Premikula roju : ఈ హీరో డెత్ ఇప్పటికీ మిస్టరీనే… ప్రేమ వ్యవహారమే కారణమా…?

143

Premikula roju : చలనచిత్ర పరిశ్రమకి వచ్చీరావడంతోనే మంచి హిట్ కొట్టడంతో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న నటినటులు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలిన నటీనటులు కూడా లేకపోలేదు. అయితే 1999వ సంవత్సరంలో ప్రముఖ తమిళ దర్శకుడు కథిర్ దర్శకత్వం వహించిన “ప్రేమికుల రోజు” అనే చిత్రం ద్వారా సౌతిండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు కునాల్ కుమార్ సింగ్ కూడా ఈ కోవకే చెందుతాడు.

కాగా ప్రేమికుల రోజు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవడంతో కునాల్ కుమార్ సింగ్ కి వచ్చీరావడంతోనే లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది. అంతేకాక ఈ చిత్రం ఏకంగా హిందీ, తమిళం, తదితర భాషల్లోకి కూడా రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలోని పాటలు గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ అప్పట్లో సంచలనం సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ప్రేమికుల రోజు చిత్రంలో నటించిన తర్వాత నటుడు కునాల్ కుమార్ సింగ్ కి కొంతకాలం పాటు సినిమా ఆఫర్లు బాగానే వరించాయి. కానీ నటుడు కునాల్ కుమార్ సింగ్ తన చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయాడు. అయితే నటుడు కునాల్ కుమార్ సింగ్ ప్రేమికుల రోజు చిత్రంలో నటించిన తర్వాత దాదాపుగా పదికి పైగా చిత్రాలలో నటించాడు. కానీ దురదృష్టవశాత్తు కునాల్ కుమార్ సింగ్ సినీ కెరియర్ లో ప్రేమికులరోజు చిత్రం తప్ప మరే ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో నటుడు కునాల్ కుమార్ సింగ్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు. దీనికితోడు ఇటు కుటుంబ సభ్యుల నుంచి మరియు తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్నటువంటి పలు ప్రేమాయణాల వైఫల్యం కారణంగా సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా దృష్టి సారించ లేకపోయాడు. దీంతో 2008వ సంవత్సరంలో ఫిబ్రవరి 7వ తారీఖున ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పట్లో కునాల్ కుమార్ సింగ్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడిది ఆత్మహత్య కాదని అలాగే తమ కుమారుడి మరణం పట్ల అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కునాల్ కుమార్ సింగ్ ప్రియురాలైన ఒకప్పటి బాలీవుడ్ నటి లావిన భాటియా పై పలు అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు అరెస్టు చేసి విచారించారు. కానీ కునాల్ కుమార్ సింగ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని నిరూపణ కావడంతో లావిన భాటియాని విడుదల చేశారు. అయితే కునాల్ కుమార్ సింగ్ కి పలు మానసిక పరమైన సమస్యలు ఉన్నాయని అంతేకాకుండా వృత్తి పరంగా కూడా సమస్యలు తలెత్తడంతో ఓ బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టు కు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అలాగే కునాల్ కుమార్ సింగ్ కి కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉందని దాంతో అతడిని హత్య చేసేందుకు ఆస్కారం లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు అసలు కునాల్ కుమార్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలపై మాత్రం సరైన క్లారిటీ లేదు.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు కునాల్ కుమార్ సింగ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కు పైగా చిత్రాలలో నటించాడు. కానీ ఇందులో ప్రేమికుల రోజు చిత్రం తప్ప మిగిలిన అన్ని చిత్రాలేవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

Previous articleKhaidi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం వెనుక ఇంత జరిగిందా..?
Next articleBaba : కూతురుకి పెళ్లి కావడం లేదని బాబా దగ్గరికి తీసుకెళ్లిన తల్లి… చివరికి ఏమైందంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here