బ్రహ్మాస్త్రం కంటే కూడా చాలా శక్తివంతమైన అస్త్రాలు ఏంటో తెలుసా ?

912
Asthralu
Asthralu

పురాణ ఇతిహాసాలలో ఎన్నో రకాల అస్త్రాల గురించి చెప్పారు. వాటిలో ఒక్కొక్క అస్త్రానికి ఒక్కొక్క శక్తి ఉంది. నేటి యుగంలో కూడా ప్రయోగించడానికి సాధ్యపడని అనేకరకాలైన అస్త్రాలను రామాయణ మహాభారత కాలంలో ఉపయోగించారు అని మన పురాణాలు చెబుతున్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనవి వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇంద్రాస్త్రం, నాగాస్త్రం ఇలా ఎన్నో అస్త్రాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అన్నిటి కంటే చాలా శక్తివంతమైన అస్త్రంగా బ్రహ్మాస్త్రం గురించి చెప్తారు. నీటికి ఎవరైనా తిరుగులేని విషయం గురించి చెప్పే అది బ్రహ్మాస్త్రం అని మనం ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వినాశనమే జరుగుతుంది వెనక్కి తీసుకోవడానికి అనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ బ్రహ్మాస్త్రం కంటే శక్తివంతమైన అస్త్రాలు మరో ఐదు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Asthralu
Asthralu

వాటిలో మొదటిది బ్రహ్మ శీర్షాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు శక్తివంతమైనది. ఈ అక్షరాన్ని ఎలా ఉపయోగించాలి అనేది రామాయణ కాలంలో ఇంద్రజిత్ కి మాత్రమే తెలుసు. మహాభారత కాలంలో భీష్మ, పరశురామ, ద్రోణా, అశ్వద్ధామల కు తెలుసు. నీ అస్త్రాన్ని కురుక్షేత్రం చివరిలో అశ్వద్ధామ పరీక్షిత్ మహారాజు మీదకి ప్రయోగించాడు.
ఇక రెండవది నారాయణాస్త్రం. ఇది కూడా బ్రహ్మాస్త్రం కంటే శక్తివంతమైనది. ఈ అస్త్రాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి. ఒకవేళ రెండోసారి ప్రయోగిస్తే ఈ అస్త్రం వెనక్కి వస్తుంది. మహాభారతం ప్రకారం ఈ అస్త్రాన్ని ద్రోణ అశ్వద్ధామ లకు సాక్షాత్తు విష్ణుమూర్తి ఇచ్చారు. ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత అశ్వద్ధామ ఈ అస్త్రాన్ని పాండవుల మీదికి ప్రయోగించాడు.
మూడవది బ్రహ్మాండం శాస్త్రం ఈ అస్త్రాన్ని బ్రహ్మ ఐదు తలల నుంచి తయారు చేశారు. ఒక్క క్షణ కాలంలో పూర్తిగా సౌర కుటుంబం మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఈ అస్త్రానికి ఉంది. ఈ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని పరశురాముడు భీష్మ ద్రోణ కర్ణ లకు నేర్పించాడు. కానీ కర్ణుడు శాపం కారణంగా ఈ అస్త్రాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మ శీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన అటువంటి శక్తి ఈ బ్రహ్మాండా అస్త్రానికి ఉంది.
భార్గవ అస్త్రం బ్రహ్మశీర్షాస్త్రం తో సమానం. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఈ అస్త్రానికి ఉంది. ఒక్కసారి భార్గవ అస్త్రం ఉపయోగిస్తే బూడిద కూడా మిగలదు అని చెబుతుంటారు. రక్షించుకోవడం కోసం ఈ అస్త్రాన్ని వాడితే బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మశీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి ఉంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు పాండవులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అస్త్రాన్ని పరశురాముడు కర్ణుడికి ఇచ్చాడు.
మహా పాశుపతాస్త్రం. మన హిందూ ధర్మం ప్రకారం మన విశ్వంలో ఉన్న అన్ని అస్త్రాల కంటే కూడా ఇది చాలా శక్తివంతమైనది. దీనికి ఎదురెళ్లి తే ఎలాంటిదైనా కూడా నాశనమై బూడిదగా మిగిలిపోతుంది. దీన్ని పొందాలి అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. మహాభారతంలో అర్జునుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఈ పాశుపతాస్త్రాన్ని పొందాడు. కానీ ఎక్కడా దానిని ఉపయోగించే అవసరం అర్జునుడికి రాలేదు. ఇవి బ్రహ్మాస్త్రం కంటే కూడా చాలా శక్తివంతమైన అస్త్రాలు.

Previous articleGangubai kathiawadi సినిమాలోని గంగూ భాయ్ గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..
Next articleసరస్వతి దేవి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here