Kalyan chakravarthy : అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకి దూరమయ్యాడా…?

148

Kalyan chakravarthy : తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి మొదటిగా చెప్పాలంటే ముందుగా కొన్ని వందల కుపైగా చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారకరామారావు గురించి చెప్పాలి. అయితే నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపుగా 7 మందికి పైగా హీరోలు సినిమా ఇండస్ట్రీ కి వచ్చారు. ఇందులో నందమూరి హరికృష్ణ ఆ మధ్య ఓ రోడ్డు ప్రమాదంలో మరణించగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు. అయితే నందమూరి తారకరత్న ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు.

దీంతో సినీ కెరీర్ పరంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకులని బాగానే అలరించిన మరో ప్రముఖ సీనియర్ నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కూడా సినీ ప్రేక్షకులకి బాగా నే గుర్తుంటాడు. అప్పట్లో వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ బాగానే రాణించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లుండి ఎందుకు సినిమా పరిశ్రమకి దూరం అయ్యాడనే విషయాలు ఇప్పటికీ చాలామందికి తెలియవు.

అయితే మొదట్లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి 1986వ సంవత్సరంలో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అత్తగారు స్వాగతం అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించాడు. కాగా నటుడు కళ్యాణ్ చక్రవర్తి నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు సోదరుడైన ప్రముఖ స్వర్గీయ సినీ నిర్మాత త్రివిక్రమ రావు తనయుడు కావడంతో సినిమా ఇండస్ట్రీ ప్రవేశం కొంతమేర సులభంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే అప్పటికే సినీ నిర్మాత త్రివిక్రమరావు పలు టాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో తన అన్న సలహా మేరకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ను కూడా హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

దీంతో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా నటించిన తలంబ్రాలు, మామా కోడళ్ళ సవాల్, రౌడీ బాబాయ్, ఇంటి దొంగ, మారణ హోమం, ప్రేమ కిరీటం, జీవన గంగ తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే అలరించాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు చిత్రంలో కూడా హీరో బావమరిది పాత్రలో నటించి కళ్యాణ్ చక్రవర్తి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఒకానొక సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కి పోటీగా కళ్యాణ్ చక్రవర్తి దిగాడని అప్పట్లో పలు వార్తలు కూడా వినిపించాయి.

అయితే కెరియర్ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమ రావు అనారోగ్యం పాలయ్యాడు. దీంతో తన తండ్రి ఆరోగ్య బాధ్యతలను తీసుకున్న కళ్యాణ్ చక్రవర్తి చివరి రోజులలో కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఈ క్రమంలో తన సినీ కెరీర్ పై పెద్దగా దృష్టి సాధించలేకపోయాడు. దీనికితోడు సరిగ్గా అదే సమయంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. కానీ కళ్యాణ్ చక్రవర్తి మాత్రం తన తండ్రిని వదిలి పెట్టి రాలేక మద్రాసులోనే సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు కూడా సన్నగిల్లాయి. అలాగే తన కొడుకు పృథ్వి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

దాంతో కళ్యాణ్ చక్రవర్తి నటనకి స్వస్తి పలికి తన తండ్రి బాధ్యతలను చూసుకునే పనిలో పడి సినీ కెరీర్ ను కూడా పోగొట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నై పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆ మధ్య కళ్యాణ్ చక్రవర్తి తనయుడు హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని పలు వార్తలు వినిపించినప్పటికీ కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

Previous articleMagadheera : దర్శకుడు రాజమౌళి తండ్రితో అనుకుని కొడుకుతో తీసిన సినిమా ఏదో తెలుసా..?
Next articleMahesh babu : మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చాలా పెద్దదే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here