ది కశ్మీర్ ఫైల్స్ – సోషల్ మీడియాను ఊపేస్తున్న సినిమా, కన్నీరు తెప్పించే కథ

821
The-Kashmir-Files
The-Kashmir-Files

ది కశ్మీర్ ఫైల్స్…ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న సినిమా. డాక్యుడ్రామా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ పండిట్ల నరకయాతనను తన సినిమాలో బంధించాడు. తాష్కెంట్ ఫైల్స్ తో దేశ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్న అగ్నిహోత్రి మరోసారి సామాజిక ఇతివ్రుత్తాన్ని కథగా ఎంచుకున్నారు. మొదట చిన్న సినిమాగా విడుదలైన ది. కశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాలు స్రుష్టిస్తోంది. 5 థియేటర్ల నుంచి 5వందల థియేటర్స్ నా దాటేసింది కశ్మీర్ ఫైల్స్. అయితే దర్శకుడు మొదట కశ్మీర్ పండిట్లకు ఈ సినిమా ను చూపించారు. సినిమా చూసిన తర్వాత స్వతహాగా తాను చిన్నప్పుడు కశ్మీర్ లో పడ్డ కష్టాన్ని తెరపై చూసి వెక్కి వెక్కి ఏడ్చారు ఒక మహిళ. అంతే కాదు చిన్నవాడైనా సరే అగ్నిహోత్రి కాళ్లకు దండం పెట్టి బోరుమంది ఆ మహిళ. దర్శకుడు అగ్నిహోత్రి కూడా కన్నీరుమున్నీరయ్యాడు.

మా కన్నీళ్లను ప్రపంచానికి చూపించారు. మా కుటుంబాలు, మా బంధువులు అంతా చనిపోయారు. కశ్మీర్ లోని పండిట్ల జీవితం ఎంత నరకమో తెరపై చూసి తట్టుకోలేకపోయాననంటూ ఆమె తన బాధను దర్శకుడితో పంచుకున్నారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్. ది కశ్మీర్ ఫైల్స్ లో అనుపమ్ ఖేర్, మిథన్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవీ జోషి, ప్రకాష్ బెలావాడి, పునీత్ ఇస్సార్, అతుల్ శ్రీవాత్సవలు సినిమాలో జీవించారు. మరీ ముఖ్యంగా అనుపమ్ ఖేర్, పల్లవీ జోషి, దర్శన్ లు సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమా లో అన్నింటికంటే చెప్పాల్సినవి రెండు. నటులు పర్ఫెక్ట్ గా జీవించారు. కానీ కెమరా పనితనం, దాని వెనకాల వచ్చిన బ్యాక్ గ్రౌండ్ సినిమాకు ప్రాణాన్ని పోశాయి. తెరపై నటుల బాధలను గుండెల్లో గుచ్చేలా చేశాయి.

The-Kashmir-Files
The-Kashmir-Files

దాదాపు రెండు గంటల 50 నిమిషాల నిడివి ఉన్న సినిమాను ప్రేక్షకుడు ఊపిరి భిగబట్టి చూస్తాడు. అలా అని ఇది రంగు రంగుల ప్రేమ కథ కాదు, హీరో వర్సెస్ విలన్ ఫైట్స్ అసలే కాదు. 1990ల్లో జమ్ముకశ్మీర్ లో తిరుగుబాటు ముస్లిం తీవ్రవాదుల నుంచి మొదలైంది. జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేతలు యాసిన్ మాలిక్, బిట్టా కరాటేలు పాకిస్తాన్ తీవ్రదాస సంస్థలతో చేతులు కలిపి కశ్మీర్ పండిట్లను ఊచకోత కోశారు. భారత జవాన్ ల డ్రెస్సుల్లో వచ్చి మహిళలపై అత్యాచారం చేశారు. మతం మారండి లేదా చావండని వేలాది మందిని ఊచకోత కోశారు. నాటి ఈ ఘటనకు ప్రత్యక్ష కారణంగా ఫరూక్ అబ్ధాల్లాతో పాటు ముఫ్తీ మహ్మద్ సయ్యద్ లను చూపించారు. ఇక చివరగా ఊహించిన విధంగానే కాంగ్రెస్ ను బ్లేమ్ చేశాడు దర్శకుడు.

కశ్మీర్ పండిట్ల రక్తపు బిందువులను తెల్లటి మంచుపై కెమరాతో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. అందమైన కశ్మీర్ లో పండిట్ల నరకయాతనను బుల్లెట్ చప్పులతో చూపించారు. అంతే కాదు మీ పెళ్లాళ్లను, ఆడవారిని కశ్మీర్ లో వదిలి వెళ్లండి. మేము వారితో ముస్లిం పిల్లలను కంటాము అనే డైలాగ్ ప్రతి ఒక్కరి రక్తాన్ని మరిగేలా చేసింది. కొడుకును, కోడలిని, కుటుంబం మొత్తం పోగొట్టుకున్నా తన జీవితం కశ్మీర్ లోనే మొదలైంది. ఇక్కడే ఉంటాను. అవసరమైతే ఇక్కడే చస్తానని పండిట్ గా నటించి అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ను పతాకస్థాయికి తీసుకెళ్లాడు. ప్రతి కేరక్టర్ సినిమాలో పండిట్ల రక్తపు జీవితాన్నిచూపించి కన్నీరు పెట్టించింది.

తీవ్రవాదులు, స్తానిక వేర్పాటు వాదులు హిందువు పండిట్లు, సిక్కులు సహా అందరినీ ఊచ కోత కోశారు. వారి ఆస్తులను దోచుకున్నారు. మహిళలపై వారి ముందే అత్యాచారం చేశారు. బిడ్డ ముందే తల్లిని, కొడుకు ముందే తండ్రిని చంపారు. ఒక తండ్రి ముందే కూతురు అత్యాచారానికి గురైతే ఆ బాధ ఎలా ఉంటుందో ది కశ్మీర్ ఫైల్స్ లో చూపించాడు దర్శకుడు. 1990ల్లో జరిగిన ఈ ఘటన ను ఇన్నేళ్లకు తెర రూపంలోకి తీసుకురాగలిగారు. ఈ సినిమాను కేవలం నెల రోజుల్లోనే చిత్రీకరించాడు అగ్నిహోత్రి. కానీ స్క్రిప్ట్ కోసం ఆయన రెండేళ్లు కష్టపడ్డారు. సినిమా షూటింగ్ ను కశ్మీర్ లో చేయొద్దని టీమ్ కు ఎన్నో సార్లు బెదిరింపులు వచ్చాయి. కానీ ప్రభుత్వ మద్దతుతో పూర్తి చేశారాయన.

ఇక సినిమాను అడ్డుకునేందుకు చాలా మంది కోర్టులకు వెళ్లారు. తన భర్త దేశం కోసం పోరాడి, పండిట్ల ను కాపాడి ప్రాణాలు కోల్పోయాడు. నా భర్త ముస్లిం అయినా కూడా ఆయన త్యాగాన్ని చూపించలేదని ఓ మహిళ కోర్టుకెక్కడం కూడా చర్చనీయాంశమైంది. అంతే కాదు ఈ సినిమా మళ్లీ ఒక వర్గాన్ని వేరు చేసేలా , మత విద్వేశాలను రెచ్చ గొట్టేలా ఉందని ముంబై హై కోర్టులో పిల్ వేసినా కోర్టు సరైన ఆధారాలు లేవని కొట్టేసింది. నిజమైన కథనే సినమా గాతీశారని చెప్పడం విశేషం.

Previous articleకళ్ళముందు కనిపిస్తున్నావని ఆనంద పడాలా ? ఇక కనిపించవని బాధ పడాల ?
Next articleSridevi : అప్పట్లో హీరోయిన్ శ్రీ దేవి సినిమాల్లో నటించాడని కి అలాంటి కండిషన్లు పెట్టేదట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here