6ఏళ్ళ క్రితం మొక్క ఇపుడు మహావృక్షం, చిన్న ఛానల్ గా ఉన్నప్పటి నుంచి నేను సుమన్ ను చూస్తున్నాను-చిరంజీవి

111
suman tv
suman tv

సుమన్ టీవీ…ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు తెలుగు ఛానల్స్ అంటే ఏ ఈటీవీయో, మాటీవీయో, జెమినీ టీవీయో అనేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో టీవీనైన్, ఎన్టీవీ సహా పేరున్న శాటిలైట్ ఛానళ్లకు ధీటుగా ఎదిగింది సుమన్ టీవీ. కేవలం ఆరేళ్ల క్రితం సుమన్ టీవీ ఎండీ డీ. సుమన్ ప్రారంభించిన ఈ టీవీ చిన్న మొక్క. నేడు మహా వ్రుక్షమై తెలుగు వారి ఫోన్ లలో, టీవీలలో, కంప్యూటర్లలో ప్రతి చోట సుమన్ టీవీ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సుమన్ టీవీ తెలియని ప్రేక్షకుడు తెలుగునాట లేడంటే అతిశయోక్తి కాదు. ఐదుకోట్లకు పైగా సబ్ స్క్రైబర్స్ తో ప్రతి రోజు కోట్లాది వ్యూస్ తో ఏపీ, తెలంగాణలోనే కాదు నాన్ మ్యూజిక్, నాన్ మూవీ ఛానల్స్ దక్షణాదిలో నెంబర్ వన్ గా నిలిచింది సుమన్ టీవీ. దీనికంతటికి కారణం సుమన్ కార్యదీక్ష. తన ఉద్యోగులను ఆయన చూసే తీరే విజయానికి కారణమంటారు దగ్గరి వ్యక్తులు.

సుమన్ టీవీ నెట్ వర్క్ కింద దాదాపు 150 ఛానల్స్ ఉన్నాయి. ఎంటర్టెయిన్మెంట్ నుంచి ప్రపంచంలో జరిగే వార్తలు, వింతలు , విశేషాల వరకు శాటిలైట్స్ ఛానల్స్ కంటే ముందుగానే ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తోంది సుమన్ టీవీ. ఇంటర్వ్యూలలో కొత్త ఒరవడి స్రుష్టించిన సుమన్ టీవీ నేడు డిజిటల్ యుగంలో ఎంతో మంది కొత్త క్రీయేటర్స్ కి స్పూర్తిగా నిలిచింది. ఆరోగ్యం, విద్య, వైద్యం, న్యాయం, ఆయుర్వేదం సహా హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ తో ఎన్నో విశేషాలను ప్రతి రోజు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తోంది సుమన్ టీవీ. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ ఘటన జరిగినా సరే విశ్లేషనాత్మక, విశ్వసనీయమైన వార్తలను ప్రజలకు అందిస్తూ ప్రేక్షకుల నమ్మకాన్ని చూరగొన్నది సుమన్ టీవీ.

ఇప్పుడు మరో ముందడుగు వేసి 24 గంటల డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రసారంలోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సహా అతిరథ మహారథుల చేతుల మీదుగా సుమన్ టీవీ ట్వంటీఫోర్ సెవన్ డిజిటల్ ఛానల్ ప్రారంభమైంది. ఇక నుంచి శాటిలైట్ ఛానల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా సుమన్ టీవీ కొత్త కొత్త సంచలనాలతో ప్రేక్షకులను నిత్యం వార్తలను, విశేషాలను అందించనుంది. మెగాస్టార్ చిరంజీవి స్వహాస్తాలతో ఈ డిజిటల్ టీవీని ప్రారంభించారు. చిరంజీవితో పాటు మాజీ ఎంపీ, నటుడు మురళిమోహన్, నటులు రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, ఉత్తేజ్, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సుమన్ టీవీ డిజిటల్ ఛానల్ ప్రారంబోథ్సవానికి హాజరయ్యారు.

suman tv
suman tv

డిజిటల్ చానల్ ప్రారంభం చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సుమన్ టీవీ సమాజంలో ఏ ఒక్కరి పక్షమో కాకుండా ప్రజా పక్షం వహిస్తు వార్తలను అందిస్తుందని చెప్పారు. సుమన్ టీవీ డిజిటల్ న్యూస్ కూడా ఆ పంథాలోనే వెళ్తుందని చిరంజీవి అభిలాషించారు. చిన్న ఛానల్ గా ఉన్నప్పటి నుంచి తాను సుమన్ ను చూస్తున్నాను. ఎంతో కష్టపడి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్తాపించారు. కష్టపడి పైకొచ్చిన సుమన్ మరోన్నో విజయాలను అందుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్ సుమన్ టీవీ ప్రారంబోత్సవంలో పాల్గొని ఛానల్ ప్రజా పక్షం ఉంటామని చెప్పే స్లోగన్ చాలా భాగుంది. భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారాయన.

సుమన్ టీవీ డిజిటల్ యుగంలో ఒక విప్లవం. ఇప్పుడు ఇరవై నాలుగు గంటల డిజిటల్ ప్రసారాలను ప్రారంభించడంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఉత్తేజ్, శ్రీకాంత్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సుమన్ టీవీ భవిష్యత్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సెన్సేషన్ క్రీయేట్ చేస్తుందని చెప్పారు.

ఒక చిన్న ఛానల్ గా ప్రారంభమై నేడు ప్రజా వార్తా విప్లవాలను స్రుష్టించేందుకు సుమన్ టీవీ ముందుకు సాగుతోంది. నేటి వరకు ఆయా వార్తలు, విశేషాలను సందర్బానుసారమే ప్రేక్షకులు చూశారు. ఇక నుంచి నిత్యం వార్తల ప్రవాహమే. ప్రతి వార్తను ఖచ్చితమైన సమాచరంతో , ఎలాంటి పక్షపాతం లేకుండా తెలుగు నాట సాంకేతిక వార్త విప్లవానికి నాంది పలికింది సుమన్ టీవీ. ఇక డిజిటల్ ట్వంటీఫోర్ సెవన్ తో ప్రతి తెలుగు హ్రుదయాన్ని తాకనుందీ ఛానల్.

Previous articleరష్యన్ సైనికులను హతమార్చేందుకు తెలివిగా బాంబులను తయారచేసున్న ఉక్రైన్ ప్రజలు
Next articleBride cheating : ఇంటికొచ్చిన రోజే అలా చేసిన కొత్త కోడలు… దెబ్బకి అందరూ ఆసుపత్రిలో చేరారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here