Bride సరిగ్గా తాళి కట్టే సమయానికి ప్రసవించిన…

500

Bride : సరిగ్గా తాళి కట్టే సమయానికి ప్రసవించిన పెళ్లి కూతురు

Bride : మామూలుగా పెళ్లి చేయడం కోసం వెయ్యి అబద్ధాలు ఆడినా తప్పులేదని పెద్దవాళ్ళు సామెతలు చెబుతుండగా చాలామంది వినే ఉంటారు. అయితే అబద్ధాలు చెబితే అతికే విధంగా ఉండాలి కానీ మొత్తం జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదు. దీంతో వెయ్యి అబద్దాలకు కాన్సెప్ట్ ని కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మరియు చాలా సీరియస్ గా తీసుకుని ఆడరాని అబద్ధాలు ఆడి పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఓ యువతి గర్భవతి అయినప్పటికీ పెళ్లికి సిద్ధమై చివరికి పెళ్లి పందిట్లో పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రసవించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని నవరంగపూర్ గ్రామ పరిసర ప్రాంతంలో మందాని అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. అయితే మందాని అప్పుడప్పుడు ఏకంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో టెంపరరీ పనులకు వెళుతూ ఉండేది. ఈ క్రమంలో చందన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇంకేముంది చాలా సినిమాల్లో చూపించిన మాదిరిగానే మందాని కూడా పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తీరా బయటకెళ్ళి తన ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. ఇది చూసిన ఇరుగుపొరుగువారు ఈ విషయం గురించి మందాని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే మందాని కుటుంబ సభ్యులు మాత్రం అందరి మాదిరిగా కాకుండా కొంత భిన్నంగా ఆలోచించి తమ కూతురు ఇష్టాన్ని గౌరవించారు. దీంతో యువకుడి కుటుంబ సభ్యుల పిలిపించి పెళ్లి నిశ్చయించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

Bride
Bride

అయితే తీరా పెళ్లి పెళ్లి మండపంలో పీటల పై కూర్చుని ఉండగా మందాని కి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి చికిత్స నిమిత్తం వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం వైద్యులు చెప్పిన విషయం విని ఒక్కసారిగా వరుడు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే పెళ్లికి ముందే మందాని తన ప్రియుడితో హద్దులు దాటడం తో గర్భం దాల్చిందని, అలాగే ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే మొదటగా అసలు విషయం తెలియక వరుడు కుటుంబ సభ్యులు కొంతమేర కంగారు పడ్డారు. అంతేకాకుండా నిజం దాచి పెట్టి ఎవరితోనో గర్భందాల్చిన తమ కూతురిని అన్యాయంగా తమ కొడుకుకి కట్టబెట్టాలని చూశారని మందాని తల్లి దండ్రులపై నిందలు మోపారు.

దీంతో వెంటనే మందాని కలిగజేసుకుని పెళ్లికి ముందు తమ కొడుకుతో ఉన్నటువంటి ప్రేమాయణం గురించి మరియు తాను గర్భం దాల్చడానికి కారణం తమ కొడుకేనని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయినప్పటికీ వరుడు తల్లిదండ్రులు మాత్రం శాంతించలేదు. కానీ పలువురు గ్రామ పెద్దలు, బంధువులు కలగజేసుకుని సర్దిచెప్పడంతో ఇరువురి కుటుంబ సభ్యులు శాంతించారు. అనంతరం మళ్లీ మంచి రోజు చూసుకొని ఇరువురికి వివాహం జరిపిస్తామని నిశ్చయించారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

If you like our article about Bride

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleSudhakar అప్పట్లో ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో…
Next articleMarriage with friend’s wife స్నేహితుడు మరణించాడని….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here