Anupama parameswaran looks like pregnant
Anupama parameswaran : తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అ ఆ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అయితే ఈ అమ్మడికి అందం, అభినయం వంటివి మెండుగా ఉండటంతో సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి కానీ దురదృష్టవశాత్తు ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోవటానికి సరైన హిట్ లేక పోవడంతో హిట్ కోసం అనుపమ పరమేశ్వరన్ బాగానే శ్రమిస్తోంది.
కానీ ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా కలిసి రావడం లేదు. అయితే ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో రౌడీ బాయ్స్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీనికితోడు ఈ చిత్రంలో Anupama parameswaran కొంతమేర గ్లామర్ డోస్ పెంచి ఏకంగా గ్లామర్ షో చేయడంతోపాటు లిప్ కిస్ సన్నివేశాలలో కూడా నటించింది. ఈ విషయం సినిమాకి కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ అభిమానులు మాత్రం అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో నటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అయితే తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ ఫోటోలలో ఏముందంటే అనుపమ పరమేశ్వరన్ గర్భవతిగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో చూసిన అనుపమ పరమేశ్వరన్ అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కానీ ఈ ఫోటోలకు అనుపమ పెట్టిన క్యాప్షన్ చూసి కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఫోటోలపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. దీంతో తాజాగా ఈ ఫోటోలు చూసినటువంటి తెలుగు ప్రముఖలేడీ కమెడియన్ విద్యుల్లేఖ కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది. ఇందులో భాగంగా ఒక్కసారిగా ఈ ఫోటోలు చూసి “కంగ్రాట్స్ చెబుదామనుకున్నా” అంటూ కామెంట్ చేసింది. దాంతో అనుపమ పరమేశ్వరన్ “ఊప్స్” అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో “18 పేజెస్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో హీరోగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గీత ఆర్ట్స్2 బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
If you like our article please check all articles in our website by visit srimedia website