Pellikuturu టాయిలెట్ కి వెళ్ళొస్తానని అటే జంప్

154

Pellikuturu టాయిలెట్ కి వెళ్ళొస్తానని అటే జంప్..

Pellikuturu : మామూలుగా ప్రేమ ఎప్పుడూ ఎవరి ఈ మధ్యన ఎలా పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ క్రమంలో కొన్ని ప్రేమలో 5 నిమిషాలు పడక సుఖంతో ఎండ్ అయిపోతే మరికొన్ని మాత్రం కట్టే కాలేంతవరకూ తోడుగా నిలబడుతున్నాయి. ఇంకొందరు మాత్రం తమ కుటుంబ సభ్యులకోసం మనసు చంపుకొని పెళ్లి పీటలమీద కూర్చున్నప్పటికీ అది తప్పు అని తెలుసుకుని పెళ్లయిన తర్వాత కూడా తమ ప్రియుడి కోసం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే తాజాగా ఓ యువతి తన మనసులో ఇంకో వ్యక్తి ఉన్నప్పటికీ పెళ్ళి పీటల మీద కూర్చుని తన తల్లిదండ్రుల కోసం ఇష్టం లేని వ్యక్తి తో తాళి కట్టించుకుంది. కానీ చివరికి ఆమె మనసు ఒప్పుకోకపోవడంతో కట్టుకున్నవాడి కళ్లుగప్పి చాకచక్యంగా తప్పించుకున్న ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కంకేర్ జిల్లా పరిసర ప్రాంతంలో ఆర్తి సహారే అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. కాగా ఆర్తి కుటుంబ సభ్యులు కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా దొరికే వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. అయితే ఇటీవలే ఆర్తి కి తెలిసిన వారి ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరింది. కానీ ఆర్తి మాత్రం అప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో ప్రేమలో పడింది. దీంతో అప్పుడప్పుడు ఆర్తి కాలేజీకి వెళుతున్నానని చెప్పి తన ప్రియుడితో కలిసి బయటికి వెళ్ళేది. ఈ విషయం తెలుసుకున్న ఆర్తి తల్లిదండ్రులు తమ కూతురు చేజారిపోతుందని భావించి వెంటనే వివాహం నిశ్చయించడం మరియు ఘనంగా నిర్వహించడం రెండు చేసేశారు.

Pellikuturu escape case
Pellikuturu escape case

ఈ క్రమంలో ఆర్తి తల్లిదండ్రులు తమ పరువు ప్రతిష్టల గురించి మాత్రమే ఆలోచించారు తప్ప తమ కూతురు మనసులో ఎవరున్నారనే విషయాలను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆర్తి కూడా తన తల్లిదండ్రుల కోసం మనసు చంపుకొని పెళ్లి పీటల మీద కూర్చుని వరుడితో తాళి కట్టించుకుంది. కానీ కట్టుకున్న వాడితో కనీసం ఒక్క రోజు కూడా మనసు చంపుకొని కాపురం చేయలేకపోయింది.

దీంతో ఎలాగైనా తన ప్రియుడితో కలిసి పారిపోవాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా పెళ్లి తంతు పూర్తవ్వగానే వరుడు ఇంటికి బయలుదేరిన సమయంలో తనకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందని చెప్పి మధ్యలో కారు ఆపి బాత్రూం కి వెళ్ళింది. ఇంకేముంది ఈ పాటికి మీకు విషయం అర్థం అయి ఉంటుంది. అటు నుంచి అటే తన ప్రియుడిని పిలిపించుకొని డబ్బు నగలు బంగారంతో పరార్ అయింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు బంధువులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఆర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు నమోదు చేశారు.

దీంతో పోలీసులు విచారణ చేపట్టగా ఆర్తి సహారే తన ప్రియుడితో కలిసి పారిపోతుండగా పట్టుకున్నారు. అయినప్పటికీ ఆర్తి మాత్రం తనకు తన ప్రియుడితోనే బ్రతకాలని ఉందని చెప్పడంతో పోలీసులు ఈ విషయాన్ని మరింత క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేగాకుండా ఈ సంఘటనలో తల్లిదండ్రుల పొరపాటుతోపాటూ ఆర్తి పొరపాటు కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

If you like our article about Pellikuturu

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleRachana Benerjee తెరమరుగవడానికి కారణాలు అవేనా…?
Next articleAchyuth అంతటి ధీన పరిస్థితుల్లో మరణించాడా….?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here