Vatican city : పేరుకే చిన్న దేశం.. కానీ ప్రపంచంలో అత్యధికంగా క్రైం రేటు ఉండేది అక్కడే…

245

Vatican city : పేరుకే చిన్న దేశం.. కానీ ప్రపంచంలో అత్యధికంగా క్రైం రేటు ఉండేది అక్కడే…

Vatican city : ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది వాటికన్ సిటీ దేశం. అయితే ఈ దేశం విస్తీర్ణం పరంగా చిన్నదే అయినప్పటికీ ఎన్నో ప్రాముఖ్యతలను మరియు విశిష్టతలను కలిగి ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…

అయితే వాటికన్ సిటీ ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం మాత్రమే కాదు. పవిత్రమైన రోమ్ నగరానికి సంబందించిన మత గురువులు ఎక్కువమంది ఈ వాటికన్ సిటీ దేశంలో నివాసముంటారు. అలాగే ఈ దేశంలో మహిళలు నివాసం ఉండేందుకు అనుమతి లేదు. కానీ షాపింగ్ మాల్స్, మరియు ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే మహిళలు ఇతర ప్రాంతాలనుంచి వచ్చి వెళుతూ ఉంటారు. కాగా ఈ వాటికన్ సిటీ దేశంలో 2020 సంవత్సర జనాభా లెక్కల ప్రకారం కేవలం 1020 మంది పౌరులు మాత్రమే పౌరసత్వం కలిగి ఉన్నారు. కాగా ఇందులో 400 మందికి పైగా మత గురువులు ఉండగా మరో 500 మంది సైనిక అధికారులు మరియు సైనిక దళంలో పనిచేసే సైనికులు ఉన్నారు. మిగిలిన వారు ఇతర విభాగాలలలో పని చేసే వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ దేశంలో జన్మించినంతమాత్రాన ఈ దేశపు పౌరసత్వం లభించదు. ఈ దేశపు పౌరసత్వం ఇవ్వాలా..?, వద్దా అనేది దేశ ప్రధాన అధికారులు నిర్ణయిస్తారు. ఇక ఈ దేశంలో పని చేసేందుకు లభించిన పౌరసత్వం ఉద్యోగం పోగుట్టుకుంటే ఉద్యోగంతో పాటూ పౌరసత్వం కూడా పోతుంది.

ఇక వాటికన్ సిటీ విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయినప్పటికీ క్రైం రేటు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో మాత్రం మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఈ దేశంలో రోజూ ఎక్కువమంది దుండగలు టూరిస్టుల నుంచి డబ్బు, బంగారం మరియు ఇతర ఖరీదైన వస్తువులను దొంగలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో దుండగులు అప్పుడప్పుడు తుపాకులతో కూడా రోడ్లపై దర్శనమిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా తమ వస్తువులు పోగొట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ఈసారి మీరు వాటికన్ సిటీ దేశానికి చూడటానికి వెళ్ళినప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక ఈ దేశంలో భద్రతా దళంలో పని చేసే సైనికులకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. అలాగే ఈ దేశపు ఆర్మీ విభాగంలో పని చెయ్యాలంటే తన పదివీకాలం ముగిసేంతవరకూ బ్రహ్మచారిగానే ఉండాలి. అలాకాకుండా తన పదవీకాలంలో ఎవరైనా మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా లేక రహస్యంగా పెళ్లి చేసుకున్నా సైనికుడి కి కఠిన శిక్షలు తప్పవు. అంతేగకూండా ఒక్కోసారి దేశ బహిష్కరణ కూడా విధిస్తారు.

Vatican city
Vatican city

మరి పెళ్లి పెటాకులు సంగతి ఏంటని మీకు డౌట్ రావచ్చు. విజయవంతంగా ఈ దేశపు ఆర్మీ విభాగం లో పని చేసి పదవీకాలం ముగిసిన తర్వాత దేశపు ఆర్మీ అధికారులే కానుకగా అందమైన యువతిని చూసి వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. అయితే ఇందులో మనకు నచ్సిన యువతిని పెళ్లి చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ క్రమంలో సైనికుడుని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి ఇష్టంతో కూడా పెద్దగా పనుండదట.

ఇక వాటికన్ సిటీ దేశంలోని ప్రధాన పోప్ (మత గురువు) ని చూడాలంటే ప్రతివారంలోని బుధవారం రోజున 10.30 గంటల సమయంలో సెయింట్ పీటర్ స్కోయర్ అనే చర్చి గుండా వెళుతూ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం వినడానికి ప్రపంచంలోని నలుమూలలనుంచి ప్రజలు వస్తారు. ఇక ఈ దేశంలో దేవుడితో పాటూ దెయ్యాలు కూడా ఉన్నాయని ప్రజలు బాగా నమ్ముతారు. అంతేగాకుండా కొందరు మత గురువులు దెయ్యం పీడితులైన వారిని దెయ్యాల నుంచి విముక్తి కలిగేలా ప్రార్థనలు చేస్తారు. ఇక వాటికన్ సిటీ కరెన్సీ విషయానికొస్తే ఈ దేశపు కరెన్సీ యురోలు. ప్రస్తుతం ఈ దేశపు ఇండియన్ కరెన్సీ కంటే దాదాపుగా 85.231 రూపాయలు ఎక్కువ ఉంది. అంటే మన దేశపు కరెన్సీ లో రూ. 85,231 ఇస్తే వాటికన్ యూరోలలో యూ.1000 వస్తాయన్నమాట..

If you like our article about Vatican city

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleChiranjeevi and Balakrishna movies షూటింగ్ మధ్యలో…?
Next articleKinnera అలాంటి కేసులో చిక్కడం వల్లే కెరియర్ ని పోగొట్టుకుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here