Online Shoping చేస్తున్నామంటే గాలిలో రాయి విసురుతున్నట్లే. బయట షాపుల్లో వందల లైట్లు పెట్టి మన కళ్లను ఎలా మోసం చేస్తారో ఆన్ లైన్ లో పేర్లు, రంగు పోలికలే ఉండవు. స్క్రీన్ మీద కలర్ ఫుల్ గా కనిపించేవి బయట….చీప్ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా డీల్స్ ఉన్నప్పుడు బ్రాండెడ్ బట్టలు కొన్నారంటే అంతే సంగతులు. రేటు సగమే ఉంటుంది. కానీ బట్టలపై బ్రాండ్ కనిపిస్తుంది. కాకపోతే తమ దగ్గర ఉన్న సరుకును అమ్ముకోవడం కోసం డ్యామేజ్ అయిన పీస్ లు, లేదంటే మిగిలిన చీప్ క్లాత్ తో షర్ట్స్ వేసి అంటగడతారు. వాస్తవానికి మనకు ఇచ్చే డిస్కౌంట్ లో సగం కూడా అవి వాల్యూ చేయవు. ఒక్క సారి వాడితే కానీ వాటి క్వాలిటీ ఏంటో చెప్పలేం.
ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నామంటే పేరుతో పాటు డిస్క్రిప్షన్ కూడా చదువుకోవాలి. కంపెనీలు అన్నీ నీట్ గా రాస్తాయి. కాకపోతే వినియోగదారుడికి అర్దం కాకుండా డీటెయిల్స్ పెడతారు. బీన్ బ్యాగ్స్ విషయంలో ఈ మోసాలు ఎక్కువ. చెప్పేది ఒకటి , చూపించేది ఒకటి, మనకు డెలివరీ అయ్యేది మరొకటి.
అమెరికాలో ఒక తల్లి తమ కూతురికి స్కూల్ బ్యాగ్ ఆర్డర్ చేసింది. చీప్ గా వస్తుందని అనుకుని సంబరపడింది. ముందుగానే డబ్బులు చెల్లించింది. కానీ ఇంటికొచ్చిన పార్శిల్ చూస్తే కానీ ఆమెకు అసలు విషయం బోధపడలేదు. క్యాట్ స్కూల్ బ్యాగ్ అని పిల్లలు ఆడుకునే ఒక బ్యాగ్ ని అంటగట్టింది ఆ కంపెనీ. ఇక ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కంపెనీ చెప్పినవే ఉన్నాయి.
ఇక లేడీస్ బ్యాగ్ లు ఫోటోకు, డిస్క్రిప్షన్ కు సంబంధమే ఉండదు. చేతికొచ్చాక కానీ దాని అవతారం కానీ కనిపించదు. అమెరికాలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ. డిజైనర్ డ్రెస్ లను చూసి గర్ల్స్ టెంప్ట్ అవుతారు. ఇక మ్యారేజ్ కోసం పేరున్న డిజైనర్ల పేర్లతో డ్రెస్ లు అమ్ముతుంటారు. కానీ నూటికి 80శాతం డెలివరీ అయ్యేవన్నీ చీప్ క్లాత్ తో చేసినవేనట. డిస్కౌంట్ పేరుతో మనకు డబుల్ టోకరా వేస్తాయి కంపెనీలు. ఇక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఫోన్ ల దగ్గర్నుంచి టీవీల వరకు, టెక్నికల్ సమస్యలు వచ్చినవీ, రిపేర్లు వచ్చినవి, ఎక్స్‌చేంజ్ గూడ్స్ అన్నీ కలిపి డీల్స్ లో భాగంగా వినియోగదారులకు అంటగడతాయి. వాటిని భరించడమో లేదంటే ఎక్స్‌చేంజ్ చేయడమో జరుగుతుంది. కానీ కంపెనీలు మాత్రం వీలైనంత వరకు స్టాక్ ను వదిలించుకునేందుకే ఈ డీల్స్ పెడతాయి,. తప్పితే కండీషన్ లో ఉన్నవి ఎందుకు తక్కువ ధరకు ఇస్తాయో ఒక్క సారి ఆలోచించండి.