Andhrawala సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పా …

191

Andhrawala సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పా

Andhrawala : మామూలుగా దర్శకుడు తాను అనుకున్న విధంగా చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత మొదటగా ఆ చిత్రాన్ని చూసేది ఎడిటింగ్ చేసేటటువంటి ఎడిటర్. దీంతో ఆ ఎడిటర్ కి దాదాపుగా సినిమా ఫలితం గురించి అవగాహన వస్తుంది. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆంధ్రావాలా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా వెటరన్ హీరోయిన్ రక్షిత నటించగా సాయాజీ షిండే, రాహుల్దేవ్, బ్రహ్మానందం, వేణుమాధవ్ నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేసినటువంటి తెలుగు ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

"<yoastmark

Andhrawala లో ఎన్టీఆర్ పెద్ద వయసున్న వ్యక్తి పాత్రలో కనిపించడం

ఇందులో భాగంగా ఆంధ్రావాలా చిత్రం ఎడిటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ తన వద్దకు వచ్చి ఈ చిత్రం ఎలా ఉందని అడిగాడని దాంతో నిర్మొహమాటంగా తనకి ఈ చిత్రం నచ్చలేదని చెప్పినట్లు తెలిపాడు. అలాగే ఆంధ్రావాలా చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెటప్ ఏ మాత్రం బాగా లేదని దీనికితోడు ఎన్టీఆర్ పెద్ద వయసున్న వ్యక్తి పాత్రలో కనిపించడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయిందని తన అభిప్రాయం తెలిపాడు. దాంతో ఈ చిత్రం ఎడిటింగ్ పనులు పూర్తయిన తర్వాత ఫ్లాప్ అవుతుందని దర్శకుడు పూరి జగన్నాథ్ తో చెప్పానని చెప్పుకొచ్చాడు.

అలాగే దర్శకుడు తాను అనుకున్న విధంగా సినిమా తెరకెక్కించిన తర్వాత ఆ సినిమాని మొదటగా చూసేది ఎడిటింగ్ చేసే వ్యక్తి అని దాంతో తమకి సినిమాల ఫలితాలపై దాదాపుగా అవగాహన ఉంటుందని తెలిపాడు. అలాగే తాము ఎప్పుడూ కూడా దర్శకనిర్మాతలతో సినిమాల ఫలితాలపై అబద్దాలు చెప్పమని అందువల్లనే సినీ దర్శకులు మరియు నిర్మాతలు తన మాటలకి అంత విలువ ఇస్తారని చెప్పుకొచ్చాడు.

Super Movie team (Andhrawala movie editor)
Super Movie team

అయితే చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రాన్ని కూడా తానే ఎడిట్ చేశానని దాంతో ఎడిటింగ్ పనులు పూర్తయిన తర్వాత ఈ చిత్రం కూడా తనకు నచ్చలేదని దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చెప్పినట్లు తెలిపాడు. అయితే అప్పటి వరకూ తమకు హీరో నాగార్జున అందగాడని తెలుసని కానీ సూపర్ చిత్రంలో నాగార్జున గెటప్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనిపించిందని అందువల్లనే తనకు నచ్చలేదని చెప్పాడట. దీంతో ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చెప్పినట్లుగానే ఆంధ్ర వాళ్ళ మరియు సూపర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

If you like our article about Andhrawala movie editor

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleUday Kiran ఆత్మ హత్య వెనుక వున్న రహస్య నిజాలు
Next articleNikitha : ఆ కన్నడ హీరో తో ప్రేమాయణం – సినీ కెరియర్ నాశనం ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here