ANR : తన పంతం నెగ్గించుకోవడానికే ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించాడా…?

125

ANR : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో ఎంతోమంది నటీనటులను ప్రోత్సహించడమే కాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో నిర్మించి చాలా మందికి ఉపాధి కల్పించారు. దీంతో నేటితరం యువ దర్శక నిర్మాతలకు సినిమా షూటింగుల విషయంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం వెనక చాలా పెద్ద కథ ఉందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కాగా ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనుక ఉన్నటువంటి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులోభాగంగా అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావుగారు 1953వ సంవత్సరంలో హీరోగా నటించిన దేవదాసు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. దాంతో అక్కినేని నాగేశ్వరరావు ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్ హక్కులను మరియు రీమేక్ హక్కులను కూడా అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ ను స్థాపించి కొనుగోలు చేశాడని తెలిపాడు. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ 1974వ సంవత్సరంలో దేవదాసు చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేసి తెలుగులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో మళ్లీ అక్కినేని నాగేశ్వరరావు కూడా దేవదాసు చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియడంతో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన దేవదాసు చిత్ర యూనిట్ సభ్యులు అక్కినేని నాగేశ్వరరావుని సంప్రదించి తన దేవదాసు చిత్రాన్ని విడుదల చేయొద్దని రిక్వెస్ట్ చేశారట.

అయితే ఇందులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు కొనుగోలు చేశాడని అలాగే కాట్రగడ్డ శ్రీనివాసరావు ప్రస్తుతం ఉన్నటువంటి సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పని చేశాడని తెలిపాడు. మరోవైపు కాట్రగడ్డ శ్రీనివాసరావుకి అక్కినేని నాగేశ్వరరావుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దాంతో నాగేశ్వర రావు హీరోగా నటించిన దేవదాసు చిత్రం కృష్ణ హీరోగా నటించిన దేవదాసు చిత్రానికి పోటీగా విడుదల చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు చిత్రాన్ని విడుదల చేయొద్దని రిక్వెస్ట్ చేశాడట.

అయినప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు కాట్రగడ్డ శ్రీనివాస రావు మాట వినకుండా తను నటించిన దేవదాసు చిత్రాన్ని విడుదల చేయడంతో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన దేవదాసు చిత్రానికి చాలా నష్టాలు వచ్చాయని తెలిపాడు. దీంతో కాట్రగడ్డ శ్రీనివాసరావు అక్కినేని నాగేశ్వరరావుని సారథి స్టూడియోస్ లోకి అనుమతించవద్దని సారధి స్టూడియోస్ లో పనిచేసే స్టాఫ్ కి చెప్పాడట. అయితే అక్కినేని నాగేశ్వరరావు తన దేవదాసు చిత్రం విడుదల తర్వాత అమెరికాకి వెళ్లి పోవడంతో సంవత్సరం పాటు అమెరికాలోనే గడిపి మళ్లీ సినిమా షూటింగ్ నిమిత్తం ఇండియాకి వచ్చాడని పేర్కొన్నాడు. కానీ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు షూటింగ్ చేసేందుకు సారథి స్టూడియోస్ లోకి అనుమతి లేకపోవడంతో తప్పనిసరిగా తనకంటూ ఓ సినిమా స్టూడియో నిర్మించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చాడు.

సరిగ్గా ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి గా ఉన్నటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి జలగం వెంగల్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోస్ నిర్మించాలనుకునే వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో పాటు స్థలం కూడా ఇస్తామని ప్రకటించడంతో అక్కినేని నాగేశ్వర రావు వెంటనే ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారని తెలిపాడు. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కూడా వచ్చాడని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ప్రముఖ స్వర్గీయ నటుడు నందమూరి తారక రామారావుకి కూడా స్థలం కేటాయిస్తామని స్టూడియో నిర్మించుకొమ్మని ప్రభుత్వ అధికారులు సూచించడంతో ఎన్టీఆర్ ఏకంగా ప్రస్తుతం సంజీవయ్య పార్క్ ఉన్నటువంటి స్థలాన్ని స్టూడియో నిర్మాణం కోసం అడిగాడట. దీంతో ప్రభుత్వ అధికారులకు అందుకు అంగీకరించలేదని తెలిపాడు. కానీ నందమూరి తారకరామా రావు మాత్రం తనకంటూ సొంతంగా స్టూడియో ఉండాలని ముషీరాబాద్ దగ్గర్లో ఉన్నటువంటి రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించాడని ఆ తర్వాత ఈ స్టూడియోస్ ని నాచారంకి షిఫ్ట్ చేశారని చెప్పుకొచ్చాడు.

Previous articleBride cheating : ఇంటికొచ్చిన రోజే అలా చేసిన కొత్త కోడలు… దెబ్బకి అందరూ ఆసుపత్రిలో చేరారు…
Next articleSurekhavani : నటి సురేఖ వాణి జీవితంలో ఇంత విషాదం దాగుందా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here