Ramaprabha కి ఆ స్టార్ డైరెక్టర్ ప్రతి నెల డబ్బులు పంపిస్తాడట…

433

Ramaprabha : టాలీవుడ్ లో దాదాపు గా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి భామ్మ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా రమాప్రభ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపుగా కొన్ని వందల కుపైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించింది. అయితే నటి రమాప్రభ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు ధారావాహికలో కూడా నటించింది బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది.

నటి రమాప్రభ 1964వ సంవత్సరంలో ఓ తమిళ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన సర్వర్ సుందరం అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత క్రమక్రమంగా తెలుగు చిత్రాలలో సినిమా ఆఫర్లు దక్కించుకుని బాగానే రాణించింది. ఈ క్రమంలో నటి రమాప్రభ తెలుగు ప్రముఖ సీనియర్ నటుడైన శరత్ బాబు ని 1981వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. దీంతో పరస్పర అంగీకారంతో నటి రమాప్రభ తన భర్త శరత్ బాబు తో 1988వ విడాకులు తీసుకుంది. దీంతో అప్పటి నుంచి నటి రమా ప్రభ మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితం గడుపుతోంది.

అయితే నటి రమాప్రభ కి సంతానం లేకపోవడంతో రెండేళ్ల వయసు ఉన్నప్పుడు విజయ చాముండేశ్వరి అనే బాలికను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ నటుడయిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ విషయం గురించి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. కాగా ప్రస్తుతం నటి రమాప్రభ నటనకి బ్రేక్ ఇచ్చి కొంతమేర సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న తన సొంత నివాసంలో కాలం గడుపుతోంది.

కాగా నటి రమాప్రభ ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకు ఉన్నటువంటి అత్యంత సన్నిహితుల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా తనకు టాలీవుడ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అయితే ఆ మధ్య పూరి జగన్నాథ్ ఓ సారి కనిపించినప్పుడు తన దగ్గరకు వచ్చి ఎందుకు సినిమాల్లో నటించడం లేదని అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చింది. దాంతో తాను మాత్రం ఆ దేవుడి దయ వల్ల ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్పానని అయినప్పటికీ పూరి జగన్నాథ్ వినకుండా ప్రతినెల దాదాపుగా 25 వేల రూపాయలు తన నెలసరి ఖర్చుల నిమిత్తం పంపుతుంటారని తెలిపింది.

అయితే మొదట్లో పూరిజగన్నాథ్ తను డబ్బులు పంపుతున్నట్లు చెప్పలేదని దాంతో తన మేనేజర్ ద్వారా కొన్ని నెలల నుంచి తనకు తెలియకుండా పూరిజగన్నాథ్ నెలల డబ్బులు పంపుతున్నట్లు తెలిసిందని తెలిపింది. దాంతో వెంటనే పూరిజగన్నాథ్ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెబితే మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మను చూసినట్లు ఉంటుందని అలాగే తల్లికి డబ్బులు పంపించడంతో తప్పేముందని చెప్పాడని తమ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

నిజానికి ఇలాంటి గొప్ప సన్నిహితులు తనకు దొరికినందుకు ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు చెబుతూ కొంతమేర ఎమోషనల్ అయ్యింది. కాగా నటి రమా ప్రభ ఇటీవలే తెలుగులో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ అనే చిత్రంలో చిన్నపాటి పాత్రలో కనిపించింది. కానీ ఇతర సినిమా ఆఫర్లు మాత్రం అంగీకరించడం లేదు.

Previous articleసెల్ ఫోన్ ను కనిపెట్టడం వెనుక ఆసక్తికర కథ!
Next articleNuvvu naku nachhav చిత్రంలో హీరో ఛాన్స్ మిస్ అయిన తెలుగు హీరో… ప్రస్తుతం అవకాశాల్లేక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here