Prashanth Ranjitha:భార్య కిడ్నీలో రాళ్లున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్లి కిడ్నీ అమ్మేసిన భర్త.. ఆ డబ్బుతో మరో పెళ్ళి …

740
Prashanth Ranjitha
Prashanth Ranjitha

Prashanth Ranjitha Story

చీటింగ్ చేస్తే ఎట్లాండాలి. బనీన్ కు తెలియకుండా డ్రాయర్ కొట్టేయాలి. కానీ ఈ డైలాగ్ కు బాప్ ఒకడున్నాడు. వీడు డీజే టిల్లు అయితే వాడు ఏకంగా కిడ్నీ టిల్లు. ఇదేంటనుకుంటున్నారా? పెళ్లాం నడుం గిల్లి ఏకంగా కిడ్నీ కొట్టేశాడో దేశ్ కీ నేతా. అతి ప్రేమ చూపిస్తే ఏ పెళ్లామైనా సరే ఒంట్లో కిడ్నీ ఉందా? పోయిందా అనే తేడా లేకుండా లవ్ చేస్తుందని నిరూపించిందో మహాతల్లి. వాడు చూపించిన ప్రేమకు బాబోయ్ తట్టుకోలేనంటూ ఉక్కిరిబిక్కిరి అయింది. వైఫ్ కి తలనొప్పి లేస్తే జండూ బామ్ రాశాడు. నడుం నొప్పి అనగానే మూవ్ తో మర్ధన చేశాడు. ఇంకేముంది భార్య తుమ్మినా సరే వేడినీటి ఆవిరి పెట్టి మరీ మురిపెం చూపించి జేబులో పెట్టుకున్నాడు. ఇక మొగుడి హైవోల్టేజ్ లవ్ కి ఆమెకు ఏం జరుగుతుందో తెలియదు. బహుషా పైన గాడెస్ కు కూడా ఇ లాంటి మొగుడు దొరికి ఉండడు. నిజంగా నా భర్తను చూస్తే దేవతులు కూడా కుళ్లుంటారని రోజూ దిష్టి తీసేది. మరి అంతలా చక్కిలిగింతల రాగం పాడిన ఆ మగమహారాజు ఏం చేసాడంటే….ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే….వద్దు. ఒకే సారి క్లైమాక్స్ కు వెళ్తే మజా రాదు. మొత్తం స్టోరీ టైటిల్స్ దగ్గర్నుంచి వినండి.

Prashanth Ranjitha
Prashanth Ranjitha

ఈ స్టోరీలో చీటింగ్ హీరో పేరు ప్రశాంత్ కందూ. ఇతను బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చాడు. హిందువు కావడంతో లీగల్ గానే వలస వచ్చిన శరణార్ధిగా బతుకుతున్నాడు. 2009 లో ఒడిషాలోని కోటమెట గ్రామంలో సెటిలయ్యాడు. ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ తన ఇంటిదగ్గర ఉండే రంజితను లైన్ లో పెట్టాడు. అతనికి ఎవరూ లేరు. పైగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువు. విలేజ్ లో బెస్ట్ మగపురుషుడిగా పేరు తెచ్చుకున్నాడు. పెద్దలు కనిపిస్తే అతని నడుము ఆటోమేటిక్ గా వంగిపోయేది. చేతులు అలా కలిసి పోయి దండం పెట్టేది. ఉదయమే లేచి గాయత్రి మంత్రం చదివి కూలీ పనిచేసేవాడు. ఇంతటి మంచి మనసుకు రంజిత పడిపోయింది. అతనికి అప్పటికే ఆణిముత్యం అనే పాస్ పోర్ట్ ఉంది. అందుకే కట్నం తక్కువైనా పర్వాలేదు. రంజిత కావాలన్నాడు. దాంతో రంజిత తల్లిదండ్రులు అతనికిచ్చి పెళ్లిచేశారు.
ఒకానొకరోజు దొంగ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ ను ఆమె తాగే నీళ్లల్లో కలిపి ఇచ్చాడు. తెల్లారే సరికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. నొప్పితో విలవిలలాడుతున్న …రంజితను పెద్దాసుపత్రికి తీసుకెళ్తాను. ఎంత కష్టపడైనా సరే నీకు నయం అయ్యేవరకు వదిలిపెట్టనని కన్నీళ్లు పెట్టకున్నాడు. ఆమెను భువనేశ్వర్ లోని బీ గ్రేడ్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇది పేరుకు కార్పొరేట్ కానీ…ట్రీట్ మెంట్ ఆర్ ఎంపీ రేంజ్ లో ఉంటుంది. ఇక డాక్టర్ ను కలిసి మీకు కావాల్సిన కిడ్నీ దొబ్బేసి నాకు క్యాష్ ఇవ్వమన్నాడు.

మరిన్ని వివరాల కోసం Prashanth Ranjitha వీడియోని తప్పకుండా చూడండి…

Read Our Another Article Cyrus Mistry

Previous articleCyrus Mistry:కాల్చకుండా,పూడ్చకుండా అంత్యక్రియలు ఎలా చేస్తారు.? మిస్త్రీ అంత్యక్రియలు ఎలా జరిగాయి.?
Next articleKrishna-Indira Devi అలాంటి విషయంలో కూడా గౌరవాన్ని కాపాడిన దేవత ఇందిర దేవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here