Rita Gaviola : అదృష్టం ఉంటే ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలో ఓడలు బళ్ళు అవడం అలాగే బళ్ళు ఓడలైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే 20వ దశాబ్ద కాలంలో సోషల్ మీడియాలో పాపులర్ కావాలంటే కేవలం కంటెంట్ ఉంటె చాలు ప్రపంచానికి ఇట్టే పరిచయం అయిపోవచ్చు. కాగా ఆమె ఒకప్పుడు బిచ్చగత్తె. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ మోడల్. కానీ ఒకప్పుడు బిచ్చగత్తె ఇప్పుడు మోడల్ ఎలా అయ్యిందని మీకు ఈపాటికే డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ మోడల్ ఎవరు..? అసలు ఆమె కథ ఏంటనే విషయాల గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందా…
ఆమె పేరు Rita Gaviola. కాగా రీటా ఫిలిప్పీన్స్ దేశంలో లుక్బాన్ అనే మురికివాడలో తన కుటుంభ సభ్యులతో కలిసి నివాసముంటోంది. అయితే ఈమె కుటుంబ సభ్యులు పేదవాళ్లు కావడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో రీటా పెద్దగా చదువుకోలేపోయింది. దీంతో తన తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచేందుకు తాను నివాసం ఉంటున్నలుక్భాన్ ప్రాంతంలో బిచ్చం ఎత్తుకునేది. ఇలా వచ్చిన డబ్బుతో తనతో పాటు తన కుటుంబ సభ్యులు పొట్ట నింపుకునే వాళ్ళు. అప్పటికే కటిక దరిద్రం తో కొట్టుమిట్టాడుతున్న రీటాకి ఒకరోజు సడన్ గా ఫోటోగ్రాఫర్ రూపంలో అదృష్టం వరించింది.
అదెలాగంటే క్వింటో బర్గస్ అనే ఫోటోగ్రాఫర్ కి నేచురల్ గా ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టం. దీంతో ఇతడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తిచూపుతూ అప్పుడప్పుడు తన ఫోటోల రూపంలో ప్రజలకు తెలియజేసేవాడు. ఈ క్రమంలో ఓ రోజున ఫోటోగ్రాఫర్ క్వింటో బర్గస్ లుక్బాన్ ఈ ప్రాంతంలో నివాసముండేటువంటి ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్ళాడు. దీంతో సడన్ గా క్వింటో బర్గస్ కెమెరాకు రీటా చిక్కింది. దాంతో క్వింటో బర్గస్ రీటా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ఒక్కసారిగా రీటా లైఫ్ పూర్తిగా మారిపోయింది.
కాగా ప్రస్తుతం రీటా పలు అడ్వర్టైజింగ్ సంస్థలతో కలసి పని చేస్తోంది. అలాగే మోడలింగ్ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది. ఇటీవలే ఈ అమ్మడికి ఫిలిప్పీన్ భాషకి సంబంధించిన చిత్రాలలో అవకాశం వచ్చినట్లు సమాచారం. కాగా ఇటీవలే ఈ అమ్మడు తాను నివాసం ఉంటున్న ప్రాంతంలోని రిచ్ ఏరియాలో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రీటా కి అదృష్టం మాత్రం మామూలుగా పట్టలేదని కొందరు చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం రీటాకి సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది.
దీంతో రీటా అప్పుడప్పుడు పలు వాణిజ్య సంస్థలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అయితే మనం ఎంత సంపాదించినప్పటికీ, ఎలాంటి హోదా లో ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి వచ్చామనే విషయం మాత్రం మర్చిపోకూడదనే విషయాన్ని రీటా బాగానే గుర్తు పెట్టుకుంది. దీంతో తాను సంపాదిస్తున్న మొత్తంలో కొంత శాతాన్ని పేద పిల్లలు మరియు మురికివాడల్లో బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తున్న వారికోసం ఖర్చు చేస్తోంది. దీంతో మోడల్ రీటా చేస్తున్న ఈ పనికి సోషల్ మీడియా మాధ్యమాలలో నెటిజన్లు అభినందిస్తున్నారు.
If you like our article about Rita Gaviola
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites