Liver : చిన్న చిట్కా తో ఎంత పాడైపోయిన లివర్ అయినా శుభ్రపడుతుంది
Liver : మనిషి శరీరంలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది చేసే పనులు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగా అందాలన్న, విషపదార్థాలు బయటకు వెళ్లాలన్నా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం తింటున్న ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు లివర్ చెడిపోవడానికి కారణం అవుతున్నాయి. ఇప్పటివరకు మద్యపానం ధూమపానం వల్ల లివర్ చెడిపోతుంది అని అందరు నమ్ముతూ వచ్చారు కానీ మనం తినే ఆహార పదార్థాలు సరైనవి కానప్పుడు కూడా చెడిపోతుంది అని వైద్యులు కొన్ని పరిశోధనల ద్వారా తెలియజేశారు.ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కాలేయం దెబ్బ తింటుంది. చక్కెర అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాదు సరికదా అదే మొత్తం లివర్ లో పేరుకుపోయి కాలేయాన్ని దెబ్బతీస్తుంది. దీనితో కొంతకాలానికి లివర్ పనితీరు మందగించి అది చెడిపోతుంది. నేటి రోజులలో ఆహార పదార్థాల్ని రుచిగా అందించడం కోసం వాటిలో మోనో సోడియం అనే రసాయన పదార్థాన్ని కలుపుతున్నారు. దీనితో ఈ పదార్థం ఉన్న ఆహార పదార్ధాలు మనం తిన్నప్పుడు ఇది మన శరీరంలోకి ఎక్కువగా చేరుతుంది అప్పుడు దీని ప్రభావం మన శరీరం లోని లివర్ పైన ఎక్కువగా పడుతుంది. దాని వలన లివర్ చెడిపోతుంది. విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు ఉండవు అని అందరికీ తెలిసిందే.అయితే ఏ విటమిన్ శరీరంలో మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లయితే దాని ప్రభావం లివర్ పై పడుతుందట. దానితో లివర్ ఆరోగ్యం నాశనమవుతుంది. కూల్ డ్రింక్స ని ఎక్కువగా తాగడం వల్ల కూడా లివర్ చెడిపోతుంది. కూల్డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పనిచేయకుండా చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాలు శాతం అధికంగా పెరుగుతుంది. దానితో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది అనే విషయం తెలిసినదే. Chips ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే విషపూరిత పదార్థాలు లివర్ పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండటం మంచిది.
If you like our article about Liver
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites