Best food for eyes : ఈ పదార్థం తో ఎలాంటి కంటి సమస్య అయినా చిటికెలో పోతుంది
Best food for eyes “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” ప్రస్తుత కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా రోజు రోజుకి ఈ కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో లోపం ఉండడం వల్ల కంటి చూపు అనేది మందగిస్తుంది. ఇక చాలామంది చిన్నప్పటినుంచే చాలా పెద్ద సైజు కళ్లద్దాలను వాడుతూ ఉంటారు. దీనితో కూడా కంటిచూపు మందగిస్తుంటుంది. దీనితో ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మన తాతలు అమ్మమ్మలు కాలంలో ఎలాంటి కళ్లజోడు లు లేవు వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ మనం మాత్రం ఏది పడితే అది తిని విటమిన్లు లేని ఆహారం తీసుకోవడం వల్లనే ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా కంటి చూపు సమస్య అనేది విటమిన్ల లోపం వల్లనే వస్తుంది. దీంతో చాలామంది లేజర్ ఆపరేషన్స్ చేయించుకుని కంటిచూపును సరిచేసుకుంటూ ఉన్నారు. ఈ ఆపరేషన్ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఇంటి చిట్కాలు పాటిస్తూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొన్ని రోజులలోనే కంటి చూపు సమస్యలను అధిగమించవచ్చు. అయితే ఈ చిట్కా ని నమ్మకంతో ప్రయత్నించి చూడండి కచ్చితంగా మీ కంటి చూపు అనేది మెరుగు అవుతుంది.
అయితే ఈ చిట్కా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ముఖ్యంగా కావలసిన పదార్థం బాదం పప్పులు .బాదంపప్పు లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ,విటమిన్ ఈ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కంటి సంబంధిత సమస్యలను పోగొట్టడానికి చక్కటి పరిష్కారం. దీని కోసం ఒక నాలుగు బాదంపప్పులను తీసుకుని రాత్రంతా నానబెట్టండి ఉదయాన్ని ఆ నానబెట్టిన బాదం పప్పులు పైన ఉన్న పొట్టును పూర్తిగా తీసేసి వాటిని రోటిలో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి కావలసినది నల్లమిరియాలు. ఒక నాలుగు నల్ల మిరియాలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక రెండు స్పూన్ల పటిక బెల్లం పొడిని దీంట్లో కలుపుకొని మెత్తని పొడి లాగా చేసుకోవాలి. ముఖ్యంగా మన గొంతు సంబంధిత సమస్యలకు మిరియాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. గొంతుకే కాదు మన కంటికి కూడా మిరియాలు చాలా మంచిది. మిరియాల లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన కంటికి సంబంధించిన సమస్యలలో మాక్యులార్ డీజనరేషన్ కి వచ్చే సమస్య కారణంగా చూపు కోల్పోయే ప్రమాదం వంటి వాటికి కూడా మిరియాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇక పటికి బెల్లం అనేది మన శరీరానికి చలువ చేయడంతోపాటు మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇలా తయారుచేసిన ఈ పేస్ట్ని ఒక గ్లాసు పాలలో కలిపి ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఇలా మరిగించిన పాలను వడపోసు కోకుండా నేరుగా ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చగా తీసుకోండి. ఇలా గనుక ప్రతి రోజు మీరు ఈ పాలను తాగడం వలన కొన్ని రోజులలోనే మీ కంటి చూపు అనేది చాలా చక్కగా మెరుగవుతుంది.
ప్రస్తుతం కరోనా కారణంగా ఇప్పుడు పిల్లల కంటి చూపు కి కూడా ముప్పు వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు కారణంగా పిల్లల కంటి చూపు పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎక్కువగా సెల్ఫోన్లో క్లాసెస్ వినడం, చూడడం వలన పిల్లలకి కంటి నొప్పి ,తలనొప్పి, కంటి పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు డాక్టర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి కూడా ప్రతిరోజు ఈ పాలని తప్పకుండా ఇవ్వండి. అలాగే మునగ ఆకులను కూడా మీ ఆహారంలో తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మునగాకులో కూడా కాల్షియం విటమిన్ ఏ, బి పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలకి బలం తో పాటు నేత్ర సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. మునగాకు రసం తీసి సమానంగా మోతాదులో ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి ప్రతిరోజు తీసుకుంటే మీ కంటి చూపు బాగా మెరుగవుతుంది. చర్మరోగాలు కూడా రాకుండా ఉంటాయి. కండరాలు ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. లేదా మునగాకును పప్పులో వేసి ఉడికించి తీసుకున్నా కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. విటమిన్ సి ఉన్న పండ్లను కూడా ప్రతిరోజూ మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కంటి చూపును మెరుగు పరచడానికి విటమిన్ సి కూడా చాలా అవసరం. నిమ్మకాయలు, ఉసిరికాయలను కూడా ఎక్కువగా తీసుకోండి. ఉసిరికాయ కూడా ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఉసిరికాయ అనేది మన కనుబొమ్మల లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలను తయారయ్యేలా చేస్తుంది. ప్రతిరోజు గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ రసాన్ని కలుపుకుని ఉదయం కానీ సాయంత్రం కానీ తాగుతూ ఉన్నా కళ్ళలో వాపు ,దురద, మంటలు ఇలాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అలాగే విటమిన్-సి ఎక్కువగా ఉండే క్యారెట్ ,యాపిల్ పాలకూర, బీట్రూట్, కోడిగుడ్డు ఇలాంటి మంచి ఆహార పదార్థాలు ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే మీ దృష్టిలోపం సమస్య నుంచి కూడా మీరు చాలా సులభంగా బయటపడవచ్చు.
ఈ ఆహార పదార్థాలతో పాటు కంటి వ్యాయామం కూడా తప్పకుండా చేయాలి. ఈ వ్యాయామం ఎలా చేయాలి అంటే మీ కనుబొమ్మలను కొంచెం సేపు మసాజ్ చేస్తూ ఉండాలి. గోరువెచ్చని నీటిలో ఒక మెత్తటి బట్టను తడిపి ఒక అయిదు నిమిషాలపాటు మీ కళ్ళ మీద పెట్టుకోండి. లేదా ఒకటి రెండు చుక్కలు నువ్వుల నూనేను కంటి చుట్టూ రాస్తూ కళ్ళని కిందకి పైకి పక్కకి తిప్పుతూ ఎక్సర్సైజులు చేస్తూ ఇలా చేస్తూ ఉన్నా కూడా తప్పకుండా మీ కంటి చూపు అనేది మెరుగవుతుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటించినట్లయితే ఎటువంటి కంటిచూపు సమస్యలు అయినా కూడా పూర్తిగా తగ్గిపోతాయి.
If you like our article about Best food for eyes
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites