Srihari : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు రియల్ స్టార్ శ్రీహరి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు శ్రీహరి అప్పట్లో ఎలాంటి డూప్ లేకుండా స్వతహాగా ఫైట్లు చేయడం, స్టంట్లు చేయడం వంటివి చేయడంతో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నటుడు శ్రీహరి అసలు పేరు శ్రీ రఘుముద్రి శ్రీహరి అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కాగా నటుడు శ్రీ హరి కేవలం హీరో పాత్రలో మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో మరియు విలన్ పాత్రలో కూడా నటించి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ క్రమంలో దాదాపుగా కొన్ని వందలకు పైగా చిత్రాలలో హీరోగా, విలన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
అయితే నటుడు శ్రీహరి ని ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎంతోమంది నటీనటులు మరియు దర్శకులను పరిచయం చేసిన టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ నటుడు మరియు లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు “బ్రహ్మ నాయుడు” అనే చిత్రం ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దాంతో నటుడు శ్రీహరి ఎక్కువగా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన చిత్రాలలో కనిపిస్తుంటాడు. అయితే నటుడు శ్రీహరి సినీ కెరియర్ లో బాగానే సెటిల్ అయిన సమయంలో ఉన్నట్టుండి కాలేయ సంబంధిత వ్యాధి భారిన పడి మరణించాడు. దీంతో ఈ విషయం అప్పట్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టించింది.
అయితే ఇటీవలే నటుడు శ్రీహరి భార్య మరి ఒకప్పటి స్పెషల్ సాంగ్ సేమ్ డిస్కోశాంతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శ్రీహరి మృతికి గల కారణాలు గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. అయితే తన భర్త శ్రీహరి ఇ మరణించిన సమయంలో ప్రముఖ దర్శకుడు ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఆర్… రాజ్ కుమార్ అనే చిత్రం షూటింగులో పాల్గొంటున్నాడని దాంతో తాను తన భర్త శ్రీహరి ముంబైలో ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో శ్రీహరి ఇ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఉదయం మూడు గంటల సమయంలో హోటల్ కి వచ్చాడని అనంతరం అల్పాహారం తీసుకుని పడుకున్నాడని ఆతర్వాత ఉన్నట్లుండి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందని కేకలు వేశాడని దాంతో మేకప్ ఉమెన్ మరియు అసిస్టెంట్ సహాయంతో ముంబై లో ఉన్నటువంటి లీలావతి ఆసుపత్రికి తరలించానని తెలిపింది.
ఈ క్రమంలో తను తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండగా అర్ధరాత్రి సమయంలో లో ఆస్పత్రిలో పని చేస్తున్నటువంటి ఓ నర్స్ వచ్చి సెలైన్ బాటిల్ లో ఇంజక్షన్ చేసి వెళ్లిందని ఇక అప్పటి నుంచి తన భర్త పరిస్థితి తీవ్ర విషమంగా మారిందని తెలిపింది. దాంతో తాను బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి నర్సులు వెంటనే వచ్చి తను బయటికి తీసుకెళ్లారని ఈ క్రమంలో తన సోదరి లలిత మరియు సోదరుడు అరుణ్ కుమార్ తదితరులు ఆస్పత్రికి వచ్చారని కానీ తనని మాత్రం శ్రీహరిని చూసేందుకు అస్సలు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
దాంతో తన భర్తతో కడసారి మాటలకు కూడా నోచుకోలేక పోయానని ఎమోషనల్ అయ్యింది. అయితే అప్పటికే నటుడు శ్రీహరి కొంతమేర బరువు పెరగడంతో కృత్రిమ పద్ధతిలో బరువు తగ్గేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. దాంతో ఈ ప్రభావం కాలేయం మీద పడడంతో పలు కాలేయ సంబంధిత వ్యాధులకు గురయ్యాడని ఈ కకారణం వల్లే నటుడు శ్రీహరి మరణించాడని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు.
అయితే నటుడు శ్రీహరి మరణాంతరం డిస్కో శాంతి పలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంది. కాగా అప్పట్లో నటుడు శ్రీహరి కొన్ని వందల చిత్రాలలో నటించినప్పటికీ సినిమాలలో నటించడం ద్వారా వచ్చేటువంటి రెమ్యూనరేషన్ లో ఎక్కువ శాతం మొత్తాన్ని దాన ధర్మాలకు ఉపయోగించేవాడు. ఈ క్రమంలో ఎవరైనా కష్టం వచ్చిందని ఇంటి గుమ్మం తొక్కితే లేదనకుండా ఎంతో కొంత సహాయం చేసేవాడు. దాంతో శ్రీ హరి ఆప్త మిత్రులను సంపాదించుకోవడం తోపాటు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నప్పటికీ తన పిల్లలకు మాత్రం పెద్దగా ఆస్తులను కూడబెట్టలేక పోయాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి ఆ మధ్య తెలుగు నూతన దర్శకులు అర్జున్ మరియు కార్తిక్ కలసి సంయుక్తంగా తెరకెక్కించిన రాజ్ దూత్ అనే చిత్రంలో హీరోగా నటించి ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.