Bommarillu : బొమ్మరిల్లు చిత్రంలో నటించే అవకాశం మిస్ చేసుకున్న తెలుగు హీరో… చివరికి అవకాశాల్లేక…

171

Bommarillu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2006వ సంవత్సరంలో ప్రముఖ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన బొమ్మరిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ కి జంటగా టాలీవుడ్ బ్యూటీఫుల్ వెటరన్ హీరోయిన్ జెనీలియా నటించింది. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, చలపతి రావు, నటి జయసుధ, తనికెళ్ల భరణి, పీకి సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాడు. అయితే నాన్న సెంటిమెంట్ మరియు ప్రేమ కథా ఓరియెంటెడ్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే అలరించింది.

అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ సభ్యులు 6 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించగా దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి రికార్డులను సృష్టించింది. అలాగే వచ్చీరావడంతోనే బొమ్మరిల్లు చిత్రంతో మంచి విజయం అందుకున్న దర్శకుడు భాస్కర్ ఈ చిత్ర పేరుని తన పేరు ముందుగా జత పరచుకొని బొమ్మరిల్లు భాస్కర్ గా తన పేరుని స్క్రీన్ నేమ్ మార్చుకున్నాడు. ఇక హీరో సిద్ధార్థ్ కి కూడా సినీ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోవడంతోపాటు పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.

అయితే అప్పట్లో పలు ప్రేమకథ తరహా చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ హీరో నవదీప్ కి మొదటగా బొమ్మరిల్లు చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చిందట. దీంతో సినీ నిర్మాత దిల్ రాజు మాత్రం నవదీప్ ని బొమ్మరిల్లు చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాడట. కానీ హీరో నవదీప్ అప్పటికే మరో తెలుగు ప్రముఖ దర్శకుడైన తేజ దర్శకత్వం వహించిన జై అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమవడంతో పాటు గౌతమ్ ఎస్.ఎస్.సి, మొదటి సినిమా, ప్రేమంటే ఇంతే తదితర చిత్రాలకి కమిట్ అయ్యాడు. దీంతో బొమ్మరిల్లు చిత్రంలో నటించడానికి డేట్లు కుదరకపోవడంతో బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడట.

దీంతో దర్శకుడు భాస్కర్ కథ కి సూటయ్యేటువంటి మరో హీరోని వెతుకుతుండగా హీరో సిద్ధార్థ్ పేరు పరిశీలనలోకి వచ్చింది. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా వెంటనే ఓకే చేయడంతో అనుకున్నదే తడవుగా బొమ్మరిల్లు చిత్రాన్ని పట్టాలెక్కించి పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత బొమ్మరిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం, ఈ చిత్రంలోని నటీనటులతోపాటు దర్శకనిర్మాతలైన భాస్కర్ మరియు సినీ నిర్మాత దిల్ రాజు కి అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి మంచి పేరు రావడం వంటివి చకచకా జరిగిపోయాయి.

అయితే బొమ్మరిల్లు చిత్రంలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్న తర్వాత నవదీప్ మాత్రం ఆశించిన స్థాయిలో తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. దీంతో హీరో నవదీప్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటించిన గౌతమ్ ఎస్.ఎస్.సి, మనసు మాట వినదు, జై, మొదటి సినిమా తదితర చిత్రాలు తప్ప చెప్పుకోవడానికి పెద్దగా హిట్లు కూడా లేవు. కాగా ప్రస్తుతం నటుడు నవదీప్ కేవలం హీరో పాత్రలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటిస్తూ కెరియర్ ని నెట్టుకొస్తున్నాడు. ఒకవేళ నటుడు నవదీప్ 2006వ సంవత్సరంలో బొమ్మరిల్లు చిత్రంలోగనుక హీరోగా నటించి ఉంటే కచ్చితంగా ప్రస్తుతం నవదీప్ సినీ కెరియర్ మరోలా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Previous articleKhadgam : ఖడ్గం సినిమా విషయంలో అంత జరిగిందా… కొందరు ఏకంగా బెదిరించడంతో…
Next articleGentleman : కథ చెబుదామని ఇంటికి వెళితే డైరెక్టర్ ని తిట్టిన హీరో… చివరికి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here