Bhagwant Mann : కమెడియన్ టూ చీఫ్ మినిస్టర్.. గెలుపంటే ఇలా ఉండాలి…!

536

Bhagwant Mann : ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఉన్నటువంటి 117 అసెంబ్లీ స్థానాలలో దాదాపుగా 92 పైగా స్థానాలలో భారీ మెజారిటీతో గెలిచింది. దీంతో ఈ నెల 16 వ తారీఖున సార్వత్రిక ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేందుకు ఎంతగానో కృషి చేసిన భగవంత్ మాన్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

కాగా ఇటీవలే ఈ సార్వత్రిక ఎన్నికలు ఐదు రాష్ట్రాలలో జరగగా ఇందులో పంజాబ్ రాష్ట్రం మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ విజయకేతనం ఎవరు వేసింది. కానీ పంజాబ్ రాష్ట్రంలో మాత్రం బిజెపి ఆటలు సాగలేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీని విజయబాటలో నడిపించిన భగవంత్ సింగ్ మాన్ ఎవరు అతడి రాజకీయ చరిత్ర ఏమిటనే విషయాలను గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

అయితే భగవంత్ సింగ్ మాన్ 1993వ సంవత్సరంలో అక్టోబర్ 17వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ పరిసర ప్రాంతంలో జన్మించాడు. కాగా భగవంత్ సింగ్ మాన్ పంజాబీ యూనివర్సిటీ లో చదువును పూర్తి చేశాడు. చదువుకునే రోజుల్లోనే భగవంత్ సింగ్ మాన్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో అప్పుడప్పుడు కాలేజీ స్టూడెంట్ యూనియన్ తో కలిసి పలు సమస్యలపై పోరాటం చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో పంజాబీ భాషలో దాదాపుగా డజనుకు పైగా చిత్రాలలో కామెడీ ఒరియెంటెడ్ పాత్రలలో నటించాడు. అంతేకాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించాడు.

ఈ క్రమంలో ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. చక్కని భార్య, పిల్లలు అంతో ఇంతో ఆర్థికంగా సెటిల్ అయిన ఫ్యామిలీ వంటివాటితో సాఫీగా సాగిపోతున్న సమయంలో నటుడు భగవంత్ సింగ్ మాన్ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2011వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ (పిపిపి) పార్టీలో చేరి కొంతకాలం పాటు సేవలందించాడు.

కానీ పిపిపీ పార్టీలో తన సేవలకు గుర్తింపు లభించకపోవడంతో 2014వ సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. వచ్చీరావడంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున 2014వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సంగ్రూర్ నియోజకవర్గం లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి దాదాపుగా 2 లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందాడు. ఆ తరువాత 2017వ సంవత్సరంలో జలాలాబాద్ నియోజకవర్గంలో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి 18500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ క్రమంలో గెలుపు ఓటములను చూసినటువంటి భగవంత్ సింగ్ మాన్ ఎప్పుడూ కూడా ఓటమి కి కుంగిపోలేదు.

అలాగే ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు ఎంతగానో కృషి చేశాడు. అందుకు ఫలితంగా భగవంత్ సింగ్ మాన్ కి ముఖ్యమంత్రి పదవి దక్కబోతోంది. దీంతో ఈనెల 16 వ తారీఖున పంజాబ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అలాగే నటుడిగా ప్రేక్షకులను తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన భగవంత్ సింగ్ మాన్ మరి తన పరిపాలనతో ప్రజలను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Previous articleఆ తల్లికి చేపలాంటి బేబీ పుట్టింది?
Next articleModel : బెలూన్లు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు స్టార్ మోడల్… ఎలాగంటే….?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here