Lara Dutta: కొంతమంది నటీనటుల నటన పరంగా తమ ప్రతిభను నిరూపించుకునే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తమ వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో తమ వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఏకంగా ఒకటి, రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నటీనటులు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మరికొందరైతే తమ ప్రేమాయణం విఫలమవడంతో పూర్తిగా పెళ్లి బంధానికి దూరమైన నటీనటులు కూడా లేకపోలేదు. అయితే పలు బాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే ప్రేక్షకులను బాగానే అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటి లారా దత్తా గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా నటి లారాదత్తా సినీ ఇండస్ట్రీకి రాకముందు కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా ఆ పని చేసింది ఈ క్రమంలో రెండువేల సంవత్సరంలో మిస్ యూనివర్స్ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి క్రమక్రమంగా అవకాశాలు దక్కించుకుంటూ కొంతకాలం పాటు బాగానే రాణించింది.
వైవాహిక జీవితంలో తీసుకున్న నిర్ణయాలు
అయితే నటన పరంగా అడపాదడపా అవకాశాలు దక్కించుకొని పర్వాలేదనిపించినా లారా దత్తా తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయింది. కాగా అప్పట్లో పలు తెలుగు చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ విలన్ కెల్లీ డోర్జీ తో ప్రేమలో పడి దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటు డేటింగ్ కూడా చేసారు. దీంతో అందరూ వీరిద్దరూ తొందరలోనే కలిసి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఏమైందో ఏమోగాని ఉన్నట్లుండి ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత కొంతకాలం పాటు లారా దత్తా సినీ ఇండస్ట్రీ పై దృష్టి సారించింది. ఈ క్రమంలో అప్పట్లో తనతోపాటు ఓ చిత్రానికి పనిచేసిన ప్రముఖ దర్శకుడిని లారా దత్తా ప్రేమించింది. కానీ ఈ ప్రేమ కూడా పెళ్లికి దారి తీయలేదు.
టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతితో లారా దత్త ప్రేమ వివాహం
మళ్ళీ కొంతకాలం తర్వాత లారా దత్తా భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. దీంతో ఇటీవలే లారా దత్తా తన భర్త మహేష్ భూపతి కి విడాకులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ సైరా అనే ఒక పాప ఉంది. దాంతో తాము అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ 10 సంవత్సరాల పాటు పాపని ఇద్దరూ కలిసి చూసుకోవాలని ముందే నిర్ణయించుకున్నామని ఆ మధ్య నటి లారా దత్తా ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఏదేమైనప్పటికీ నటి లారా దత్తా తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే తన వ్యక్తిగత జీవితంలో మరియు సినీ జీవితంలో నిలదొక్కుకోలేకపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లారా దత్తా కి పెద్దగా సినిమా ఆఫర్లు చేతిలో లేవు. దీంతో ఈ మధ్యకాలంలో నటి లారా దత్తా సీరీస్ లలో నటించడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites