Chiranjeevi కోసం పవన్ కళ్యాణ్ అతడిని షూటింగ్ స్పాట్ లోనే కొట్టాడట…. హాస్పిటల్ కి వెళ్లి….

1741

Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే ఇబ్బందులు పడినప్పటికీ క్రమక్రమంగా వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొని ఇవాళ తిరుగులేని స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి కేవలం తన స్వప్రయోజనమే చూసుకోకుండా తన తమ్ముళ్ళైన మెగా బ్రదర్ నాగబాబు మరియు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఎంతగానో ప్రోత్సహించాడు. దీంతో వీరి ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ చాలా ముచ్చటగా ఉంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఆ మధ్య మెగా బ్రదర్ నాగబాబు ఓ సినిమా తీసి ఉన్న ఆస్తులను పోగొట్టుకోవడంతో ఆర్థికంగా కూడా సహాయం చేసి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టారు. దీంతో ప్రస్తుతం నాగబాబు వరుస సినిమాలు మరియు పలు రకాల షోలు ఈవెంట్లు వంటివి చేస్తూ బాగానే రాణిస్తున్నాడు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఓ రౌడీతో జరిగిన గొడవ గురించి ప్రస్తుతం ఓ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. కాగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సీనియర్ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న సమయంలో ఈ గొడవ జరిగిందట.

పూర్తి వివరాల్లోకి వెళితే సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న కొత్తలో మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసం ఉండేవాడు. దీంతో అప్పుడప్పుడు కొందరు దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతంలో జరిపేవారు. ఈ క్రమంలో దర్శకుడు కోడి రామకృష్ణ కూడా చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కోడంబాకం ఏరియాలో సినిమా షూటింగ్ చేశారు.

దీంతో ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ని మరియు చిత్ర యూనిట్ సభ్యులని కొందరు లోకల్ గూండాలు వచ్చి ఆట పట్టించడం మరియు అసభ్యకరంగా కామెంట్లు చేయడం వంటివి చేశారట. దాంతో మెగాస్టార్ పెద్దగా పట్టించుకోక పోయినప్పటికీ చిరంజీవి కారు డ్రైవర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరోసారి ఇలా చేయొద్దని అలాగే షూటింగ్ స్పాట్ నుంచి వెంటనే వెళ్లి పోవాలని వార్నింగ్ ఇచ్చాడట. అయినప్పటికీ ఆ గుండాలు మాత్రం మాట వినకపోవడంతో పవన్ కళ్యాణ్ గొడవపడి బాగానే బుద్ధి చెప్పాడట. ఈ క్రమంలో ఈ గుండాల గ్యాంగ్ లీడర్ అయినటువంటి కుప్పస్వామి అనే వ్యక్తి కి గాయాలు తగలడంతో హాస్పిటల్ పాలయ్యాయడట.

దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి కుప్పస్వామిని పరామర్శించి ఇలా చేసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మందలించాడట. అలాగే మరోసారి ఇలాంటి గొడవలకి దూరంగా ఉండమని మాట కూడా తీసుకున్నాడట. దాంతో పవన్ కళ్యాణ్ కూడా హాస్పిటల్ కి వెళ్లి కుప్పస్వామిని పరామర్శించి సారీ చెప్పడంతోపాటు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తమై ఆర్థిక సాయం కూడా చేశాడట.

అయితే చిన్నప్పటినుంచి దూకుడుగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అసలు సహించలేడు. అంతేకాకుండా తన అనుకున్న వాళ్లు ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే కూడా చూస్తూ ఊరుకోలేడు. వెంటనే స్పందిస్తూ తనకు తగినంత సహాయం చేయడానికి అనుమతి లేకుండా ముందుకు వెళ్లి పోతుంటాడు.

Previous articleరష్యా వేసిన బాంబు ఇండియాలో ఉన్న మన ఇంటి మీద ఎలా పడుతుందో తెలుసా ?
Next articlezoya lobo : ఒకప్పుడు ఈ ట్రాన్స్ జెండర్ రైళ్లలో బిచ్చమెత్తునేది.. కానీ ప్రస్తుతం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here