Khadgam : ఖడ్గం సినిమా విషయంలో అంత జరిగిందా… కొందరు ఏకంగా బెదిరించడంతో…

136

Khadgam : తెలుగులో 2002వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ మరియు సీనియర్ నటుడు శ్రీకాంత్ తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కిన ఖడ్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయిన సంగతి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా టాలీవుడ్ మాస్ హీరో రవితేజ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఓ యువకుడి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే ఈ చిత్రంలో విభిన్న మతాలు కలిగినటువంటి భారతదేశంలో ప్రజలు ఎలా ఐకమత్యంగా ఉంటారనే విషయాన్ని దర్శకుడు కృష్ణ వంశీ చాలా బాగా చూపించారు. దీంతో ఇప్పటికీ ఈ చిత్రం టెలివిజన్ ఛానళ్లలో ప్రసారం అయినప్పుడు మంచి టిఆర్పి రేటింగులు నమోదు చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక ఈ చిత్రంలోని పాటలకి కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. అయితే తాజాగా నటుడు శ్రీకాంత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఖడ్గం చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా ఖడ్గం చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కృష్ణ వంశీ తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తెలుసని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను మొదటగా నటించిన వన్ బై టూ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు షూటింగ్ లొకేషన్ కి కృష్ణ వంశీ వచ్చే వాడని ఆ సమయంలో తనకి స్నేహితుడయ్యాడని తెలిపాడు. దాంతో కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చంద్రలేఖ చిత్రంలో చిన్నపాటి గెస్ట్ అప్పియరెన్స్ పాత్ర ఉందని చెప్పాడని తాను కూడా ఏమీ ఆలోచించకుండా చంద్రలేఖ చిత్రంలో నటించానని తెలిపాడు. అలా మొదలైన తమ మధ్య స్నేహం ఖడ్గం చిత్రంలో నటించే సమయానికి మంచి సన్నిహితులుగా మారిపోయానని తెలిపాడు.

అయితే ఖడ్గం చిత్రంలో నటించిన తర్వాత తనకు మరియు దర్శకుడు కృష్ణ వంశీకి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యాయని తెలిపాడు. ఇందులో ముఖ్యంగా ఖడ్గం చిత్రం చూసిన తర్వాత కొందరు వ్యక్తులకి నచ్చకపోవడంతో ఏకంగా తనను మరియు దర్శకుడు కృష్ణ వంశీ ని హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని దాంతో తాను బయటికి వెళ్ళిన సమయంలో తుపాకీని తన వెంట తీసుకుపోయేవాడినినని తెలిపాడు. దర్శకుడు కృష్ణ వంశీ మాత్రం కొంతకాలం పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయాడని ఆ తర్వాత సమస్యలు సర్దమనగడంతో మళ్ళీ యధావిధిగా ఎవరి పనులకి వాళ్ళు వెళ్లి పోయేవాళ్ళమని చెప్పుకొచ్చాడు.

అయితే తనకు ఖడ్గం చిత్రంలో నటించిన తర్వాత ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ తన సినీ కెరీర్ కి మాత్రం ఖడ్గం చిత్రం చాలా ఉపయోగపడిందని అంతేకాకుండా ఈ చిత్రంలో నటించినందుకు తనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలిపాడు. అలాగే అప్పటివరకూ తాను ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో మాత్రమే నటించానని కానీ ఖడ్గం చిత్రంలో కొంతమేర సీరియస్ నెస్ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా…? అనే సందేహం తనలో ఉండేదని కానీ దర్శకుడు కృష్ణవంశీ మాత్రం తన సందేహాలను పటాపంచలు చేస్తూ తన టేకింగ్ తో ఖడ్గం చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో తనతో పాటు నటించినటువంటి తోటి నటీనటులకు మరియు దర్శకుడు కృష్ణవంశీకి సినీ రంగంలో ప్రధానం చేసేటువంటి పలు అవార్డులను కూడా వరించాయని తెలిపాడు.

ఇక తన వైవాహిక జీవితం గురించి స్పందిస్తూ తాను ఆమె చిత్రంలో తన భార్య ఊహ తో కలిసి నటిస్తుండగా ప్రేమలో పడ్డానని దాంతో నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించానని తెలిపాడు. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఉన్నటువంటి తనకు అత్యంత సన్నిహిత గురించి చెబుతూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పెద్ద మరియు అందరికీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తనకు అత్యంత సన్నిహితులని తెలిపాడు. అలాగే తను వరుస ఫ్లాపులతో బాధపడుతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోదామనుకున్నానని కానీ ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనను పిలిచి ఎంతగానో ధైర్యం చెప్పారని తెలిపాడు. ఒక రకంగా చెప్పాలంటే తాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణం మెగాస్టార్ చిరంజీవి అని అలాగే చిన్నప్పటి నుంచి తను చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని దాంతో మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్గా తీసుకొని నటుడు కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపాడు.

Previous articleSrihari : నటుడు శ్రీహరి ఆ కారణాల వల్లే మరణించాడా…?
Next articleBommarillu : బొమ్మరిల్లు చిత్రంలో నటించే అవకాశం మిస్ చేసుకున్న తెలుగు హీరో… చివరికి అవకాశాల్లేక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here