ఈ హీరోయిన్ కి అప్పట్లోనే సొంత విమానం ఉండేదట.. కానీ ఇప్పుడు మాత్రం….

1141
senior-actress-k-r-vijaya-own-airplane-story
senior-actress-k-r-vijaya-own-airplane-story

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ ద్వీపం అనే చిత్రం సినీ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ తెలుగు హీరోయిన్ రోజా నటించగా కైకాల సత్యనారాయణ, బాబు మోహన్, రంభ కె.ఆర్.విజయ, సీనియర్ నటుడు విజయ్ కుమార్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కె.ఆర్.విజయ తన పాత్రకి వంద శాతం న్యాయం చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నటి కె.ఆర్.విజయ గురించి మరిన్ని విశేషాల గురించి తెలుసుకుందాం…

కాగా నటి కె.ఆర్.విజయ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది. అయితే నటి కె.ఆర్.విజయ తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. ఇక ఆమె తల్లి విషయానికి వస్తే ఈమె ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టేది. కాగా నటి కె.ఆర్.విజయ కి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. దాంతో అప్పుడప్పుడు పలు నాటకాలలో మరియు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే పలు కల్చరల్ ఈవెంట్స్ లో చాలా చురుకుగా పాల్గొనేది. దీంతో నటి కె.ఆర్.విజయ కి నటనపై ఉన్నటువంటి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రోత్సహించారు. ఈ క్రమంలో స్పెషల్ గా నటనలో శిక్షణ కూడా ఇప్పించారు.

దీంతో నటి కె.ఆర్.విజయ కేవలం నటనలో మాత్రమే కాకుండా భరత నాట్యం, కూచిపూడి వంటి వాటిలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. కాగా నటి కె.ఆర్.విజయ చదువు పూర్తి కాగానే 1966వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన శ్రీ కృష్ణ పాండవీయం అనే చిత్రం ద్వారా సినీ కెరియర్ ని ఆరంభించింది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వడంతో కె.ఆర్.విజయ కి హీరోయిన్ గా ఆఫర్లు బాగానే వరించాయి. దీంతో తమిళం, మలయాళం, తెలుగు తదితర భాషలలో తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది.

ఐతే సినిమా పరిశ్రమలో ఆరు సంవత్సరాలు తన ప్రస్థానాన్ని కొనసాగించిన తర్వాత తమిళం తెలుగు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన టువంటి సుదర్శన్ వెలయితున్ అనే ఓ ప్రముఖ సినీ నిర్మాత మరియు వ్యాపారవేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే అప్పటికే సుదర్శన్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. కానీ నటి కె.ఆర్.విజయ హీరోయిన్ గా నటిస్తున్న ఓ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సమయంలో ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి పెళ్లి మాత్రం దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు చాలా గోప్యంగా ఉంచారు.

Vijaya
Vijaya

కానీ అప్పటికే సుదర్శన్ ధనవంతుడు కావడంతో సొంతంగా విమానం కూడా ఉండేది. దీంతో నటి కె.ఆర్.విజయ ప్రసవం తర్వాత తన బిడ్డను తీసుకుని ఎయిర్ పోర్టులో విమానం దిగుతుండగా పత్రికా విలేకరుల కంట పడింది. అలా నటి కె.ఆర్.విజయ తల్లి గురించి బాహ్య ప్రపంచానికి తెలిపింది. అయితే ఆ మధ్య ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కె.ఆర్.విజయ తన పెళ్ళి విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయం గురించి స్పందించింది. ఇందులో భాగంగా తన వ్యక్తిగత కారణాల వల్లే తమ పెళ్లి ని కొంతకాలంపాటు గోప్యంగా ఉంచామని అలాగే తన పెళ్లి జరిగినప్పుడు తాను కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలతో రాణిస్తున్నానని దాంతో తన సినీ కెరీర్ కి భంగం కలగకూడదని తన భర్త పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచామని తెలిపింది.

కానీ ఎయిర్ పోర్టులో తాను తన బిడ్డను తీసుకుని విమానం నుంచి దిగుతుండగా కొందరు పత్రికా విలేకరులు చూసి ఫొటోలు తీసి ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేశారని చెప్పుకొచ్చింది. అయితే తన భర్త ఒకప్పుడు చాలా విలాసవంతమైన జీవితం గడిపినప్పటికీ క్రమక్రమంగా వ్యాపారంలో నష్టం రావడం మరియు తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాలతో కరిగిపోయే తెలిసిందే.

Previous articleChiranjeevi ఆ హీరో ని అప్పుల నుంచి కాపాడటానికి అలా చేశాడట…
Next articleVijayashanti అందుకే పిల్లల్ని కనలేదా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here