Divorce : విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్… కారణం అదేనట…

129

Divorce : మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ సంబంధాల మధ్య బలం కూడా తగ్గిపోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికితోడు ఈ మధ్య కాలంలో మానవుల ఆలోచనా తీరు కూడా మారడం, మనకంటూ జీవితంలో ఒక తోడు లేకపోయినప్పటికీ ఒంటరిగా ధీమా గా బ్రతుకుతామనే నమ్మకం ఎక్కువగా ఉండటంతో పెళ్లయి 10, 20 సంవత్సరాలు కలసి కాపురం చేసినవాళ్ళు కూడా చాలా సులభంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడంతో పాటూ తమ మాజీ భార్యలకు కోట్ల రూపాయల భరణంగా కూడా ఇచ్చారు. కాగా తాజాగా మరో స్టార్ కపుల్స్ విడాకులు తీసుకుని విడిపోతూ తమ సోషల్ మీడియా మాద్యమాలలో అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే పలు బాలీవుడ్ సీరియళ్ళలో హీరో గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న అమీర్ అలీ 2012 వ సంవత్సరంలో తనతో పాటూ పలు ధారావాహికలు, చిత్రాలలో నటించిన బాలీవుడ్ ప్రముఖ సీరియల్ నటి సంజీదా షేక్ ని ప్రేమించి ఇరువురి కుటుంభం సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో వీరిద్దరూ చాలా అంన్యోన్యంగా ఉండేవాళ్ళు. దీంతో ప్రస్తుతం వీరిద్దరికి ఐరా అలీ అనే ఒక పాప కూడా ఉంది.

కాగా గత 3 సంవత్సరాలుగా అమీర్ అలీ కెరియర్ పరంగా మరియు వ్యక్తిగతంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దీంతో అమీర్ అలీ మరియు సంజీదా షేక్ ల మధ్య గత కొద్ది కాలంగా మనస్పర్థలు, విబేధాలు తలెత్తాయి. దీంతో తమ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ క్రమంలో తమ కూతురి బాద్యతని సంజీదా షేక్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో వీరిద్దరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం బూవుడ్ సినీ టౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు అమీర్ అలీ హిందీ లో 4 చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. అలాగే దాదాపుగా 10కి పైగా ధారావాహికలలో హీరోగా నటించాడు. కాగా నటుడు అమీర్ అలీ ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ విడోస్ అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థయిన జీ5 లో ప్రసారమవుతోంది. ఇక నటి సంజీదా షేక్ విషయానికొస్తే ప్రస్తుతం పంజాబీ, హిందీ తదితర భాషలలో 2 చిత్రాలలో నటిస్తోంది. అలాగే ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న హిందీ వెబ్ సిరీస్ లో నటించే వకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Previous articleKalpalatha : చిన్నప్పుడే తల్లదండ్రులకి అనారోగ్యం, 14 ఏళ్లకే పెళ్లి… కల్పలత కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు…
Next articleMarriage : పెళ్లి మండపం లోనే కానిచ్చేసిన నూతన జంట… శోభనం వరకూ ఆగలేరా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here