంలో హీరోలుగా వినీత్, అబ్బాస్ నటించగా హీరోయిన్ గా టబు నటించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన అబ్బాస్ కి మొదటి చిత్రం కావడంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తమిళం, హిందీ తదితర భాషల్లో కూడా నటుడు అబ్బాస్ కి సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి. దీంతో నటుడు అబ్బాస్ దాదాపుగా 10 సంవత్సరాల పాటు హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా రాణించాడు.
ఈ క్రమంలో నటుడు Abbas ని హిట్లకన్నా ఎక్కువగా డిజాస్టర్లే పలకరించాయి. అయితే ఇందుకుగల కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా నటుడు అబ్బాస్ కి సినిమా ఆఫర్లు వరిస్తున్న సమయంలో కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయాడు. అంతేకాకుండా తన పాత్రల విషయంలో కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చివరకు తాను హీరోగా నటించినప్పటికీ కమలహాసన్, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోల చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటించాడు. కానీ ఈ చిత్రాలేవీ నటుడు అబ్బాస్ సినీ కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. దీనికితోడు అప్పటికే నటుడు అబ్బాస్ హీరో ఇమేజ్ కూడా బాగానే దెబ్బతింది.
దాంతో దర్శకనిర్మాతలు నటుడు అబ్బాస్ కి హీరోగా సినిమా ఆఫర్లు ఇచ్చే విషయంలో కొంతమేర ఆలోచనలో పడ్డారు. ఇక అప్పటి నుంచి నటుడు Abbas సినీ కెరీర్ పూర్తిగా పతనమైంది. దీంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 1, 2 చిత్రాలలో నటించి హిట్ పడగానే చేజేతులారా కెరీర్ని పోగొట్టుకున్న నటీనటుల జాబితాలో నటుడు అబ్బాస్ కూడా చేరిపోయాడు. ఇక వెండితెరపై హీరోగా కెరియర్ దాదాపుగా క్లోజ్ అయిన తర్వాత పలు చిత్రాలలో నెగిటివ్ షేడ్స్ మరియు విలనిజం కూడా కనబర్చాడు. అయినప్పటికీ సినీ కెరీర్ మాత్రం మలుపు తిరిగే లేదు.
సినీ పరిశ్రమలో Abbas తన ఉనికిని చాటుకునేందుకు
దీంతో సినీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు బుల్లితెరపై కూడా రెండు తమిళ చిత్రాల్లో నటించాడు. కానీ బుల్లితెర పై కూడా అబ్బాస్ కెరియర్ చాలా చప్పగానే సాగింది. దీంతో అబ్బాస్ ఇక నటనకు గుడ్ బై చెప్పి తన భార్యతో కలిసి న్యూజిలాండ్ దేశానికి వెళ్లి పోయాడు. అలాగే తన సినీ జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో న్యూ జిలాండ్ కి వెళ్ళిన కొత్తలో పెట్రోల్ బంక్ లో పని చేయడంతో పాటు మెకానిక్ గ్యారేజ్ లో కూడా పనిచేశాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ దేశంలో ఉన్నటువంటి ఓ పేరున్న యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా పూర్తి చేశాడు. కాగా నటుడు అబ్బాస్ భార్య కి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి ప్రావీణ్యం ఉండడంతో ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే నటన పరంగా కెరియర్ కి గుడ్ బై చెప్పినటువంటి అబ్బాస్ ఆ మధ్య హార్పిక్ సంస్థ ఉత్పత్తులను ప్రమోట్ చేసిన ప్రకటనల్లో నటించాడు. ఈ ప్రకటనలకి మంచి స్పందన లభించింది. దాంతో ఈ 30 సెకండ్ల ప్రకటన కోసం సంస్థ అధికారులు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకొని స్టార్డమ్ తెచ్చుకున్న అబ్బాస్ తన సినీ కెరీర్ లో కథలు, మరియు పాత్రల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే అతడి సినీ కెరీర్ నాశనమయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )
https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/
https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/
If you like our article about hero
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites