Model : బెలూన్లు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు స్టార్ మోడల్… ఎలాగంటే….?

1025

Model : 20వ దశాబ్ద కాలంలో సోషల్ మీడియా మీడియా మాధ్యమాల ప్రభావం ప్రజలపై ఎంతగానో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సెల్ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా మాధ్యమాలు ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎంతో మంది ఉపాధి కూడా పొందుతున్నారు. దీంతో ఇంటి వద్దే ఉంటూ కొందరు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

మరికొందరైతే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఏకంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అంది పుచ్చుకున్నారు. కాగా ఆ మధ్య ఊరూరా తిరిగి బాదం పల్లీల అమ్ముకునే టువంటి భుబన్ అనే వ్యక్తి కచ్చా బాదం అనే పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. దీంతో ప్రస్తుతం భుబన్ దాస్ కి మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా కి ఉన్నటువంటి పవర్ ఏమిటో అని.

అయితే తాజాగా కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మరో యువతి ఉన్నట్టుండి ఓవర్ నైట్ లో ని మోడల్ గా అవతరించింది. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం… కేరళ రాష్ట్రంలో కిస్బూ అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది. అయితే కిస్బూ తండ్రి తన చిన్నప్పుడు అనారోగ్య సమస్యలతో మరణించాడు. దీంతో ఆమె తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే కిస్బూ తల్లి కడు పేదరికంలో ఉండటంతో ఆమెను చదివించే లేకపోయింది. అలాగే కిస్బూ తల్లి కుటుంబ పోషణ నిమిత్తమై స్థానిక ప్రాంతాలలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మరియు పార్కుల వద్ద గారి బుడుగులను అమ్ముకుంటూ ఉండేది.

దీంతో అప్పుడప్పుడు కిస్బూ కూడా తన తల్లితో కలిసి బెలూన్స్ అమ్మేందుకు వెళుతూ ఉండేది. ఈ క్రమంలో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అర్జున్ కృష్ణ కంటపడింది. దీంతో కిస్బూ బెలూన్స్ అమ్ముతున్న సమయంలో ఆమె ఫోటోలను తీశాడు అనంతరం తన కుటుంబ సభ్యుల అనుమతితో సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశాడు. ఇంకేముంది ఓవర్ నైట్ లో కిస్బూ స్టార్ మోడల్ అయిపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ అమ్మడికి మోడలింగ్ రంగంలో ఆఫర్లు వరించడంతో పాటు పలు వస్త్రాలకు సంబంధించిన సంస్థలు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడానికి కూడా సంప్రదిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కిస్బూ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.

Previous articleBhagwant Mann : కమెడియన్ టూ చీఫ్ మినిస్టర్.. గెలుపంటే ఇలా ఉండాలి…!
Next articleMega hero : ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మెగా బ్రదర్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here