Jayalalitha : వాళ్ళు నటి జయలలిత ని అలా మోసం చేసారట… దాంతో ఎక్కడికెళ్లినా…!

489

Jayalalitha : ఒక్కోసారి కొంత మంది నటీనటులు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమ సినీ కెరీర్ కోసం నటించిన పాత్రలే తమ సినీ జీవితానికి శాపంగా మారినటువంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే ఇందులో కొంతమందికి మంచి నటనా ప్రతిభ ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాక గుర్తింపుకు నోచుకోలేకపోయిన వాళ్లు కూడా లేకపోలేదు. కానీ మరికొందరు మాత్రం తమ ఆర్థిక పరిస్థితుల రీత్యా, తమ కుటుంబ పరిస్థితుల రీత్యా స్పెషల్ సాంగ్స్ మరియు బోల్డ్ సన్నివేశాలు వంటి వాటిలో నటించగా సినీ కెరీర్ నాశనం అయిన వాళ్లు కూడా ఉన్నారు.

కాగా ప్రస్తుతం పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీనియర్ నటి జయలలిత కూడా ఈ కోవకే చెందుతుంది. కాగా నటి విజయ లలిత కి కేవలం నటన ప్రతిభ మాత్రమే కాకుండా నాట్య రంగంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో అప్పట్లో పలు నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చింది. కానీ నటన పై మున్సిపల్ గడ్డంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం బాగానే ప్రయత్నించింది.

అయితే ఆ మధ్య నటి జయలలిత ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమయిన కార్యక్రమంలో పాల్గొని తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పంచుకుంది. కృష్ణా జిల్లాలోని గుడివాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగానని తెలిపింది. అలాగే తన చదువులు కూడా గుడివాడలో ఉన్నటువంటి ఓ ప్రముఖ కాలేజీలో చదువులు పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. అలాగే తాను చదువుకునే రోజుల్లోనే నాట్య రంగంలో మంచి పట్టు సాధించానని తెలిపింది. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీ వైపు వచ్చానని తెలిపింది.

అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన కుటుంబ పరిస్థితుల రీత్యా మరియు ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చేయడంతో కొన్నిసార్లు బోల్డ్ సన్నివేశాలు మరియు బి గ్రేడ్ చిత్రాలలో నటించాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత కొందరు దర్శక నిర్మాతలు కూడా తనకి ఇలాంటి పాత్రలే ఆఫర్ చేయడంతో కాదనకుండా నటించానని చెప్పుకొచ్చింది. అయితే తను బోల్డ్ సన్నివేశాలలో నటించడం వెనక వేరే ఎలాంటి దురుద్దేశం లేదని కేవలం తన వృత్తికి న్యాయం చేయడం కోసం మరియు పాత్రలు డిమాండ్ చేయడం వల్లే నటించానని తెలిపింది. కానీ ఒక్కోసారి తను నటించిన బోల్డ్ సన్నివేశాలు పాత్రల వల్ల అవమానాలు ఎదురైనప్పటికీ తను పెద్దగా పట్టించుకోలేదని కానీ అయిన వాళ్లే తనని అర్థం చేసుకోకుండా మాట్లాడినప్పుడు చాలా బాధ పడ్డానని తెలిపింది.

అయితే ఒకప్పుడు తాను సినిమాల్లో హీరోయిన్ గా మరియు ఇతర పాత్రలలో నటించి బాగానే డబ్బు సంపాదించానని చెప్పుకొచ్చింది. కానీ భీమవరం పరిసర ప్రాంతానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు సీరియల్ తీస్తున్నామని అబద్ధాలు చెప్పి తనతో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో ప్రస్తుతం తనికి సొంత ఇల్లు మరియు కారు కూడా లేకుండా కాలం గడుపుతున్నానని ఎమోషనల్ అయ్యింది. కానీ తనని ఆర్థికంగా మోసం చేసినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పడానికి మాత్రం నటి జయలలిత ఇష్టపడలేదు.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియళ్ళలో నటిస్తూ ప్రస్తుతం బాగానే రాణిస్తున్నానని తెలిపింది. వెండి తెరపై తనకు చేదుజ్ఞాపకాలు మిగిలినప్పటికీ బుల్లితెరపై మాత్రం తనకు మంచి ప్రేక్షకాదరణ లభించిందని ఇంతగా తనని ఆదరించినవంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Previous articleNithiin : నితిన్ సినిమా కి పవన్ కళ్యాణ్ అలా హెల్ప్ చేసాడట… అందుకే….?
Next articleAjith Kumar : అజిత్ ని హీరో చెయ్యడం కోసం ఆ హీరోయిన్ చాలా కష్టపడిందట.. దాంతో పెళ్లి కూడా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here